ప్రధాన మంత్రి కార్యాలయం

కోవిడ్ -19 మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ, ఇట‌లీ ప్ర‌ధాని శ్రీ గైయుసెప్పెల మ‌ధ్య‌న ఫోన్ సంభాష‌ణ‌

Posted On: 08 MAY 2020 8:44PM by PIB Hyderabad

కోవ‌డ్ -19 మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో ఇట‌లీ ప్ర‌ధాని శ్రీ గైయుసెప్పె కాంటేతో ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ ఫోన్లో మ‌ట్లాడారు. వైర‌స్ మ‌హ‌మ్మారి బారిన ప‌డి ప్రాణాలు కోల్పోయిన ఇట‌లీ పౌరుల‌ను స్మ‌రించుకుంటూ ప్ర‌ధాని శ్రీ మోదీ త‌న నివాళులు తెలిపారు. ఈ సంక్షోభ స‌మ‌యంలో ఇట‌లీ పౌరులు ఎంతో ధైర్యంగా నిలిచి పోరాటం చేస్తున్నార‌ని ప్ర‌ధాని అన్నారు.
త‌మ త‌మ దేశాల్లో చేపడుతున్న చ‌ర్య‌ల గురించి, ఆరోగ్య‌ప‌రంగా, ఆర్ధిక‌ప‌రంగా ప‌డుడుతున్న ప్ర‌భావం గురించి ప్ర‌ధానులిద్ద‌రూ మాట్లాడుకున్నారు. అంత‌ర్జాతీయ స్థాయిలో ప‌రిస్థితి గురించి చ‌ర్చించుకున్నారు. ఇరుదేశాల్లో నిలిచిపోయిన దేశ పౌరుల క్షేమం విష‌యంలో రెండు దేశాలు తీసుకున్న చ‌ర్య‌ల గురించి సంతృప్తి వ్య‌క్తం చేశారు. 
ముఖ్య‌మైన మందులు, ఇత‌ర నిత్యావ‌స‌ర వ‌స్తువుల విష‌యంలో ఇటలీకి సాయం చేయ‌డానికి భార‌త‌దేశం స‌దా సిద్ధంగా వుంద‌ని ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ తెలిపారు.   
ఇరు దేశాల మ‌ధ్య‌న ద్వైపాక్షిక సంబంధాలు మ‌రింత‌గా బ‌లోపేతం చేయ‌డానికి వీలుగా రెండు దేశాలు సంప్ర‌దింపులు కొన‌సాగాల‌ని నేత‌లు అంగీక‌రించారు. ప్ర‌ధాని శ్రీ న‌రేంద్ర మోదీ త‌న అనుకూల స‌మ‌యంలో ఇట‌లీ సంద‌ర్శించాల‌ని ఈ సంద‌ర్భంగా ఇట‌లీ ప్ర‌ధాని త‌న గ‌త ఆహ్వానాన్ని గుర్తు చేశారు.  

 

****



(Release ID: 1622307) Visitor Counter : 274