ఆయుష్

కోవిడ్ -19 ప‌రిస్థితుల‌కు సంబంధించి ఆయుష్ విదానాల‌తో కూడిన ఇంట‌ర్ డిసిప్లిన‌రీ అధ్య‌య‌నాలు ఈరోజు లాంఛ‌నంగా ప్రారంభంకానున్నాయి.

ఆయుష్ మంత్రి శ్రీ శ్రీ‌పాద య‌శోనాయ‌క్‌, ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హ‌ర్డ‌వ‌ర్ధ‌న్ న్యూఢిల్లీలో మే 7న సంయుక్తంగా కోవిడ్ ప‌రిస్థితుల‌కు సంబంధించి మూడు ఆయుష్ ఆధారిత అధ్య‌య‌నాల‌ను ప్రారంబించ‌నున్నారు.

Posted On: 06 MAY 2020 6:22PM by PIB Hyderabad

ఆయుష్ మంత్రిత్వ‌శాఖ దేశంలో కోవిడ్ -19 మ‌హ‌మ్మారిని ఎదుర్కొనేందుకు ఆయుష్ విధానాల‌కు చెందిన క్లినిక‌ల్ ప‌ద్థ‌తుల (రోగ‌నిరోద‌క చ‌ర్య‌లు, మ‌రికొన్ని అద‌న‌పు ప‌ద్ధ‌తుల‌)ద్వారా కొన్ని చ‌ర్య‌లు చేపట్టింది.  రిస్క్ ఎక్కువ‌గా ఉన్న జనాభాపై ఆయుష్ ఆధారిత రోగ‌నిరోధ‌క చ‌ర్య‌ల ప్ర‌భావాన్ని ఆయుష్ మంత్రిత్వ‌శాఖ అధ్య‌య‌నం చేస్తోంది.. అలాగే కోవిడ్ -19 కు వ్య‌తిరేకంగా ఆయుష్ ప్ర‌తిపాదించిన , ఆయుష్ చేప‌ట్టిన చ‌ర్య‌ల‌ను కూడా అధ్య‌య‌నం చేస్తున్నారు.
విశ్వ‌విద్యాల‌య గ్రాంట్ల‌సంఘం వైస్ ఛైర్మ‌న్ డాక్ట‌ర్ భూష‌ణ్ ప‌ట్వ‌ర్ధ‌న్ అధ్య‌క్ష‌త‌న, ప‌లువురు నిపుణుల‌తో ఇందుకు సంబంధించిన వ్యూహాలె , చ‌ర్య‌ల‌ను ప్ర‌తిపాదించేందుకు ఆయుష్ మంత్రిత్వ‌శాఖ ఒక ఇంట‌ర్ డిసిప్లిన‌రీ ఆయుష్ ప‌రిశోధ‌న ,అభివృద్ధి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటుచేసింది.
కింద పేర్కొన్న అధ్య‌య‌నాల‌ను  మే 7,2020న లాంఛ‌నంగా ప్రారంభిస్తారు.
ఆయుర్వేదవిధానాల‌పై క్లినికల్ ప‌రిశోధ‌న‌, అద్య‌య‌నాలు, రోగనిరోధకత , కోవిడ్ -19పై పోరాటానికి అనుబంధంగాప్రామాణీకృత ర‌క్ష‌ణ‌:  ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఆరోగ్య  కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (MoHFW) , సైన్స్ , టెక్నాలజీ మంత్రిత్వ శాఖల సంయుక్త ఆధ్వ‌ర్యంలో సంయుక్త‌ క్లినికల్ అధ్యయనాలను ఐసిఎంఆర్‌ సాంకేతిక సహకారంతో, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ & ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) ద్వారా  చేప‌డ‌తారు.

   ఇంటర్ డిసిప్లినరీ ఆయుష్ ఆర్ అండ్ డి టాస్క్ ఫోర్స్ , కోవిడ్ -19  పాజిటివ్ కేసుల‌కు సంబంధించి, నాలుగు వేర్వేరు జోక్యాలను అధ్యయనం చేయడానికి దేశవ్యాప్తంగా వివిధ సంస్థల నుండి బాగా పేరున్న నిపుణుల సమగ్ర సమీక్ష, సంప్రదింపుల ప్రక్రియ ద్వారా రోగనిరోధక అధ్యయనాల కోసం క్లినికల్ రీసెర్చ్ ప్రోటోకాల్స్, యాడ్-ఆన్ చ‌ర్య‌ల ద్వారా నాలుగు విధానాలైన‌ . అశ్వగంధ, యష్టిమ‌ధు, గుడుచి + పిప్పాలి, పాలీ హెర్బల్ ఫార్ములేష‌న్ (ఆయుష్ -64)ల‌పై ప‌రిశోధ‌న సాగిస్తారు.


కోవిడ్ -19 మ‌హ‌మ్మారి సమయంలో  సార్స్ -సిఒవి-2 పేషెంట్ల‌కు రిస్క్  ఎక్కువ ఉన్నందున వారిలో  రోగనిరోధకత పెంపు కోసం అశ్వగంధ: ఆరోగ్య సంరక్షకుల‌చే హైడ్రాక్సీక్లోరోక్విన్‌తో పోలిక  అలాగే,
        తేలికపాటి నుండి మోడరేట్ కోవిడ్ -19 చికిత్స కోసం ‘స్టాండర్డ్ ఆఫ్ కేర్’ కు అనుబంధంగా ఆయుర్వేద సూత్రీకరణల‌ ప్రభావం: యాదృచ్ఛిక, ఓపెన్ లేబుల్, సమాంతర సమర్థత, క్రియాశీల నియంత్రణ, బహుళ-కేంద్ర అన్వేషణాత్మక ఔష‌ధ‌ పరీక్ష.
    ఆయుష్ ఆధారిత రోగనిరోధక జోక్యాల ప్రభావంపై జనాభా ఆధారిత ఇంటర్వెన్షనల్ అధ్యయనాలు: ఎక్కువ రిస్క్  ఉన్న జనాభాలో కోవిడ్ -19 సంక్రమణ నివారణలో ఆయుర్వేద జోక్యాల ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ జనాభా ఆధారిత అధ్యయనాలను ప్రారంభిస్తోంది. కోవిడ్ -19   నివారణ సామర్థ్యాన్ని ఆయుష్ విధానాల‌ ద్వారా అంచనా వేయడం  ,హైరిస్క్‌ జనాభాలో జీవన నాణ్యత మెరుగుదలను అంచనా వేయడం దీని ప్రధాన లక్ష్యాలు. దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాల్లోని ఆయుష్ మంత్రిత్వ శాఖ , జాతీయ సంస్థల క్రింద నాలుగు పరిశోధనా మండలులు, సుమారు 5 లక్షల జనాభా కలిగి ఉన్న అనేక రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఈ అధ్యయనం జరుగుతుంది.
అధ్యయన  ఫలితం ఖచ్చితంగా కోవిడ్ -19 వంటి మహమ్మారి ని ఎదుర్కొనే స‌మ‌యంలో ఆయుష్ విధానాల ద్వారా నివారణ సామర్థ్యాన్ని శాస్త్రీయ ఆధారాల ద్వారా అర్థం చేసుకోవడంలో కొత్త మార్గాన్ని ఏర్ప‌రుస్తుంది.
.COVID 19 నివారణలో  ఆయుష్ సలహాదారుల అంగీకారం , వినియోగం  ప్రభావ అంచనా కోసం ఆయుష్ సంజీవని అప్లికేషన్ ఆధారిత అధ్యయనం: 5 మిలియన్ల మంది ప్రజలను లక్ష్యంగా చేసుకుని భారీ జనాభా  డేటాను రూపొందించడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆయుష్ సంజీవ‌ని మొబైల్ యాప్‌ను అభివృద్ధి చేసింది. జనాభాలో ఆయుష్ విధానాలామోదం, అంగీకారం, వాడ‌కం , ఇంఉకు ప్ర‌జ‌లు తీసుకుంటున్న చ‌ర్య‌లు , కోవిడ్ -19 నివారణలో దాని ప్రభావం,  వంటివాటిపై డేటాను రూపొందించడం దీని ఆశించిన ఫ‌లితాల‌లో ముఖ్య‌మైన‌ది.

 


(Release ID: 1621701) Visitor Counter : 281