రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

భార‌త యుద్ద‌నౌక ఐఎన్ఎస్ జ‌లాశ్వ‌లో మాల్దీవుల‌నుంచి కోచి కి తిరిగివ‌చ్చిన‌ భార‌తీయులు

Posted On: 10 MAY 2020 8:49PM by PIB Hyderabad

ఆపరేషన్ సముద్ర సేతు” కోసం మోహరించిన ఐఎన్ఎస్ జలాశ్వ‌, మే 10వ తేదీ  ఉదయం 10:00 గంటలకు కొచ్చి నౌకాశ్రయంలోకి ప్రవేశించింది. మాల్దీవుల‌లో చిక్కుకున్న మొత్తం 698 మంది భారతీయులు ఇందులో తిరిగివ‌చ్చారు, వీరిలో మహిళలు, వృద్ధులు  పిల్లలు ఉన్నారు. ఈ నౌక ,  ప్ర‌యాణానికి సంబంధించిన అన్ని విధివిధానాల‌ను పూర్తి చేసుకుని మే 08 న సాయంత్రం మాల్దీవుల నుండి బయలుదేరింది. కనీస సోష‌ల్ కాంటాక్ట్‌తో, సురక్షితంగా బయలుదేరడానికి అవసరమైన అన్ని జాగ్ర‌త్త‌చర్యలు సంబంధిత బృందాలు తీసుకున్నాయి. ఈ పర్యటనలో వృద్ధులు, గర్భిణులు , చంటి పిల్లల అవ‌స‌రాలు తీర్చ‌డానికి తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రయాణీకులందరినీ శిక్షణ పొందిన  వ్యక్తిగత రక్షణ సామగ్రిని ధరించిన భారత నావికాదళ సిబ్బంది తీసుకువ‌చ్చారు. తరలింపు ఆపరేషన్ ప్ర‌క్రియ అన్ని ప్రామాణిక ఆపరేటింగ్ విధానాలు (ఎస్ఓపి)  భారత ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం జరిగింది.
ఓడ బెర్త్ చేసిన కొచ్చిన్ పోర్ట్ ట్రస్ట్  క్రూయిస్ టెర్మినల్ వద్ద ఉన్న నావికాదళ  పౌర  పాల‌నాయంత్రాంగం,  ఈ ప్రయాణీకులను ఆహ్వానించారు. క్రూయిస్ టెర్మినల్ వద్ద కోవిడ్ స్క్రీనింగ్ , ఇమ్మిగ్రేషన్ లాంఛ‌నాల‌ను త్వరగా పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది.
కస్టమ్స్, ఇమ్మిగ్రేషన్, పోలీస్, హెల్త్ డిపార్ట్మెంట్, బిఎస్ఎన్ఎల్ , డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వారి కోసం మెడికల్ ప్రోటోకాల్ ప్రకారం టెర్మినల్ వద్ద గ్లాస్డ్ కౌంటర్లను ఏర్పాటు చేశారు. అదనంగా, ప్రయాణీకుల కోసం సామాను ట్రాలీలు కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ (సియాల్) నుండి ఏర్పాటు చేశారు. ఇవన్నీ త్వరగా బయలుదేరడం, వేరుచేయడం అన్ని ఆరోగ్య , వైద్య ఫార్మాలిటీలను సమర్థవంతంగా పూర్తి చేయడం కోసం ఏర్పాటు చేశారు.
విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తున్న ఐఎన్ఎస్ జలాశ్వ‌, భారతీయ పౌరుల తరలింపు ప్రయత్నాలలో , భారత నావికాదళం  ప్రధాన మానవతా సహాయం , విపత్తు ఉపశమన (హెచ్ఎడిఆర్) ప్రయత్నాలలో ముందంజలో ఉంటూ వ‌స్తోంది.ఈ ఓడ నౌకాద‌ళాన్ని తీసుకువెళ్ళడానికి నిర్దేశించిన‌ది.  ప్ర‌స్తుత త‌ర‌లింపు  కోసం ఆన్‌బోర్డ్‌లోని మార్పులు చేశారు.. ఈ నౌక‌ భారత నావికాదళంలో శిక్షణ పొందిన వైద్య బృందాలచే నిర్వహించబడుతోంది,  మాల్దీవుల‌లో చిక్క‌కుపోయిన వారిని తిరిగి స్వ‌దేశానికి తెచ్చే ఆపరేషన్ కోసం ఇది బయలుదేరింది

ఈ రోజు పూర్తి చేసింది , స్వ‌దేశానికి రావాల‌నుకుంటున్న‌ వారిని తీసుకువ‌చ్చే ఆపరేషన్ మొదటి భాగం, దీని కొనసాగింపుగా, కొచ్చి కేంద్రంగా ఉన్న మరో నౌక ఐఎన్ఎస్ మాగర్ ఈ రోజు 202 మంది భారతీయులతో మాలేలో బ‌య‌లుదేరింది. ఈ మొత్తం  ప్ర‌క్రియ‌ కోవిడ్ 19 మహమ్మారి నేపథ్యంలో మధ్యప్రాచ్యం , మాల్దీవులకు చెందిన భారతీయ పౌరులను స్వదేశానికి రప్పించడం కోసం భారత ప్రభుత్వ చేప‌ట్టిన‌ వందే భారత్ మిషన్‌లో భాగం.

***



(Release ID: 1622836) Visitor Counter : 158