రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

ఆపరేషన్ సముద్ర సేతు లో భాగంగా భారతీయ పౌరులను తరలించడానికి మాలే చేరుకున్న - ఐ.ఎన్.ఎస్. మగర్

प्रविष्टि तिथि: 10 MAY 2020 6:26PM by PIB Hyderabad

మాల్దీవులలో చిక్కుకుపోయిన భారత జాతీయులను క్షేమంగా భారతదేశానికి తీసుకురావడానికి భారత నావికాదళం చేపట్టిన ఆపరేషన్ సముద్ర సేతు లో భాగం రెండవ నావికాదళ నౌక ఐ.ఎన్.ఎస్. మగర్ 2020 మే నెల 10వ తేదీన మాలే నౌకాశ్రయానికి చేరుకుంది.  కోచి నౌకాశ్రయం నుండి మాల్దీవులకు బయలుదేరేముందు ఐ.ఎన్.ఎస్. మగర్ నౌకను పూర్తిగా వైద్య, పరిపాలనా సంబంధమైన సన్నాహాలతో పాటు,  పౌరులు సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు వీలుగా చేశారు

సామాజిక దూరం వంటి నిబంధనలతో సహా, కోవిడ్-19 కు సంబంధించిన జాగ్రత్తలు అన్నీ తీసుకుని నౌకలో సుమారు 200 మంది పౌరులు ప్రయాణించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశారు.  ఆహారం, మరుగుదొడ్లు వంటి అవసరమైన సౌకర్యాలకోసం విడివిడిగా స్థలాలను కేటాయించారు. మహిళలకు, పిల్లలకు, వయోవృద్దులకు విడివిడిగా భోజనశాలలు ఏర్పాటు చేశారు.  భోజనశాలల దగ్గర, మరుగుదొడ్ల దగ్గర ప్రయాణీకులు గుమిగూడకుండా వారిని  వేర్వేరు బృందాలుగా విభజిస్తూ, అదనపు జాగ్రత్తలు తీసుకున్నారు.  

ఇదే సమయంలో, మాల్దీవుల నుండీ 698 భారతీయ పౌరులతో ఐ.ఎన్.ఎస్. జలాశ్వ ఈ ఉదయం కోచీ నౌకాశ్రయం చేరుకుంది

*****


(रिलीज़ आईडी: 1622768) आगंतुक पटल : 245
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Punjabi , Odia , Tamil , Kannada , Malayalam