హోం మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 నిర్వహణ స్థితిని సమీక్షించేందుకు అన్ని రాష్ట్రాలు, యుటీల ప్రధాన కార్యదర్శులు, ఆరోగ్య కార్యదర్శులతో కేబినెట్ కార్యదర్శి స‌మావేశం

Posted On: 10 MAY 2020 2:51PM by PIB Hyderabad

దేశంలో కోవిడ్ -19 నిర్వ‌హ‌ణ, స్థితిగ‌తు‌ల‌ను స‌మీక్షించేందుకు గాను కేంద్ర కేబినెట్ కార్యదర్శి
శ్రీ రాజీవ్ గౌబా ఈ రోజు అన్ని రాష్ట్రాలు మ‌రియు కేంద్ర పాలిత ప్రాంతాల (యుటీ) ప్రధాన కార్యదర్శులు మరియు ఆరోగ్య కార్యదర్శుల‌తో సమావేశమ‌య్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జ‌రిగిన ఈ స‌మావేశంలో తాజాగా దేశంలోని కోవిడ్ -19 స్థితిని సమీక్షించారు. ఈ స‌మావేశం ప్రారంభంలో ఆయ‌న దేశంలోని వ‌ల‌స కార్మికుల త‌ర‌లింపు గురించి మాట్లాడుతూ 3.5 లక్షల వలస కార్మికుల త‌ర‌లింపున‌కు గాను రైల్వే శాఖ 350 శ్రామిక్ ప్ర‌త్యేక రైళ్లు నడుపుతున్న‌ట్టు వివ‌రించారు. మరిన్ని శ్రామిక్ ప్రత్యేక రైళ్లను నడపడానికి వీలుగా రైల్వే శాఖ‌తో సహకరించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాలను అభ్యర్థించారు. వందేభారత్ మిషన్ కింద విదేశాల్లోని భారతీయుల‌ను తిరిగి స్వ‌దేశానికి తేవడానికి గాను రాష్ట్రాలందిస్తున్న సహకారాన్ని ఈ సంద‌ర్భంగా ప్ర‌స్తుతించారు.
కరోనా వారియర్స్ అయిన వైద్యులు, నర్సుల‌తో పాటు పారామెడిక్స్ విధుల‌కు కొంద‌రు అడ్డుపడకుండా అన్ని ర‌కాల ర‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఈ స‌మావేశంలో కేంద్ర‌ కేబినెట్ కార్యదర్శి ఉద్ఘాటించారు. ఈ స‌మావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు తమ రాష్ట్రాల్లోని పరిస్థితి గురించి సమాచారాన్ని అంద‌జేశారు. కోవిడ్ వైర‌స్ నుండి రక్షణ చ‌ర్య‌లు చేప‌డుతూనే ఆర్థిక కార్యకలాపాలను కూడా క్రమాంకనం చేసిన పద్ధతిలో పెంచాల్సిన అవసరం ఉందంటూ వారు అభిప్రాయ‌ప‌డ్డారు. 


(Release ID: 1622686) Visitor Counter : 191