శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
కరోనా వైరస్ మహమ్మారి అంతానికి పరిష్కారాలు తెలిపే 70 ప్రతిపాదనలకు డిబిటి- బిఐఆర్ ఏ సి కోవిడ్ -19 రీసెర్చ్ కన్సార్సియం ఆమోదం. వ్యాక్సిన్లు, పరీక్షలు, చికిత్సా విధానాలు మరియు ఇతర సాంకేతికలకు సంబంధించి 70 ప్రతిపాదనలకు అంగీకారం.
Posted On:
10 MAY 2020 7:47PM by PIB Hyderabad
కరోనా వైరస్ మహమ్మారి ( సార్స్ కోవ్ -2)ని నిరోధించడానికిగాను పరిష్కారాలు సూచించాలని బయో టెక్నాలజీ విభాగం మరియు బయో టెక్నాలజీ ఇండస్ట్రీ రీసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ ( బిరాక్) దేశంలోని ఆయా పరిశోధనా సంస్థలను, శాస్త్రవేత్తలను కోరింది. దరఖాస్తులను కోవిడ్ -19 కన్సార్సియంకు పంపాలని కోరింది. పరిష్కారాలు అందగానే వాటిని చాలా వేగంగా సమీక్షించడం జరుగుతుందని, ఎంపిక చేసినవారికి నిధులను కూడా అందిస్తామని కూడా బిరాక్ ప్రకటించింది.
ఈ ప్రకటన వెలువడగానే పలు దరఖాస్తులు అందాయి. డిబిటి, బిరాక్ పరిశీలించిన తర్వాత వాటిలో 70 ప్రతిపాదనలను అంగీకరించారు. పరీక్షలు, వ్యాక్సిన్లు, విశిష్టమైన చికిత్సా విధానాలు, మందులకు సంబంధించి ప్రతిపాదనలు పంపాలని కోరిన తర్వాత డిబిటి, బిరాక్ కు పలు ప్రతిపాదనలు అందాయి. వీటిలో 70 ప్రతిపాదనలు ఎంపికయ్యాయి. వీటిని పంపిన వారికి నిధులు అందించడం జరుగుతుంది.
వ్యాక్సిన్లకు సంబంధించి పది ప్రతిపాదనలు, పరీక్షలకు సంబంధించి 34 ప్రతిపాదనలు, చికిత్సలకు సంబంధించి 10 ప్రతిపాదనలు, మదులకు సంబంధించి 2 ప్రతిపాదనలు అందాయి. మరో 14 ప్రతిపాదనలు వైరస్ రాకుండా ముందు జాగ్రత్తలకు సంబంధించినవి.
***
(Release ID: 1622837)
Visitor Counter : 249