విద్యుత్తు మంత్రిత్వ శాఖ

సీపీఎస్‌యూ సంస్థ ఎన్‌టీపీసీ త‌న‌ మూడు విద్యుత్ కేంద్రాల్లో 100 శాతం పీఎల్‌ఎఫ్‌ను సాధించింది

- లాక్‌డౌన్ నేప‌థ్యంలోనూ అసాధారణ కార్యాచరణ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తున్న‌ మహార‌త్న సంస్థ‌

Posted On: 10 MAY 2020 5:05PM by PIB Hyderabad

 

కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ ప‌రిధిలోని అతిపెద్ద విద్య‌త్ ఉత్ప‌త్తి సంస్థ, కేంద్ర పీఎస్‌యూ అయిన ఎన్‌టీపీసీ లిమిటెడ్ ఈ నెల‌ 9వ తేదీన‌ త‌న మూడు థ‌ర్మ‌ల్‌ విద్యుత్ కేంద్రాలలో 100 శాతం ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్‌ను (పీఎల్‌ఎఫ్) సాధించింది. కోవిడ్ -19 మ‌హ‌మ్మారి కార‌ణంగా లాక్‌డౌన్ నెల‌కొన్న నేప‌థ్యంలోనూ మధ్యప్రదేశ్‌లోని ఎన్‌టీపీసీ వింధ్యాచల్ (4760 మెగావాట్లు), ఒడిశా లోని ఎన్‌టీపీసీ తల్చర్ కనిహా (3000 మెగావాట్లు), ఛత్తీస్‌గ‌ఢ్‌లోని ఎన్‌టీపీసీ సిపాట్ (2980 మెగావాట్లు) లు 100 శాతం పీఎల్‌ఎఫ్ సాధించాయి. లాక్‌డౌన్ ప‌రిస్థితులు ఉన్నప్పటికీ ఈ ప్లాంట్‌లు అసాధారణమైన కార్యాచరణ సామర్థ్యంతో పాటు గ‌రిష్ఠ‌పు సామర్థ్య వినియోగాన్ని ప్రదర్శించాయి. ఇదే సమయంలో, హిమాచల్ ప్రదేశ్‌లోని ఎన్‌టీపీసీ కోల్‌డమ్ 20-21 ఆర్థిక సంవత్సరానికి దేశంలోని ఉత్తమ జలవిద్యుత్ కేంద్రాలలో ఒకటిగా అవతరిస్తోంది. అంత‌కు ముందు ఏప్రిల్ 13న దేశంలోని అతిపెద్ద విద్యుత్ కేంద్రమైన ఎన్‌టీపీసీ వింధ్యాచ‌ల్
‌100 శాతం ప్లస్ పీఎల్‌ఎఫ్ సాధించింది. విద్యుత్ ఉత్పత్తిలో మేటి ప్ర‌ద‌ర్శ‌న‌తో పాటుగా కోవిడ్ -19 వైర‌స్ పరిస్థితుల నేప‌థ్యంలో నిరుపేద వర్గాలకు రేషన్ మరియు వైద్య సహాయం అందించడం ద్వారా మరియు వలస కార్మికులకు వివిధ సాంఘిక సంక్షేమ కార్యకలాపాలతో ఎన్‌టీపీసీ సంస్థ గొప్ప స‌హాయం అందిస్తోంది. కోవిడ్-19కి వ్యతిరేక‌ పోరాటంలో ఎన్‌టీపీసీ సంస్థ కేంద్రం మార్గదర్శకాలను క‌చ్చితంగా పాటిస్తోంది. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని సంస్థలు మరియు విద్యుత్ కేంద్రాలలో సామాజిక దూరాన్ని కొనసాగించడం వంటి చ‌ర్య‌ల‌ను చేప‌డుతోంది. ఎన్‌టీపీసీ గ్రూపు మొత్తం దాదాపు 62,110 మెగా వాట్ల సామర్థ్యంతో మేటి విద్యుత్‌ ఉత్ప‌త్తి సంస్థ‌గా సేవ‌లందిస్తోంది. ఎన్‌టీ‌పీసీ సంస్థ‌లో 70 పవర్ స్టేషన్లు ఉన్నాయి, వీటిలో 24 బొగ్గు, దాదాపు 7 కంబైన్డ్ సైకిల్ గ్యాస్ / లిక్విడ్ ఇంధనం, 1 హైడ్రో, 13 పునరుత్పాదక శక్తితో పాటు 25
జేవీ పవర్ స్టేషన్లు ఉన్నాయి.



(Release ID: 1622717) Visitor Counter : 196