గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
ఇంటిగ్రేటెడ్ కమాండ్, కంట్రోల్ సెంటర్ ద్వారా కొవిడ్‌పై డెహ్రాడూన్ పోరాటం
క్వారంటైన్ వార్డుల్లో 'ఫేస్ రికగ్నిషన్ సీసీటీవీ కెమెరాలు' ఏర్పాటు
లాక్‌డౌన్ పాసులు పంపిణీ కోసం ప్రత్యేకంగా కంప్యూటర్ అప్లికేషన్
Posted On:
11 MAY 2020 1:32PM by PIB Hyderabad
కొవిడ్-19పై పోరాటంలో భాగంగా 'డెహ్రాడూన్ స్మార్ట్ సిటీ లిమిటెడ్' (డీఎస్‌సీఎల్), ఇంటిగ్రేటెడ్ కమాండ్, కంట్రోల్ సెంటర్‌ను ఉపయోగించుకుంటోంది. ఈ కేంద్రం ద్వారా నిఘా కార్యక్రమాలను పర్యవేక్షిస్తోంది. వైరస్ నియంత్రణ ప్రణాళికలు, అమలు కోసం డీఎస్‌సీఎల్ అధికారులు జిల్లా యంత్రాంగంతో కలిసి పనిచేస్తున్నారు. హెచ్‌పీఈ, ఎస్‌జీఎల్, వెబ్‌లైన్ సంస్థలను సాంకేతిక భాగస్వాములుగా చేర్చుకున్నారు. వీడియో, టెలీకాన్ఫరెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు వీరితో సంప్రదిస్తూ, కొవిడ్ నియంత్రణ చర్యలను అమలు చేస్తున్నారు.
ఇంటిగ్రేటెడ్ కమాండ్, కంట్రోల్ సెంటర్
డెహ్రాడూన్ ఇంటిగ్రేటెడ్ కమాండ్, కంట్రోల్ సెంటర్ ద్వారా, ఆస్పత్రుల్లోని క్వారంటైన్ వార్డులను పర్యవేక్షించే విధానాన్ని డెహ్రాడూన్ స్మార్ట్ సిటీ లిమిటెడ్ ప్రారంభించింది. డూన్, కోరోనేషన్, గాంధీ శతాబ్ధి, సుభార్తి ఆస్పత్రులు, టాగ్జెన్ హోటల్లో ఇప్పటికే సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా 24 గంటలూ నిఘా కొనసాగిస్తోంది. ఈ సీసీటీవీ కెమెరాల్లో ఏఎల్ బేస్డ్ ఫేస్ రికగ్నిషన్ పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ ఫీడ్ మొత్తం ఐసీసీసీ (ICCC)లో నిక్షిప్తం అవుతుంది. క్వారంటైన్లలో ఉండేవారి రక్షణతోపాటు, వారికి మరిన్ని సేవలు అందిచడానికి ఈ సీసీ కెమెరాల ఏర్పాటు మరో అడుగుగా మారింది.
లాక్‌డౌన్ పాస్ ద్వారా అత్యవసర సేవలు
"ఎసెన్షియల్ సర్వీస్ లాక్‌డౌన్ పాస్" పేరిట కొత్త కంప్యూటర్ అప్లికేషన్‌ను డెహ్రాడూన్ స్మార్ట్ సిటీ లిమిటెడ్ రూపొందించింది. ఎవరికైనా అత్యవసరంగా బయటకు వెళ్లాల్సివస్తే, ఈ కంప్యూటర్ అప్లికేషన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. వారికి అనుమతి లభించిన తర్వాత, ఇంటి నుంచి బయటకు వచ్చి జిల్లా స్థాయిలో లేదా నగర స్థాయిలో సేవలను ఉపయోగించుకోవచ్చు. వృద్ధుల అవసరాలు, అంతిమ సంస్కారాలు, వైద్య సాయం, ఆహార, నిత్యావసరాల పంపిణీ, హోమ్ డెలివరీ, ఐటీ, టెలికామ్ వంటి సేవలను ఈ పాస్ ద్వారా ఉపయోగించుకోవచ్చు.
ప్రజా అవగాహన కార్యక్రమాలు
లాక్‌డౌన్ నిబంధనలతోపాటు మున్సిపల్ కార్పొరేషన్, ఇతర ప్రభుత్వ శాఖలు అందిస్తున్న సేవలపై డెహ్రాడూన్ స్మార్ట్ సిటీ లిమిడెట్ ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్, వాట్స్‌ప్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా కూడా తన ప్రాజెక్టులపై డీఎస్‌సీఎల్ అవగాహన కల్పిస్తోంది.
వీఎండీల ద్వారా అవగాహన
నగరంలోని ముఖ్యమైన కూడళ్లలో ఉన్న వేరియబుల్ మెసేజింగ్ డిస్‌ప్లేలపై (VMDs) సందేశాలు ప్రదర్శించడం ద్వారా కొవిడ్-19పై అవగాహన పెంచుతున్నారు. పోలీస్, వైద్య విభాగాలతోపాటు ఇతర ముఖ్య విభాగాల ఫోన్ నంబర్లను కూడా వీఎండీలపై ప్రదర్శిస్తున్నారు.
***
(Release ID: 1622953)
Visitor Counter : 295