రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

భారత నేవీ యొక్క వ్యక్తిగత రక్షణ పరికరాల (పి.పి.ఈ)ధృవీకరణను పూర్తి చేసిన ఐ.ఎన్.ఎం.ఏ.ఎస్ (ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్)

Posted On: 07 MAY 2020 7:39PM by PIB Hyderabad

భారత నేవీ రూపొదించిన మరియు ఉత్పత్తి చేసిన వ్యక్తిగత రక్షణ పరికరాలు (పి.పి.ఈ)ను ఐ.ఎన్.ఎం.ఏ.ఎస్ (ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్), ఢిల్లీ పరీక్షించింది. ఇది డి.ఆర్.డి.ఓ.కు చెందిన సంస్థ. ఈ సంస్థ పి.పి.ఈ.లను పరీక్షించి, ధృవీకరించింది. అంతే గాక కోవిడ్ నేపథ్యంలో భారీగా ఉత్పత్తి చేసి, క్లినికల్ గా వాడవచ్చని తెలిపింది.

కోవిడ్ -19 మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో వ్యక్తిగత రక్షణ సామగ్రి (పి.పి.ఈ)ల కొరత తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఎందు కంటే ఇది హెల్త్ కేర్ వర్క్ ఫోర్స్ శ్రేయస్సును మరియు లభ్యతను దెబ్బ తీస్తుంది. వారి భద్రత మరియు ధైర్యాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.

ఈ పరీక్షలకు సంబంధించి కఠినమైన ప్రమాణాలను ఎదుర్కొవడానికి ఈ పి.పి.ఈలను ఐ.సి.ఎం.ఆర్ మరియు కేంద్ర కుటుంబ, ఆరోగ్య సంక్షేమ శాఖ కూడా వీటిని పరిశీలించాల్సి ఉంది.

కోవిడ్ వ్యతిరేక పోరాటంలో ఈ క్లిష్టమైన వనరులను అందుబాటులో ఉంచే సవాలును భారతీయ నౌకాదళం స్వీకరించింది. ఇన్నోవేషన్ సెల్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ నావల్ మెడిసిన్, ముంబై మరియు నావల్ డక్ యార్డ్, ముంబై ఏర్పాటు చేసిన బృందం పి.పి.ఈ.ల రూపకల్పన మరియు ఉత్పత్తికి సహకరించింది. పి.పి.ఈ.ని పరీక్షించడం, ధృవీకరించడం వంటివి డి.ఆర్.డి.ఓ. కు చెందిన ఐ.ఎన్.ఎం.ఏ.ఎస్ (ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ మెడిసిన్ అండ్ అలైడ్ సైన్సెస్), ఢిల్లీ పరీక్షించింది.

6/6 సింథటిక్ బ్లడ్ ప్రజెంటేషన్ రెసిస్టెన్స్ టెస్ట్ ప్రెజర్ పరీక్షలో ఈ పి.పి.ఈ. విజయం సాధించింది. (ఐ.ఎస్.ఓ. 16603 ప్రమాణాల ప్రకారం భారత ప్రభుత్వం కనీస 3/6 మరియు అంతకంటే ఎక్కువ స్థాయిని తప్పనిసరి చేస్తుంది). ఈ పరిస్థితుల్లో కోవిడ్ పరిస్థితుల్లో భారీగా ఉత్పత్తి చేయబడి, ఉపయోగించబడుతుదని ధృవీకరించబడింది.

పి.పి.ఈ. యొక్క విశిష్ట లక్షణాలు సరళమైనవి, వినూత్నమైనవి మరియు తక్కువ ఖర్చుత కూడిన డిజైన్. అందువల్ల దీనిని ప్రాథిమిక గౌను తయారీ సౌకర్యాల ద్వారా తయారు చేయవచ్చు. ఉపయోగించిన ఫ్యాబ్రిక్ యొక్క వినూత్న ఎంపికకు ఈ పి.పి.ఈ. నిదర్శనం. ఇది పి.పి.ఈ.కి దాని శ్వాసక్రియ మరియు చొచ్చుకుపోయే నిరోధకతను ఇస్తుంది. ఇది వినియోగదారులకు సౌకర్యవంతంగా మరియు సురక్షితంగా ఉంటుంది.

ఈ పి.పి.ఈ. ఖర్చు వాణిజ్యపరంగా లభించే వాటి కంటే చాలా తక్కువ. 

 

***

 

(Release ID: 1621951) Visitor Counter : 297