పర్యటక మంత్రిత్వ శాఖ
                
                
                
                
                
                
                    
                    
                        "దేఖో అప్నా దేశ్" పరంపరలో భాగంగా "గోవా-క్రూసిబుల్ అఫ్ కల్చర్" పేరుతో 16వ వెబినార్ నిర్వహించిన పర్యాటక మంత్రిత్వశాఖ. 
                    
                    
                        
                    
                
                
                    Posted On:
                08 MAY 2020 3:39PM by PIB Hyderabad
                
                
                
                
                
                
                "దేఖో అప్నా దేశ్" పరంపరలో భాగంగా 2020 మే నెల 7వ తేదీన, "గోవా-క్రూసిబుల్ అఫ్ కల్చర్" పేరుతో 16వ వెబినార్ ను  భారత ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వశాఖ, నిర్వహించింది.  ఈ కార్యక్రమం ద్వారా భారతదేశం యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన పర్యాటక గమ్యం ‘గోవా’ అందించే ‘తక్కువ తెలిసిన’ లేదా ‘అసలు తెలియని’ ప్రయాణ అనుభవాలను తెలియజేశారు. గోవాలో కనుగొనబడటానికి వేచి ఉన్న స్థలాల అందాల గురించి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి ముఖా ముఖీ వివరించారు.
ఈ వెబినార్ లో రచయితా, ఫోటోగ్రాఫర్, ఉత్సవ పర్యవేక్షకుడు, వివేక్ మెంజెస్ వివరించారు. శతాబ్దాల సాంస్కృతిక మార్పిడి ద్వారా విస్తరించిన గోవా గొప్పతనం గురించి, సృజనాత్మకమైన ప్రసిద్ధ బీచ్‌లు మరియు నైట్‌లైఫ్ గురించీ ఆయన వివరించారు.  
ఈ ప్రదర్శనలో భారత్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం, గోవా ఆర్ట్స్, సాహిత్య ఉత్సవం, కళా ఉత్సవం, స్థానిక ఉత్సవాలు, ఆహారం, అర్చిటెక్చర్, చిత్రకళా మొదలైనవి ప్రదర్శించారు.   
ఈ రోజుల్లో పర్యటన అంటే కేవలం ప్రదేశాలు చూసిరావడం మాత్రమే కాదు. పర్యటన అంటే, కొత్త అనుభవాలు, నూతన ప్రదేశాలు, పరిచయాలు, సంస్కృతి, సంప్రదాయాలు వంటివి ఎన్నో ఉన్నాయి.  స్థానిక గృహాలలో నివాసం, స్థానిక కళలు నేర్చుకోవడం, స్థానిక వంటలు చేయడం, స్వచ్చందంగా స్థానిక కార్యకలాపాలలో పాల్గొనడం, ఆ జ్ఞాపకాలను పదిలపరచుకోవడం లాంటివి చాలా ఉంటాయి. 
అదనపు డైరెక్టర్ జనరల్ రుపేందర్ బ్రార్ వెబినార్ విషయాలను వివరిస్తూ,  స్థిరమైన ప్రయాణాల ప్రాముఖ్యత గురించి నొక్కి చెప్పారు. "సామాజిక సాంస్కృతిక స్థిరత్వం" ద్వారా సమాజంపై ప్రతికూల ప్రభావాన్ని తగ్గించి, పర్యాటకం మరియు పర్యాటకుల పట్ల సానుకూలతను ప్రోత్సహించడం లక్ష్యంగా కృషి చేయాలని సూచించారు. 
 గతంలో నిర్వహించిన  వెబినార్ కార్యక్రమాలన్నీ https://www.youtube.com/channel/UCbzIbBmMvtvH7d6Zo_ZEHDA/featured  వెబ్ సైట్ మీదా,  అదేవిధంగా, పర్యాటక శాఖ మంత్రిత్వ శాఖ కు చెందిన వెబ్ సైట్లు  incredibleindia.org  మరియు  tourism.gov. వెబ్ సైట్  మీదా అందుబాటులో ఉంటాయి. 
తదుపరి వెబినార్ ను 2020 మే నెల 9వ తేదీన ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నారు. నమోదు కోసం 
  https://bit.ly/RiverNila  వెబ్ సైట్ ని దర్శించండి. 
 
*******
                
                
                
                
                
                (Release ID: 1622180)
                Visitor Counter : 227