మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
9, 11వ తరగతి తుది పరీక్షల్లో తప్పిన విద్యార్థులకు మరో అవకాశం
పాఠశాల స్థాయిలో మళ్లీ నిర్వహించే పరీక్షలో పాల్గొనేందుకు అవకాశం
కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి సలహా మేరకు సీబీఎస్‌ఈ నిర్ణయం
Posted On:
14 MAY 2020 7:32PM by PIB Hyderabad
కొవిడ్-19 కారణంగా దేశంలో నెలకొన్న ఊహించని పరిస్థితుల దృష్ట్యా, 9, 11వ తరగతి ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ పరీక్షల్లో తప్పిన విద్యార్థులకు మరో అవకాశం ఇవ్వాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ సీబీఎస్‌ఈకి సూచించారు. ఆ సూచన మేరకు సీబీఎస్‌ఈ ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది.
https://twitter.com/DrRPNishank/status/1260887906287140865?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1260887906287140865&ref_url=https%3A%2F%2Fpib.gov.in%2FPressReleasePage.aspx%3FPRID%3D1623867
తన నోటిఫికేషన్‌లో సీబీఎస్‌ఈ ఈ విధంగా పేర్కొంది. "కొవిడ్-19 కారణంగా మొత్తం భారతదేశం ఇబ్బందులు పడుతోంది. ఇది ఊహించని పరిస్థితి. చిన్నారులు ఇళ్లకే పరిమితమయ్యారు. పాఠశాలలు మూతబడ్డాయి. వాళ్లు మానసిక ఒత్తిడి, భావోద్వేగంలో ఉన్నారు. జీతాలు, కుటుంబ ఆరోగ్యం గురించి వారి తల్లిదండ్రులు ఆందోళన పడుతున్నారు. ఈ కఠిన పరిస్థితుల్లో, విద్యార్థులు పాఠశాల పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేకపోవడం బాధను మరింత పెంచుతుంది. దీనిపై విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి సీబీఎస్‌ఈ నిరంతరాయంగా ప్రశ్నలు, విజ్ఞప్తులు అందుకుంది. ఈ కఠిన పరిస్థితుల్లో అందరం కలిసి విద్యార్థులను మానసిక ఒత్తిడి నుంచి, భావోద్వేగాల నుంచి దూరం చేయడానికి ప్రయత్నిద్దాం".
విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు, 9, 11వ తరగతి పరీక్షల్లో తప్పిన విద్యార్థులు పాఠశాల స్థాయిలో మళ్లీ నిర్వహించే పరీక్షలో పాల్గొనేందుకు అవకాశమివ్వాలని సీబీఎస్‌ఈ నిర్ణయించింది. ఇప్పటికే పరీక్షలు రాసిన, ఫలితాలు విడుదలైన, పరీక్షలు రాయలేకపోయిన విద్యార్థులందరికీ ఈ అవకాశం వర్తిస్తుందని సీబీఎస్‌ఈ స్పష్టం చేసింది. సబ్జెక్టులతోను, ఎన్నిసార్లు పరీక్ష రాశారన్న అంశంతోనూ సంబంధం లేకుండా అందరికీ సమానంగా ఈ అవకాశాన్ని సీబీఎస్‌ఈ వర్తింపజేసింది.
సీబీఎస్‌ఈ ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకునే విద్యార్థులందరికీ ఆన్‌లైన్/ఆఫ్‌లైన్/సృజనాత్మక పరీక్షలను పాఠశాలలు నిర్వహించొచ్చు. ఆ పరీక్షల్లో వచ్చిన ఫలితాల ఆధారంగా వారి ఉత్తీర్ణతను నిర్ణయించవచ్చు. విద్యార్థులు విఫలమైన అన్ని సబ్జెక్టులలో పరీక్షలు నిర్వహించవచ్చు. పరీక్షల నిర్వహణకు ముందు, విద్యార్థులు ఆయా సబ్జెక్టుల్లో సిద్ధమవడానికి తగిన సమయాన్ని పాఠశాలలు ఇవ్వాలి. 9, 11వ తరగతుల్లో తప్పిన విద్యార్థులకు మళ్లీ పరీక్షలు నిర్వహించే అవకాశం అన్ని సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలలు పొందుతాయి. ఈ నోటిఫికేషన్‌కు ముందే ఇలాంటి అవకాశం పొందిన విద్యార్థులకు కూడా మళ్లీ పరీక్ష రాసే అవకాశం వర్తిస్తుందని సీబీఎస్‌ఈ పునరుద్ఘాటించింది.
కొవిడ్-19 కారణంగా అనుకోని పరిస్థితులు ఎదుర్కొంటున్నందున ఈ అవకాశం ప్రస్తుత విద్యాసంవత్సరానికి మాత్రమే పరిమితం. దీనిని భవిష్యత్తులో పునరుద్ధరించరు.
(Release ID: 1623943)
Visitor Counter : 232