సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

రియల్ టైం క్వారంటైన్ మైక్రో పి.సి.ఆర్. విధానానికి అవసరమైన కీలక భాగాలను తయారుచేస్తున్న - టెక్నాలజీ సెంటర్లు.

ఒక గంట లోపు కోవిడ్ -19 పరీక్షా ఫలితాలను ఇవ్వ గలిగే - యంత్రం

Posted On: 11 MAY 2020 6:13PM by PIB Hyderabad

భువనేశ్వర్, జంషెడ్ పూర్, కోల్కతా లలో ఉన్న ఎమ్.ఎస్.ఎమ్.ఈ. మంత్రిత్వశాఖకు చెందిన టెక్నాలజీ సెంటర్లు, విశాఖపట్నం లోని  ఏ.ఎమ్.టి.జెడ్. కోసం రియల్ టైం క్వారంటైన్ మైక్రో పి.సి.ఆర్. సిస్టం యొక్క క్లిష్టమైన భాగాలను ఇప్పుడు తయారుచేస్తున్నాయి.  మాములుగా 24 గంటలు పట్టే కోవిడ్-19 పరీక్ష ఫలితాలను ఈ యంత్రం ఒక గంట లోపు ఇస్తుంది. ఈ యంత్రాన్ని ఒక ప్రయివేటు ఎమ్.ఎస్.ఎమ్.ఈ. సంస్థ రూపొందించింది.  ఈ యంత్రాలు చిన్నగా, ఎప్పుడైనా, ఎక్కడికైనాపరీక్షలకు తీసుకువెళ్ళడానికి వీలుగా ఉంటాయి.  ఇటువంటి 600 టెస్టింగ్ మిషన్లకు అవసరమైన విడిభాగాలు తయారుచేయడానికి టెక్నాలజీ సెంటర్ల బృందాలు రోజుకు రెండు, మూడు షిఫ్టులు పనిచేస్తున్నాయి.  150 టెస్టింగ్ మిషన్లకు అవసరమైన విడి భాగాలు ఇప్పటికే ఏ.ఎమ్.టి.జెడ్. కు సరఫరా చేయడం జరిగింది.  ఈ యంత్రాల కోసం ఐదు మైక్రాన్ల ఖచ్చితత్వంతో పనిచేసే స్టైన్ లెస్ స్టీల్ విడిభాగాలను ప్రపంచంలోనే అత్యున్నతమైన మిషన్ల మీద తయారుచేస్తున్నారు

కరోనా పరీక్షలను అతి తక్కువ ఖర్చుతో నిర్వహించడానికి ఈ టెస్టింగ్ పరికరాలు సహాయపడతాయి. భువనేశ్వర్, జంషెడ్ పూర్, కోల్కతా లలో ఉన్న ఎమ్.ఎస్.ఎమ్.ఈ. మంత్రిత్వశాఖకు చెందిన టెక్నాలజీ సెంటర్ల క్రియాశీల సహకారం మద్దతుతో ఈ యంత్రాల తయారీ సాధ్యమయ్యింది. 

ప్రతి సంవత్సరం 2 లక్షలకు పైగా యువతకు, పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు ఆచరణాత్మక నైపుణ్యాభివృధిని అందించడంలో ఎమ్.ఎస్.ఎమ్.ఈ. మంత్రిత్వ శాఖ కు చెందిన టెక్నాలజీ సెంటర్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి.  ప్రస్తుతం ఉన్న ఈ 18 టెక్నాలజీ సెంటర్లు పరిశ్రమలకు టూల్స్ రూపకల్పన, తయారీ, ప్రెసిషన్ విడి భాగాలుమౌల్డులుడైలుఫోర్జింగ్ఫౌండ్రీ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ కొలత పరికరాలు, గ్లాస్, ఫుట్ వేర్క్రీడారంగ వస్తువులకు అవసరమైన సాంకేతిక సహాకారం, మద్దతు కల్పిస్తున్నాయి.  కొన్ని టెక్నాలజీ సెంటర్లు రక్షణ, అంతరిక్షం వంటి వ్యూహాత్మక రంగాలకు అవసరమైన పరిశోధన, అభివృద్ధి అవసరాలను కూడా తీరుస్తున్నాయి. 

ప్రస్తుత కోవిడ్-19 సంక్షోభంలో వైద్య పరికరాలు, పి.పి.ఇ., మాస్కులు, శానిటైజర్లు మొదలైన వస్తువుల తయారీకి సహాయపడుతూ టెక్నాలజీ సెంటర్లు చురుకుగా పనిచేస్తున్నాయి. 

ఎమ్.ఎస్.ఎమ్.ఈ. టెక్నాలజీ సెంటర్ల లక్ష్యాలు : 

• అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో టూల్ & డై తయారీ కోర్స్ (అనుబంధ ఇంజనీరింగ్ ట్రేడ్ లు) రంగంలో యువతకు దీర్ఘకాలిక, స్వల్ప కాలిక శిక్షణ ఇవ్వడం. 

• ఎమ్.ఎస్.ఎమ్.ఈ. యూనిట్ల ఉత్పాదకత పెంపొందించాలనే ఉద్దేశ్యంతో టూల్ ఇంజినీరింగు రంగంలో ప్రధానంగా ఎమ్.ఎస్.ఎమ్.ఈ. లకు సలహా, సంప్రదింపు సేవలు అందించడం. 

•  దేశంలోని ఎమ్.ఎస్.ఎమ్.ఈ. లకు ప్రెసిషన్ మిషనింగ్ / హీట్ ట్రీట్మెంట్ లలో సాధారణ సౌకర్యాల సేవలు మరియు టూలింగ్ లో ఇతర సాంకేతిక ఇంజనీరింగు పరిజ్ఞానం అందించడం. హై ప్రెసిషన్ నాణ్యతతో మౌల్డ్స్, టూల్స్, డైస్, జిగ్స్, ఫిక్చర్లు మొదలైనవి రూపొందించి, తయారు చేయడం 

*****(Release ID: 1623155) Visitor Counter : 236