సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
స్థానిక ఉత్పత్తులకు చేయూతనివ్వడానికి ముంందుకొచ్చిన కెవిఐసి
Posted On:
13 MAY 2020 6:50PM by PIB Hyderabad
స్థానిక ఉత్పత్తులకు మద్దతుగా నిలవాలని, వాటిని ముందుకు తీసుకుపోయి అంతర్జాతీయంగా వాటికి ఆదరణ పెరిగేలా చూడాలంటూ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపును అందుకున్న ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ ( కెవిఐసి) కార్యరంగంలోకి దూకింది. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలని ప్రధాని అభ్యర్థన చేసి ఒకరోజు కూడా గడవకముందే కెవిఐసి పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రతిష్టాత్మక పిఎంఇజిపి పథకం కింద ప్రాజెక్టుల అమలును వేగిరం చేయాలని కోరింది.
పిఎంఇజిపి కింద వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిశీలించి, బ్యాంకులకు పంపి 26 రోజుల లోపే నిధులు అందుకునేలా చేయాలని సంబంధిత ఏజెన్సీలకు కెవిఐసి ఛైర్మన్ శ్రీ వినయ్ కుమార్ సక్సేనా సూచనలు చేశారు. ఈ కాల పరిమితిని 15 రోజులకు తగ్గేలా చూడాలని ఆయన సూచించారు. ఆయా ఏజెన్సీలు దరఖాస్తుదారులకు అండగా నిలిచి వారు ప్రతిపాదనలు తయారు చేసుకునేలా సాయం చేయాలని, రుణాలు వచ్చేంతవరకూ చేయూతనివ్వాలని కోరారు. రుణాలు తొందరగా వచ్చేలా ఆయా ఏజెన్సీలు కృషి చేయాలని అన్నారు.
మారిన మార్గదర్శకాల ప్రకారం ముంబాయిలోని కెవిఐసి పర్యవేక్షణ విభాగం ప్రతి రోజూ ఈ దరఖాస్తులకు సంబంధించిన విషయాలను పర్యవేక్షిస్తుంది. ప్రతి పదిహేను రోజులకొకాసరి ఆయా అమలు ఏజెన్సీలకు ఫీడ్ బ్యాక్ ఇస్తుంది. ఆ తర్వాత ప్రగతి నివేదికను కెవిఐసి సిఇవో మరియు ఛైర్మన్ కు పంపుతారు.
స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలని ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు తర్వాత మార్గదర్శకాలను మార్చడం జరిగిందని శ్రీ సక్సేనా అన్నారు. స్వయం ఆధారిత విధానం దేశానికి ముఖ్యమైన విధానం కావాలని ప్రధాని చెప్పారు. పిఎంఇ జి పి కింద కార్యక్రమాలను సులభతరం చేస్తే స్థానికంగా తయారీ పరిశ్రమలు వృద్ధి చెందుతాయి. దీని వల్ల తక్కువ సమయంలోనే ఉద్యోగ ఉపాధి కల్పన పెరుగుతుందని శ్రీ సక్సేనా వివరించారు. లోకల్ నుంచి గ్లోబల్ వరకూ అనే విధానాన్ని అనుసరించడంద్వారా కెవిఐసి అనేది ఇతర స్థానిక పరిశ్రమలకు, కంపెనీలకు మార్గదర్శకంగా నిలుస్తుందని ఆయన అన్నారు.
స్థానిక ఉత్పత్తి పెంచడానికిగాను ప్రతి జిల్లాలో ఒక యూనిట్ స్థాపించి ఎన్ 95 మాస్కులను, వెంటిలేటర్లను, వాటికి సంబంధించిన ఇతర పరికరాలను, పిపిఇ కిట్లను, శానిటైజర్లను, థెర్మల్ స్కానర్లను, అగరబత్తీలు, సబ్బులు మొదలైనవాటిని వాటిలో ఉత్పత్తి అయ్యేలా చూస్తామని అన్నారు. కోవిడ్ -19 పై పోరాటంలో భాగంగా ఈ పని చేపట్టాలమని అన్నారు.
మారిన మార్గదర్శకాల ప్రకారం దరఖాస్తుదారులు వందకు 60 మార్కులు పొందాల్సి వుంటుందని ఈ విషయంలో ఆయా ఏజెన్సీలు జాగ్రత్త తీసుకోవాల్సి వుంటుంది. సాంకేతిక అందుబాటు, రవాణా, విద్యుత్ సౌకర్యాలు మొదలైనవి వున్నాయని అనుకున్న తర్వాతనే ఆయా దరఖాస్తులను బ్యాంకులకు పంపాలి లేకపోతే అవి తిరస్కరణకు గురయ్యే అవకాశముంటుంది.
ప్రతిపాదిత ఉత్పత్తులకు డిమాండ్ ఎలా వుందో తెలుసుకోవడానికి ఆయా ఏజెన్సీలు మార్కెట్ అధ్యయనం చేయాల్సి వుంటుంది. అలాగే ఆయా దరఖాస్తుల ప్రతిపాదనలు ఆయా బ్యాంకుల ప్రాంత పరిదిలో వుండేలా చూసుకోవాలి. లేదంటే దరఖాస్తులను ఆయా బ్యాంకుల తిరస్కరిస్తాయి.
*****
(Release ID: 1623738)
Visitor Counter : 241