జౌళి మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 నుంచి రక్షణకు అవసరమైన పిపిఇ కవర్ ఆల్ ప్రొటోటైప్‌శాంపిళ్ళను పరీక్షిస్తున్న 8 ఆమోదిత లేబరెటరీలు. ఈ లేబరెటరీలన్నీ ఎన్.ఎ.బి.ఎల్ చేత గుర్తింపుపొందినవే.
భారత ప్రభుత్వానికి చెందిన ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ విడుదల చేసిన సాంకేతిక అవసరాలకు అనుగుణంగా , పిపిఇ కవర్ ఆల్ ప్రొటోటైప్ శాంపిళ్లను పరిశీలించి, అందులో అన్నిరకాలుగా పరీక్షలలో నెగ్గిన ప్రొటోటైప్ శాంపిళ్ళకు యూనిక్ సర్టిఫికేషన్ కోడ్ (యుసిసి) ని జారీచేసేందుకు టెక్స్‌టైల్ మంత్రిత్వశాఖ సవివర మార్గదర్శకాలను జారీ చేసింది.
యుసిసి సర్టిఫికేట్ లకు సంబంధించిన అన్నివివరాలు డిఆర్‌డిఒ, ఒఎఫ్‌బి, ఎస్ఐటిఆర్ ఎ అధికారిక వెబ్‌సైట్‌లలో పొందుపరచడం జరిగింది.
Posted On:
08 MAY 2020 8:03PM by PIB Hyderabad
కోవిడ్ -19 నుంచి రక్షణకు అవసరమైన పిపిఇ కవర్ ఆల్ లను పరీక్షించేందుకు 8 లేబరెటరీలకు అనుమతి ఇచ్చారు. అవి i) సౌత్ ఇండియా టెక్స్‌టైల్స్ రీసెర్చ్ అసోసియేషన్ (సిట్రా), కోయంబత్తూర్, తమిళనాడు (ii) డి.ఆర్.డి.ఒ- ఐఎన్ఎంఎఎస్,న్యూఢిల్లీ , (iii) హెవీ వెహికల్ ఫ్యాక్టరీ, అవడి, చెన్నై (iv) స్మాల్ ఆర్మ్స్ ఫ్యాక్టరీ, కాన్పూర్, ఉత్తర ప్రదేశ్ (v) ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, కాన్పూర్, ఉత్తర ప్రదేశ్ (vi) ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, మురద్‌నగర్, ఉత్తర ప్రదేశ్ (vii) ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ, అంబర్‌నాథ్, మహారాష్ట్ర (viii) మెటల్ , స్టీల్ ఫ్యాక్టరీ, ఇషాపూర్, పశ్చిమ బెంగాల్. ఈ ప్రయోగశాలలన్నీ ఎన్.ఎ.బి.ఎల్ చేత గుర్తింపు పొందినవే..
2020 మార్చి 2 న కేంద్ర ఆరోగ్య , కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసిన సాంకేతిక అవసరాలకు అనుగుణంగా ఈ పరీక్షలు నిర్వహిస్తారు. పిపిఇ కవర్ ఆల్స్ తయారీదారుల నుంచి సేకరించిన , ప్రయోగశాల పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన ప్రతి నమూనాకు ప్రత్యేక ధృవీకరణ కోడ్ (యుసిసి) జారీ చేయడానికి వివరణాత్మక విధానాన్ని ఏప్రిల్ 6, 2020 న టెక్స్‌టైల్ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. . ఈ విధానాలను 2020 ఏప్రిల్ 22 న వస్త్ర మంత్రిత్వ శాఖ మరింత హేతుబద్ధం చేసింది.
ప్రత్యేక ధృవీకరణ కోడ్ (యుసిసి) ను,తయారీదారు సమర్పించిన ప్రతి నమూనా పై తయారీదారు పేరు, తయారీ తేదీ ,క్లయింట్ పేరుతో పాటు తయారు చేసిన ప్రతి కవరాల్‌పై ఎంబోస్ చేయవలసి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య , కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆసుపత్రులు, ఆరోగ్య సంరక్షణ సంస్థల సేకరణ సంస్థ అయిన మెసర్స్ హెచ్.ఎల్.ఎల్ లైఫ్‌కేర్ లిమిటెడ్ ప్రొక్యూర్‌మెంట్‌కు సంబంధించి ఈ విధానం పూర్తిగా అమలు చేయడం జరిగింది.
తయారీదారులు తాము సమర్పించిన నమూనాతో పాటు తమ తయారీ యూనిట్ వివరాలు, జిఎస్‌టిఎన్ నంబర్, కంపెనీ రిజిస్ట్రేషన్ నంబర్, ఉద్యోగ్ ఆధార్ నంబర్ లేదా డిఐసి రిజిస్ట్రేషన్ నంబర్ , ఇతర సంబంధిత వివరాలను పేర్కొంటూ అఫిడవిట్ సమర్పించాల్సి ఉంటుంది. వారు వస్త్ర తయారీదారులమని, ట్రేడర్లము కాదని ప్రకటించాల్సి ఉంటుంది. యుసిసి సర్టిఫికెట్‌లో ఈ అఫిడవిట్ ఒక భాగంగా ఉంటుంది
ప్రజలకు సమాచారం అందుబాటులో ఉంచడం కోసం, అన్ని యుసిసి సర్టిఫికెట్ల వివరాలు డిఆర్‌డిఒ, ఒ.ఎఫ్.బి (ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డు) ఎస్.ఐ.టి.ఆర్.ఎ అధికారిక వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచడం జరిగింది
***
(Release ID: 1622310)
Visitor Counter : 169