ఆర్థిక మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 నేపథ్యంలో భారతదేశానికి 500 మిలియన్ డాలర్ల ఆర్థిక సహకారం అందించేందుకు భారత ప్రభుత్వం మరియు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ (ఏ.ఐ.ఐ.బి) మధ్య ఒప్పందం
Posted On:
08 MAY 2020 5:22PM by PIB Hyderabad
కోవిడ్ -19 మహమ్మారిని సమగ్రంగా ఎదుర్కోవడానికి అదే సమయంలో ప్రజారోగ్య సంసిద్ధతను బలోపేతం చేసేందుకు భారతదేశానికి సహకారం అందించే దిశగా ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ (ఏ.ఐ.ఐ.బి) ఈ రోజు 500 మిలియన్ డాలర్ల కోవిడ్ -19 అత్యవసర ప్రతిస్పందన మరియు ఆరోగ్య వ్యవస్థల తయారీ ప్రాజెక్టు పై సంతకం చేసింది. ఈ బ్యాంక్ నుంచి భారతదేశానికి తొలి ఆరోగ్యరంగ సహకారం ఇదే కావడం విశేషం.
ఈ సహకారం భారత్ లోని అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు వర్తిస్తుంది. కోవిడ్ సోకిన ప్రజలు, ప్రమాదంలో ఉన్న జనాభా, వైద్య మరియు అత్యవసర సిబ్బంది, సేవలను అందించే వారు, వైద్య మరియు పరీక్ష సౌకర్యాలు, జాతీయ మరియు జంతు ఆరోగ్య సంస్థల అవసరాలకు వినియోగించుకోవచ్చు.
ఈ ఒప్పందం పై భారత ప్రభుత్వం తరుఫున ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక వ్యవహారాల అదనపు కార్యదర్శి శ్రీ సమీర్ కుమార్ ఖరే మరియు ఎ.ఐ.ఐ.బి. తరుఫును డైరక్టర్ జనరల్ (యాక్టింగ్) శ్రీ రజత్ మిశ్రాలు సంతకాలు చేశారు.
ఈ సందర్భంగా శ్రీ ఖరే మాట్లాడుతూ, కోవిడ్ -19 ప్రతికూల పరిస్థితుల్లో జాతీయ ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి ఎ.ఐ.ఐ.బి. సహాయం ప్రభుత్వానికి ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ మహమ్మారి నేపథ్యంలో అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆర్థిక మరియు ఆరోగ్య మంత్రిత్వ శాఖలు మరియు ఎ.ఐ.ఐ.బి. అధికారులు రికార్డు సమయంలో ఈ ప్రాజెక్టును సిద్ధం చేశారన్నారు.
పి.పి.ఈ, ఆక్సిజన్ డెలివరీ సిస్టమ్స్ మరియు ఔషధాల సేకరణ పెంచడం ద్వారా, స్థితిస్థాపక ఆరోగ్యం పెంచడం, వ్యాధిని గుర్తించే సామర్థ్యాన్ని పెంచడానికి సహకారం అందించడం ద్వారా భారతదేశంలో కోవిడ్ వ్యాప్తిని అరికట్టేందుకు ఈ ప్రాజెక్టు వీలు కల్పిస్తుంది. కోవిడ్ -19తో పాటు భవిష్యత్ లో ఎదురయ్యే వ్యాధుల నిర్వహణకు ప్రధాన ప్రజారోగ్యం, అనారోగ్య నివారణ సహా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ సహకారంతో పని చేస్తునన భారతీయ మరయు ఇతర ప్రపంచ సంస్థలకు కోవిడ్ -19 పరిశోధనలకు మద్ధతు అందించడం, గణనీయమైన ప్రతికూలతలను పరిష్కరించడంలో భాగంగా కోవిడ్ -19 వ్యాప్తి నేపథ్యంలో ప్రజా నిర్మాణాల బలోపేతం కోసం ప్రాజెక్టు సమన్వయం మరియు నిర్వహణ ఉపయోగపడుతుంది.
కోవిడ్ సోకిన వ్యక్తులు, ప్రమాదంలో ఉన్న జనాభా, వైద్య మరియు అత్యవసర సిబ్బంది, వైద్య మరియు పరీక్షా సదుపాయాల (ప్రభుత్వ, ప్రైవేట్) సర్వీస్ ప్రొవైడర్లు, భారదేశ కోవిడ్ -19 ప్రతిస్పందనలో నిమగ్నమైన ప్రభుత్వ మరియు యానిమల్ హెల్త్ ఏజన్సీలు ఈ ప్రాజెక్టు ప్రాథమిక లబ్ధిదారులు.
ఎ.ఐ.ఐ.బి. ఉపాధ్యక్షుడు శ్రీ డి.జె. పాండియన్ మాట్లాడుతూ, కోవిడ్ -19 రోగులకు సమర్థవంతంగా చికిత్స చేయగల మరయు దాని వ్యాప్తిని నివారించగల స్థితి స్థాపక ఆరోగ్య వ్యవస్థను నిర్మించడం తక్షణ ప్రాధాన్యమని తెలిపారు. ఈ నిధులు ఈ అవసరాలను పరిష్కరిస్తాయని, భవిష్యత్ లో వ్యాధుల వ్యాప్తిని సమర్థవంతంగా నిర్వహించేందుకు భారదేశ సామర్థ్యాన్ని మరింత పెంచుతాయని తెలిపారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రపంచ మంతా ఎదుర్కొంటున్న ఈ సవాలు విషయంలో ఎ.ఐ.ఐ.బి. తన పాత్రను పోషిస్తోందని, ఆంతర్జాతీయ ఆర్థిక సంస్థలతో కలిసి పని చేస్తుందని, వారి ఆరోగ్య వ్యవస్థలను పెంచడానికి మరియు ఆర్థిక వ్యవస్థలు వీలైనంత త్వరగా కోలుకోవడానికి అవసరమైన అత్యవసర ఆర్థిక సహకారం కోసం భారత ప్రభుత్వానికి సాయం చేస్తుందని అన్నారు.
కోవిడ్ -19 మరియు భవిష్యత్తులో వ్యాధుల వ్యాప్తిని నిర్వహించడం కోసం ప్రధాన ప్రజారోగ్య రక్షణ మరియు రోగులకు సంరక్షణ అందించేందుకు భారతదేశ ఆరోగ్య వ్యవస్థ స్థాయిని ఈ ప్రాజెక్టు మెరుగుపరచనుంది. భారతదేశ ఇంటిగ్రేటెడ్ డిసీజ్ నిఘా కార్యక్రమాన్ని బలోపేతం చేయడానికి, అంటు వ్యాధుల ఆస్పత్రులను, జిల్లా, సివిల్, జనరల్ మరియు మెడికల్ కాలేజీ ఆసుపత్రులను పునరుద్ధరించడానికి మరియు అధిక నియంత్రణ కలిగి బయో సేఫ్టీ లెవల్ లో 3 ప్రయోగశాలల నెట్ వర్క్ నిర్మాణంలో సహాయపడుతుంది.
ఇవాళ, కొత్త అంటువ్యాధుల్లో హెచ్.ఐ.వి.ఎయిడ్స్, ఎబోలా మరియు సార్స్ సహా 75 శాతం అంటు వ్యాధులు జంతువుల నుంచే మనుషులకు వస్తున్నాయి. ప్రస్తుత మరియు అభివృద్ధి చెందుతున్న జూనూసెస్ ను గుర్తించేందుకు, కోవిడ్ -19పై బయో మెడికల్ పరిశోధనల దిశగా భారతీయులకు మద్ధతు అందించేందుకు మరియు పరీక్ష మరియు పరిశోధన కోసం వైరల్ పరిశోధన మరియు విశ్లేషణ ప్రయోగశాలలను అప్ గ్రేడ్ చేయడానికి ఈ ప్రాజెక్టు సామర్థ్యాన్ని, వ్యవస్థలను అభివృద్ధి చేస్తుంది.
కోవిడ్ -19 వ్యాప్తి నేపథ్యంలో ప్రతికూలతలను పరిష్కరించడంలో కూడా ఇది సహాయపడుతుంది. పరిశుభ్రత పద్ధతుల పై సమగ్ర ఆరోగ్య అవగాహన, ప్రవర్తన మార్పు ప్రచారాలు, మాస్క్ లు ధరించడం, సామాజిక దూరం మరియు బలహీన సమాజాలకు మానసిక ఆరోగ్య సేవలు ఇందులో ఉన్నాయి.
ఈ ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంక్ మరియు ఎ.ఐ.ఐ.బి. 1.5 బిలియన్ డాలర్ల నిధులు సమకూరుస్తున్నాయి. వీటిలో 1 బిలియన్ డాలర్లను ప్రపంచ బ్యాంక్, 500 మిలియన్ డాలర్లను ఎ.ఐ.ఐ.బి. అందిస్తాయి.
కేంద్ర ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్.హెచ్.ఎం), నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్.సి.డి.సి), ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐ.సి.ఎం.ఆర్) ఈ ప్రాజెక్టును అమలు చేస్తాయి.
****
(Release ID: 1622280)
Visitor Counter : 319