రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

కైలాష్-మనససరోవర్ యాత్రాకాలాన్ని తగ్గించే 80 కిలోమీటర్ల రహదారిని ప్రారంభించిన రక్షణ మంత్రి శ్రీ రాజనాథ్ సింగ్

Posted On: 08 MAY 2020 1:17PM by PIB Hyderabad

కైలాష్-మానససరోవర్ యాత్రకుసరిహద్దు ప్రాంత అనుసంధాన మార్గానికి కొత్త శకం ప్రారంభం అయింది. ధార్చుల (ఉత్తరఖండ్) నుండి లిపులేఖ్ (చైనా సరిహద్దు) ను కలుపుతూ రహదారి మార్గాన్ని ఒక ప్రత్యేక కార్యక్రమంలో రక్షణ మంత్రి శ్రీ రాజనాధ్ సింగ్ ప్రారంభించారు. పితోర్ఘర్ నుండి గుంజి కి వాహనాల రాకపోకలను జెండా ఊపి ప్రారంభించారు. మారుమూల ప్రాంతాల అభివృద్ధికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ కి ఒక ప్రత్యేక దార్శనికత ఉందని శ్రీ రాజనాధ్ సింగ్ ఈ సందర్బంగా మాట్లాడుతూ అన్నారు. ఈ కీలకమైన మార్గం పూర్తి కావడంతో స్థానికలుయాత్రికుల దశాబ్దాల కల సాకారమైందని శ్రీ రాజనాధ్ సింగ్ తెలిపారు. ఈ రహదారి మార్గం ఏర్పాటు కావడం వల్ల స్థానిక వ్యాపారాలు పెరిగి ఆర్థిక కార్యకలాపాలు మరింత పెరుగుతాయని ఆయన అన్నారు. 

హిందూబుద్ధజైనులకు పవిత్రమైన కైలాష్-మానససరోవర్ మార్గం పూర్తి కావడం వల్ల ఇక నుండి ఈ యాత్రను  2-3 వారాల కాకుండా ఒక వారానికే పూర్తి చేయవచ్చని శ్రీ రాజనాధ్ సింగ్ వెల్లడించారు. ఈ రహదారి ఘటిభగర్ నుండి ప్రారంభమై కైలాష్-మానససరోవర్ ప్రవేశ ద్వారమైన లిపులేఖ్ పాస్ వరకు ఉంటుంది. ఇది 80 కిలోమీటర్ల రహదారిసముద్ర మట్టానికి 6,000 నుండి 17,060 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ పూర్తవడంతోకఠినతరమైన ఎత్తైన భూభాగం గుండా కష్టతరమైన పర్వతారోహణను ఇప్పుడు కైలాష్-మానససరోవర్ యాత్ర యాత్రికులు నివారించవచ్చు. సిక్కిం లేదా నేపాల్ మార్గాల వెంబడి కైలాష్-మానససరోవర్ యాత్ర రెండు మూడు వరాల పాటు సాగేది. 90 కిలోమీటర్ల నడవాల్సి వచ్చేదిదీని వల్ల వయోవృద్దులకు ఇబ్బందులు ఎదురయ్యేవి.  ఇప్పటి వరకు ఉన్న మార్గాల వల్ల భారత భూభాగం లో 20 శాతంచైనా భూభాగంలో 80 శాతం యాత్ర చేయాల్సి ఉండేది. ఇపుడు ఘటిభగర్-లిపులేఖ్ మార్గం వల్ల యాత్ర అటుదిటు అయిందిమానససరోవర్ యాత్ర ఇక నుండి 84 శాతం భారత భూభాగం, 16 శాతం చైనా భూభాగం నుండి చేయవచ్చు. ఇది నిజంగా ఒక చారిత్రకమని రక్షణ మంత్రి వ్యాఖ్యానించారు. సరిహద్దు రహదారుల సంస్థ (బిఆర్ఓ) ఇంజినీర్లుసిబ్బంది అంకితభావమే ఈ విజయానికి కారణమని రక్షణ మంత్రి ప్రశంసించారు. రహదారి నిర్మాణం  సందర్బంగా అసువులు బాసిన వారికి ఆయన శ్రద్ధాంజలి ఘటించారు. కోవిడ్-19 సమయంలో కూడా తమ కుటుంబాలకు దూరంగా ఈ కార్యాన్ని పూర్తి చేసిన బిఆర్ఓ సిబ్బందిని రక్షణ మంత్రి అభినందించారు.    

 

 

 

మొదట్నుంచి కూడా బిఆర్ఓ కుమాన్గర్వాల్ ప్రాంతాల అభివృద్ధిలో చురుకైన పాత్ర పోషిస్తున్నాయని శ్రీ రాజనాధ్ సింగ్ అన్నారు. 

బిఆర్ఓ డైరెక్టర్ జనరల్ లెఫ్టనెంట్ జనరల్ హరిపాల్ సింగ్ మాట్లాడుతూ ఈ రహదారి నిర్మాణంలో అనేక ఇబ్బదులు ఎదురయ్యాయని అన్నారు. నిరంతరంగ మంచు కురవడంచాల నిటారుగా ఉన్న ఎతైన ప్రదేశాలువాతావరణ పరిస్థితులు తమ పనిని సంవత్సరానికి 5 నెలలకు మాత్రమే పరిమితం చేశాయని ఆయన అన్నారు. దీనితో పాటు అకస్మాత్తుగా వానలువరదలు రావడం వల్ల చాలా నష్టం జరిగింది. మొదటి 20 కిలోమీటర్లు కొండలన్నీ చాల గట్టి రాళ్లతో ఉండడంతోవాటి గుండా మార్గం వేసుకుంటూ వెళ్ళడానికి అనేక మంది ప్రాణాలు కోల్పోయారని, 25 యంత్రాలు కూడా పక్కనే ఉన్న కాళీ నదిలో పడి ధ్వంసం అయ్యాయని ఆయన వెల్లడించారు. ఇన్ని అడ్డంకులున్నప్పటికీ బిఆర్ఓ తన పని సామర్ధ్యాన్ని 20 రేట్లు పెంచి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించిందని అన్నారు. ఈ ప్రాంతాలకు వందలాది టన్నుల గల సామాగ్రిని తరలించడానికి హెలీకాఫ్టర్లను కూడా వినియోగించారని తెలిపారు. 

                                                           

 

ఈ కార్యక్రమంలో రక్షణ దళాల చీఫ్ జనరల్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం. నరవనే, రక్షణ కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్, అల్మోరా (ఉత్తరాఖండ్) లోక్ సభ సభ్యుడు శ్రీ అజయ్ తమ్తా, సీనియర్ అధికారులు పాల్గొన్నారు. 



(Release ID: 1622178) Visitor Counter : 364