సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

ఫ్రేగ్రాన్సెస్‌ అండ్‌ ఫ్లేవర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రతినిధులతో శ్రీ గడ్కరీ సమావేశం

దేశీయ ఉత్పత్తి, ప్రత్యామ్నాయాల దిగుమతిపై చర్చ
వెదురు ఉత్పత్తిని పెంచాల్సిన అవసరాన్ని స్పష్టం చేసిన మంత్రి

Posted On: 06 MAY 2020 7:42PM by PIB Hyderabad

కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు (ఎంఎస్‌ఎంఈ) & రహదారి రవాణా, జాతీయ రహదారుల మంత్రి శ్రీ నితిన్‌ గడ్కరీ ఫ్రేగ్రాన్సెస్‌ అండ్‌ ఫ్లేవర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రతినిధులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. పర్యావరణ వ్యవస్థ, ఎంఎస్‌ఎంఈలపై కొవిడ్‌-19 ప్రభావంపై సమీక్షలో చర్చించారు. కొవిడ్‌-19 కారణంగా ఎంఎస్‌ఎంఈలు ఎదుర్కొంటున్న సవాళ్లను ఫ్రేగ్రాన్సెస్‌ అండ్‌ ఫ్లేవర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా ప్రతినిధులు ప్రస్తావించారు. కొన్ని సూచనలు చేశారు. ఎంఎస్‌ఎంఈల సెక్టార్‌ సాఫీగా సాగేలా ప్రభుత్వ మద్దతును కోరారు.

    విదేశాల నుంచి దిగుమతుల కంటే దేశీయ ఉత్పత్తులపై దృష్టి పెట్టాలని ఫ్రేగ్రాన్సెస్‌ అండ్‌ ఫ్లేవర్స్‌ పరిశ్రమ ప్రతినిధులకు శ్రీ గడ్కరీ సూచించారు. వెదురు ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచ మార్కెట్‌లో పోటీ ఇవ్వడానికి ఆవిష్కరణలు, సాంకేతికత, పరిశోధన నైపుణ్యంపై మరింత శ్రద్ధ ఉంచాలని సూచించారు.

    సమీక్షలో ప్రస్తావనకు వచ్చిన కొన్ని ప్రధాన సమస్యలు, ఇచ్చిన సూచనలు: ముడి సరుకుపై ఎక్కువ దిగుమతి సుంకం, పూర్తిగా తయారైన వస్తువులపై తక్కువ దిగుమతి సుంకం, ఈశాన్య ప్రాంతంలో విద్యుత్, రవాణా సమస్యలు, సిబ్బందికి జీతాల చెల్లింపు, ద్రవ్య లభ్యత పెంచడం, మూలధన సమస్యలు, నగదు చలామణీ కోసం ఆదాయపు పన్ను వాపసును వేగవంతం చేయడం.

    ఫ్రేగ్రాన్సెస్‌ అండ్‌ ఫ్లేవర్స్‌ పరిశ్రమ ప్రతినిధుల ప్రశ్నలన్నింటికీ శ్రీ గడ్కరీ సమాధానాలిచ్చారు. ప్రభుత్వం తరపున చేతనైన సాయం చేస్తామని హామీ ఇచ్చారు. సంబంధింత విభాగాల ద్వారా సమస్యలు పరిష్కారమయ్యేలా చూస్తామన్నారు. 
 



(Release ID: 1621636) Visitor Counter : 171