వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

2020 ఏప్రిల్ నెల‌లో భార‌త‌దేశంలో హొల్‌సేల్‌ధ‌ర‌ల ఇండెక్ప్ నంబ‌ర్లు ( బేస్ : 2011-12=100)

Posted On: 14 MAY 2020 11:55AM by PIB Hyderabad

 

డిపార్ట‌మెంట్ ఫ‌ర్ ప్ర‌మోష‌న్ ఆఫ్ ఇండ‌స్ట్రీ, ఇంట‌ర్న‌ల్ ట్రేడ్ కు చెందిన ఆఫీస్ ఆఫ్ ఎక‌న‌మిక్ అడ్వ‌యిజ‌ర్  2020 ఏప్రిల్ నెల‌కు సంబంధించి హోల్‌సేల్ ధ‌ర‌ల సూచి (డ‌బ్ల్యుపిఐ) విడుద‌ల
కోవిడ్ -19 మహమ్మారి వ్యాప్తి కారణంగా 2020 ఏప్రిల్ నెలలో టోకు మార్కెట్లో జ‌రిగిన ఉత్పత్తుల పరిమిత లావాదేవీల దృష్ట్యా, ఎంచుకున్న ఉప-సమూహాలు , డబ్ల్యుపిఐ గ్రూప్‌ల‌ ధరలలో మార్పుకు సంబందించిన వివ‌రాల‌ను విడుదల చేయాలని నిర్ణయించ‌డం జ‌రిగింది. అన్ని క‌మాడిటీల‌కూ డ‌బ్ల్యు.పి.ఐ  అందుబాటులో లేనందున అన్ని వస్తువుల WPI ను ఏప్రిల్ -2020 కోసం లెక్కించలేదు.
ప్రైమ‌రీ ఆర్టిక‌ల్స్‌కు  చెందిన ధ‌ర‌ల సూచీల‌ను వ్య‌వ‌సాయ మంత్రిత్వ‌శాఖకు చెందిన డైర‌క్ట‌రేట్ ఆఫ్ ఎక‌న‌మిక్ , స్టాటిస్టిక్స్‌నుంచి  వ‌చ్చిన వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల మండీ ధ‌ర‌ల ఆధారంగా లెక్కించ‌డం జ‌రిగింది. ఇండియ‌న్ బ్యూరో ఆఫ్ మైన్స్ ఖ‌నిజాల‌కు సంబంధించి ఎక్స్ మైన్ ధ‌ర‌ను ప‌రిగ‌ణ‌న లోకి తీసుకోవ‌డం జ‌రిగింది. ముడి చ‌మురు, పెట్రోలియం, స‌హ‌జ‌వాయువుల‌ను  పెట్రోలియం, స‌హ‌జ‌వాయు మంత్రిత్వ‌శాఖ లేదా ఎంపిక చేసిన పి.ఎస్‌.యులు,  బొగ్గు కంట్రోలర్ కార్యాలయం , సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ నుండి వ‌చ్చిన  ధరల డేటా ఆధారంగా ఇంధన , విద్యుత్ ప్రధాన గ్రూప్‌ల‌ ధర ల సూచికలు లెక్కించడం జ‌రుగుతోంది. ఈ ప్రధాన  ధరల సూచికలు (ప్రైమ‌రీ ఆర్టిక‌ల్స్ , ఇంధనం , విద్యుత్‌) ప్రామాణిక విధానాలతో ఏప్రిల్ 2020 కి సంబంధించి విడుదలయ్యాయి.  ఎస్టిమేష‌న్ ప్రోసీజ‌ర్ల‌లో ఎలాంటి మార్పులు చేయలేదు

కోవిడ్ -19 మ‌హ‌మ్మారి వ్యాప్తికి సంబంధించి  ప్ర‌భుత్వం తీసుకుంటున్నముంద‌స్తు జాగ్ర‌త్త చ‌ర్య‌లు, ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన లాక్‌డౌన్ చ‌ర్య‌ల కార‌ణంగా,త‌యారైన ఉత్ప‌త్తుల‌కు సంబంధించిన ధ‌ర‌ల సేక‌ర‌ణ‌కు , వ్య‌క్తిగ‌తంగా వెళ్ళి ధ‌ర‌లు తెలుసుకునే ప‌ద్ధ‌తిని  19 మార్చి 2020 నుంచి ఆపివేశారు. ఎక్స్ ఫ్యాక్ట‌రీ ధ‌ర‌ల‌కు సంబంధించి డాటాను ఎంపిక చేసిన ఫ్యాక్ట‌రీలు, వ్య‌వ‌స్థాగ‌త సోర్సుల‌నుంచి  ఎల‌క్ట్రానిక్ క‌మ్యూనికేష‌న్ ప‌ద్ధ‌తిలో సేక‌రించారు. టోకు ధ‌ర‌ల సూచికి సంబంధించి ఈ గ్రూప్‌లు, స‌బ్ గ్రూప్‌ల ధ‌ర‌ల చ‌ల‌నం
.ఎంచుకున్న కర్మాగారాలు , సంస్థాగత వనరుల నుండి ఎలక్ట్రానిక్ మార్గాల ద్వారా డేటా ( ఎక్స్ ఫ్యాక్టరీ ధరలు) సేకరించడం జ‌రిగింది. WPI కి చెందిన  ఈ స‌బ్ గ్రూప్‌లు , గ‌్రూప్ ల ధరల చ‌ల‌నం, ఎంచుకున్న ఉత్పాదక యూనిట్ల నుండి కనీసం 25% ధర కొటేషన్లు రిపోర్ట్ అయిన  వస్తువుల ధరలను మాత్రమే తీసుకొని పనిచేశాయి.
పై ప్రమాణాల ఆధారంగా తయారు చేసిన ఉత్పత్తుల కోసం 22 NIC  రెండు అంకెల సమూహాలలో, సూచికలు 5 ఉత్పాదక గ్రూప్‌ల‌కు  మాత్రమే త‌యారు చేయబడ్డాయి, అనగా, ఆహార ఉత్పత్తుల తయారీ, పానీయాల తయారీ, రసాయనాలు  రసాయన ఉత్పత్తుల తయారీ, ఔష‌ధ‌ తయారీ, ఔషధ రసాయన ,బొటానికల్ ఉత్పత్తులు  ప్రాథమిక లోహాల తయారీ  వంటివి.
ప్రైమ‌రి ఆర్టిక‌ల్స్ ( వెయిట్ 22.62 శాతం):
ఈ ప్రధాన  గ్రూప్‌ సూచిక ఏప్రిల్ 20 నాటికి (-0.9%) 138.2 (పి) కు 139.5 (పి) నుండి అంత‌కు ముందు నెల‌తో పోలిస్తే  క్షీణించింది. ఖనిజాల ధరలు (2.3%), ఆహార వ‌స్తువులు (0.7%) ఆహారేతర వ‌స్తువులు (0.1 మునుపటి నెలతో పోలిస్తే ముడి పెట్రోలియం & సహజ వాయువు (-24.7%) ధరలు తగ్గాయి.
ఫ్యూయ‌ల్‌, ప‌వ‌ర్ (వెయిట్ 13.15 శాతం):
ఈ ప్రధాన గ్రూపు , సూచిక ఏప్రిల్ 20 లో (-8.2%) 92.4 (పి) కు 100.7 (పి) నుండి మునుపటి నెలకు తగ్గింది. మినరల్ ఆయిల్స్ గ్రూప్ (-14.11%)  విద్యుత్ (-3.39%) ధరలు క్షీణించగా, బొగ్గు ధరలు మునుపటి నెలతో పోలిస్తే మారలేదు.
త‌యారీ ఉత్ప‌త్తులు ( వెయిట్ 64.23 శాతం):
2020 ఏప్రిల్ నెలలో మార్కెట్లో ఉత్పత్తుల పరిమిత లావాదేవీల దృష్ట్యా, పరిమిత సంఖ్యలో ప్రధాన గ్రూప్‌లు , తయారు చేసిన ఉత్పత్తుల ఉపగ్రూప్‌ల‌ను మాత్రమే విడుదల చేయాలని నిర్ణయించారు.
ఆహార ఉత్పత్తుల తయారీ ధరలు (-0.29%), ఔషధ తయారీ,  ఔషధ రసాయన ,బొటానికల్ ఉత్పత్తుల తయారీ (-0.15%) ప్రాథమిక లోహాల తయారీ (-0.84%) తాత్కాలికంగా క్షీణించగా, రసాయనాలు , రసాయన ఉత్పత్తుల తయారీ ధరలు (0.86%) )  పానీయాల తయారీ (0.24%) మునుపటి నెలతో పోలిస్తే ఏప్రిల్ 20 లో తాత్కాలికంగా పెరిగింది.

డ‌బ్ల్యుపిఐ ఫుడ్ ఇండెక్స్ ( వెయిట్ 24.38 శాతం)
ప్రాథమిక ఆర్టికల్స్ గ్రూప్ నుండి 'ఆహార ఆర్టిక‌ల్స్‌ , తయారు చేసిన ఉత్పత్తుల సమూహం నుండి 'ఆహార ఉత్పత్తులు' కలిగిన ఆహార సూచిక తాత్కాలికంగా 2020 మార్చిలో 146.1 నుండి 2020 ఏప్రిల్‌లో 146.6 కు పెరిగింది. డబ్ల్యుపిఐ ఆహార సూచిక ఆధారంగా ద్రవ్యోల్బణ రేటు 5.49 నుండి  మార్చిలో 2020 తగ్గింది, కాగా 2020 ఏప్రిల్‌లో ఇది 3.60%.
2020 ఫిబ్ర‌వ‌రినెల‌కు తుది ఇండెక్స్ ( బేస్ సంవ‌త్స‌రం : 2011-12=100)
2020 ఫిబ్ర‌వ‌రి నెల‌కు సంబంధించి తుది హోల్ సేల్ ప్రైస్ ఇండెక్స్ , డ‌బ్ల్యు.పి.ఐ ఆధారిత ద్ర‌వ్యోల్బ‌ణ రేటు అన్ని క‌మాడిటీల‌కు ( బేస్ : 2011-12=100)14-02-2020నాటికి రిపొర్ట్ అయిన విధంగా  122.2  అలాగే 2.26 శాతం వ‌ద్ద ఎలాంటి మార్పు లేదు.
తదుప‌రి ప్రెస్ రిలీజ్ తేదీ : 2020 మే నెల‌కు 15-06-2020
ఆఫీస్ ఆప్ ఎక‌న‌మిక్ అడ్వ‌యిజ‌ర్‌, వాణిజ్యం,ప‌రిశ్ర‌మ‌ల మంత్రిత్వ‌శాఖ ,న్యూఢిల్లీ
ఈ ప్రెస్ రిలీజ్, ఐట‌మ్ సూచిక‌లు, ద్ర‌వ్యోల్బ‌ణ నంబ‌ర్లు ఈ వెబ్ సైట్ లో చూడ‌వ‌చ్చుhttp://eaindustry.nic.in



(Release ID: 1623829) Visitor Counter : 316