రైల్వే మంత్రిత్వ శాఖ

“శ్రామిక్ స్పెషల్” రైళ్ల ద్వారా భారతీయ రైల్వే 15 రోజులలోపు మిలియ‌న్ (పది లక్షల) మంది ప్రయాణికుల్ని తమ సొంత రాష్ట్రాలకు చేరవేసిన మైలురాయిని దాటింది

- భారత రైల్వే మే 14వ తేదీ ‌వరకు దేశవ్యాప్తంగా 800 “శ్రామిక్ స్పెషల్” రైళ్లను న‌డిపింది
- ప్రయాణికులకు ఉచితంగా భోజనం, నీరును అంద‌జేత
- ప్రయాణీకులను పంపే రాష్ట్రం మరియు వారిని స్వీకరిస్తున్న రాష్ట్రం రెండింటి సమ్మతి వ‌చ్చిన తరువాత మాత్రమే రైళ్లు నడుపుతున్న రైల్వే

Posted On: 14 MAY 2020 3:06PM by PIB Hyderabad

 

ప్రత్యేక రైళ్ల ద్వారా వలస కార్మికులు, యాత్రికులు, పర్యాటకులు, విద్యార్థులు మరియు వివిధ ప్రదేశాలలో చిక్కుకున్న ఇతర వ్యక్తుల ర‌వాణాకు సంబంధించి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు భారతీయ రైల్వే “శ్రామిక్ స్పెషల్” రైళ్లను నడపాలని నిర్ణయించింది. 14 మే 2020 నాటికి దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుండి మొత్తం 800 మేర “శ్రామిక్ స్పెషల్” రైళ్లు న‌డిచాయి. వీటి ద్వారా 10 లక్షలకు పైగా ప్రయాణికులు తమ సొంత రాష్ట్రానికి చేరుకున్నారు.
ప్రయాణీకులను పంపే రాష్ట్రం మరియు వాటిని స్వీకరిస్తున్న రాష్ట్రం రెండూ ఈ త‌ర‌లింపున‌కు  సమ్మతి ఇచ్చిన తరువాత మాత్రమే ఈ ప్ర‌త్యేక రైళ్ల‌ను రైల్వే శాఖ నడుపుతోంది. ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గఢ్‌, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ & కాశ్మీర్, జార్ఖండ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, మిజోరాం, ఒడిశా, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ‌, త్రిపుర‌, ఉత్త‌ర ప్ర‌దేశ్, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ త‌దిత‌ర రాష్ట్రాలలో ఈ రైళ్లు సేవ‌లందించాయి. “శ్రామిక్ స్పెషల్” రైలు ఎక్కే ముందు ప్రయాణీకులను త‌గిన విధంగా వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. వారి ప్రయాణ సమయంలో, ప్రయాణీకులకు ఉచిత భోజనం మరియు తాగు నీరు అందిస్తున్నారు.


(Release ID: 1623828) Visitor Counter : 274