ఆర్థిక మంత్రిత్వ శాఖ

ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 6 కింద నివాసానికి సంబంధించిన స్పష్టీకరణ

Posted On: 09 MAY 2020 10:39AM by PIB Hyderabad

ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 6 ఒక వ్యక్తి నివాసానికి సంబంధించిన నిబంధనల గురింతి తెలియజేస్తుంది. ఒక వ్యక్తి భారతదేశంలో నివసిస్తున్నాడా, ప్రవాసుడా, లేదా సాధారణంగా నివాసి కాదా అనే విషయం ఒక వ్యక్తి సంవత్సరంలో భారతదేశంలో ఉన్న కాలంపై ఆధారపడి ఉంటుంది.

ఒక నిర్దిష్ట వ్యవధి కోసం 2019-20 సంవత్సరంలో భారత పర్యటనకు వచ్చిన వ్యక్తులు చాలా మంది ఉన్నారని పేర్కొంటూ వివిధ ప్రాతినిధ్యాలు వచ్చాయి మరియు నాన్-రెసిడెంట్ గా వారి హోదాను కొనసాగించడానికి మునుపటి సంవత్సరం ముగిసేలోపు భారతదేశం విడిచి వెళ్ళాలని అనుకున్న వారు, భారతదేశంలో సాధారణ నివాసి కాదు. అయినప్పటికీ, నావల్ కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా అంతర్జాతీయ విమాన సర్వీసులను రద్దు చేయడం, నిలిపివేయడం వల్ల, వారు భారతదేశంలో ఎక్కువ కాలం ఉండాల్సిన అవసరం వచ్చింది. అలా చేయాలనే ఉద్దేశ్యం లేకుండా వారు అసంకల్పితంగా భారతీయ నివాసితులుగా మారవచ్చని ఆందోళనలు వ్యక్తమయ్యాయి.

ఇలాంటి సందర్భాల్లో ఎదురయ్యే నిజమైన ఇబ్బందులను నివారించేందుకు, సి.బి.డి.టి. 2020 మే 8 నాటి 11 వ నెంబర్ సర్క్యులర్ ద్వారా నిర్ణయించింది. 2019-20 సంవత్సరంలో ఈ చట్టంలోని సెక్షన్ 6 కింద నివాస స్థితిని నిర్ణయించే ప్రయోజనాల కోసం మార్చి 22, 2020 ముందు భారతదేశానికి వచ్చిన వ్యక్తి మరియు:

·        2020 మార్చి 31 న లేదా అంతకు ముందు భారతదేశాన్ని విడిచి వెళ్ళలేకపోయిన వారు, 2020 మార్చి 22 నుండి 2020 మార్చి 31 వరకు భారతదేశంలో వారు గడిపిన కాలం పరిగణనలోకి తీసుకోబడదు; లేదా

·        2020 మార్చి 1 న లేదా తరువాత నావల్ కరోనా వైరస్ (కోవిడ్ -19) కారణంగా భారతదేశంలో నిర్బంధం అమలులో ఉంది మరియు 2020 మార్చి 31 న లేదా అంతకు ముందు తరలింపు విమానంలో బయలుదేరినది లేదా 2020 మార్చి 31 న లేదా అంతకు ముందు భారతదేశం విడిచి వెళ్ళలేకపోయిన వారు, నిర్బంధం ప్రారంభించినప్పటి నుండి వారు బయలుదేరిన తేదీ లేదా 2020 మార్చి 31 వరకు ఉన్న కాలం పరిగణనలోకి తీసుకోబడదు; లేదా

·        2020 మార్చి 31 న లేదా అంతకు ముందు తరలింపు విమానంలో బయలుదేరినది, 2020 మార్చి 22 నుండి ఆయన బయలుదేరిన తేదీ వరకు భారతదేశంలో వారు గడిపిన కాలం పరిగణనలోకి తీసుకోబడదు.

అంతేకాకుండా, 2020-21 ఆర్థిక సంవత్సరంలో లాక్ డౌన్ కొనసాగుతున్నందున మరియు అంతర్జాతీయ విమాన కార్యకలాపాలు ఎప్పుడు ప్రారంభమవుతాయో ఇంకా స్పష్టంగా తెలియరాకపోవడం వల్ల, అంతర్జాతీయ విమాన కార్యకలాపాలు సాధారణ స్థితికి వచ్చే తేదీ వరకు ఈ వ్యక్తులు బస చేసిన కాలాన్ని మినహాయించి మునుపటి సంవత్సరానికి నివాస స్థితిని నిర్ణయించడానికి 2020-21 సాధారణీకరణ తర్వాత ఒక సర్క్యులర్ జారీ చేయబడుతుంది.

****



(Release ID: 1622506) Visitor Counter : 328