శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

విస్తారమైన శాస్త్ర పరిజ్ఞానానికి కేంద్రంగా డి.ఎస్.టి. ఎలా రూపుదిద్దుకుందో కోవిడ్-19 సంక్షోభం వివరించింది : ప్రొఫెసర్ అశుతోష్ శర్మ

Posted On: 05 MAY 2020 12:55PM by PIB Hyderabad

ఇటీవలి కాలంలో శాస్త్ర, సాంకేతిక శాఖ (డి.ఎస్.టి.) బ్రహ్మాండమైన మార్పు చెందింది. విస్తారమైన శాస్త్ర పరిజ్ఞానానికి కేంద్రంగా రూపుదిద్దుకుంది. పెరుగుతున్న శాస్త్ర పరిజ్ఞానంతో పాటు కరోనా వైరస్ సంక్షోభాన్ని ఒక అవకాశంగా తీసుకుని డి.ఎస్.టి. పురోగతి సాధించిందని డి.ఎస్.టి. కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ పేర్కొన్నారు. డి.ఎస్.టి. 50వ వ్యవస్థాపక దినోత్సవ సందర్భంగా "కరొనాతో పోరాటం - శాస్త్రీయ పరిశోధన & ఆవిష్కరణల పెంపు" అనే అంశంపై ఎలెట్స్ టెక్నో మీడియా తో నిర్వహించిన ప్రత్యక్ష వెబినార్ లో ఆయన ప్రసంగించారు. 

"శాస్త్రవేత్తలు కొన్ని ప్రమాదాలకు గురైనా, తమ శాస్త్ర పరిశోధనల్లో మంచి ఫలితాలు సాధించే విధంగా ఇప్పుడు కార్యక్రమాలు రూపొందించబడుతున్నాయి. ఆ ఫలితాలు మంచి మార్పును తెస్తున్నాయి. ఆ కార్యక్రమాల్లో శాస్త్రీయ, ఉపయోగకరమైన పరిశోధన, అభివృద్ధి (ఎస్.యు.పి.ఆర్.ఏ. - సుప్రా), మరియు అధిక ప్రాధాన్యత ఉన్న ప్రాంతాల్లో పరిశోధన తీవ్రతను పెంచడం (ఐ.ఆర్.హెచ్.పి.ఏ.) వంటివి ఉన్నాయిఇటువంటి కార్యక్రమాలు శాస్త్ర పరిజ్ఞానం చేసిన విధానాన్ని మారుస్తున్నాయి.  వీటిలో కొన్ని కార్యక్రమాల భావన మరియు విధానాలను కోవిడ్-19 సంక్షోభానికి పరిష్కారం కోసం చేపట్టిన కృషిలో అమలుచేయడం జరిగింది." అని ఆయన వివరించారు

డి.ఎస్.టి. ఆధ్వర్యంలోని కొన్ని స్వయం ప్రతిపత్తి సంస్థలు కోవిడ్ మహమ్మారికి చెందిన బహుముఖ సమస్యలకు అనేక పరిష్కారాలతో కేవలం ఒక నెల లోపే వచ్చాయి. వాటిలో కొన్ని పరిష్కారాలను ప్రైవేట్ కంపెనీలు, అంకురసంస్థల సహకారంతో అమలుచేయడం జరిగింది.  స్పష్టంగా చెప్పాలంటే, ఇటువంటి అవకాశాలన్నింటినీ ఉపయోగించుకుని సైన్స్ చేసే విధానంలో మార్పు తీసుకురావం జరిగింది. ఈ సంక్షోభం మార్పుకు ఒక క్షేత్రస్థాయి పరీక్ష గా నిలిచింది. 

అమెరికాలోని నేషనల్ సైన్స్ ఫౌండేషన్ (ఎన్.ఎస్.ఎఫ్.) తరహాలో 1971 మే నెల 3వ తేదీన డి.ఎస్.టి. ని స్థాపించడం జరిగిందని ఆయన చెప్పారు.   ఇది కేవలం నిధులను అందించడమే కాక విధానాలు చేస్తుంది. ఇతర దేశాలతో శాస్త్రీయ పనిని సమన్వయ పరుస్తుంది.  శాస్త్రవేత్తలకు, శాస్త్రీయ సంస్థలకు  సాధికారత కల్పిస్తుంది.   గత ఐదేళ్లలో డి.ఎస్.టి. చేపట్టిన కీలక కార్యక్రమాల గురించి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ తెలియజేస్తూ, బడ్జెట్ 100 శాతానికి పైగా పెరిగిందనీవిస్తృత పరిధిలో నూతన కార్యక్రమాలను చేపట్టడం జరిగిందనీ వివరించారు

నిధి (ఎన్.ఐ.డి.హెచ్.ఐ.) కార్యక్రమం గురించి ఆయన చెబుతూ, అంకురసంస్థలకు ప్రారంభం నుండి చివరిదాకా సహాయ సహకారాలందించి, గత ఐదేళ్లలో ఇంక్యూబేటర్లు, అంకురసంస్థల సంఖ్యను ఈ పధకం ద్వారా రెట్టింపు చేసినట్లు తెలియజేసారు.  మానక్ (ఎమ్.ఏ.ఎన్.ఏ.కె) కార్యక్రమం ద్వారా ప్రతీ ఏటా 10 లక్షల పాఠశాలల విద్యార్థుల నుండి వారి ఆలోచనలను నమూనాలుగా రూపొందింపజేసి, వారి ఆలోచనల శక్తిని వారికి తెలియజేయడంలో సహాయపడడం జరుగుతుంది.  

ఎమ్.ఎస్.ఎం.ఈ. లు  మరియు  అంకురసంస్థల అవసరాలకు అంకితమైన సాథి  (ఎస్.ఏ.టి.హెచ్.ఐ.) కేంద్రాల గృహనిర్మాణ పరికరాల గురించి ప్రొఫెసర్ శర్మ తెలియజేస్తూ, పరిశ్రమను విద్య సంబంధమైన విషయాలతో అనుసంధానించడానికి ఎమ్.ఎస్.ఎం.ఈ. లు  మరియు  అంకురసంస్థలు ఒక్కొక్కటీ 125 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయబడ్డాయని తెలిపారు. 

సైబర్-ఫీజికల్ విధానాల వంటి ప్రాంతాలలో నూతన కార్యక్రమాలను, కమ్యూనికేషన్, కంప్యూటింగ్, ఆర్ట్స్ వంటి  వివిధ కార్యక్రమాలతో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా భారతదేశాన్ని సిద్ధం చేయడంలో డి.ఎస్.టి. తీవ్రంగా కృషి చేస్తోందని ప్రొఫెసర్ అశుతోష్ శర్మ నొక్కి చెప్పారు. అదేవిధంగా, నేషనల్ మిషన్ ఆన్ క్వాంటమ్ సైన్సు, సైన్స్ టెక్నాలజీ & ఇట్స్ అప్లికేషన్స్, సూపర్ కంప్యూటింగ్ మిషన్ వంటి వివిధ సవాళ్లతో కూడిన అంశాలపై డి.ఎస్.టి. పరిశోధనలు చేస్తోంది. వీటిలో సుస్థిర అభివృద్ధి, వాతావరణ మార్పుపై పరిశోధన, కోవిడ్-19 సంక్షోభం వంటివి కూడా ఉన్నాయి.  

స్వయం ప్రతిపత్తి సంస్థలు, అనుబంధ సంస్థలు, ఇంక్యూబేటర్లు, శాస్త్రవేత్తలు, అంకురసంస్థలు, ప్రభుత్వేతర సంస్థలు వంటి అతి పెద్ద నెట్ వర్క్ తో ఉన్న డి.ఎస్.టి. కుటుంబం అనేక అవరోధాలను సైతం అధిగమించి అత్యవసర సేవలు అందిస్తోంది. కోవిడ్-19 నిర్వహణలో భాగంగా  డి.ఎస్.టి. 11 ప్రధాన విభాగాలలో విశేషమైన సేవలనందించింది. అవి -  నిధులు సమకూర్చడం, బయో మార్కర్ల రంగంలో ప్రాధమిక పరిశోధన, ఉత్పత్తుల తయారీలో అంకురసంస్థలకు ప్రోత్సాహం, డి.ఎస్.టి.తో అనుబంధంగా ఉన్న ప్రభుత్వేతర సంస్థలకు మాస్కులు, క్రిమిసంహారకాల తయారీలో సాధికారత కల్పించడం, విగ్యాన్ ప్రసార్ మరియు శాస్త్ర, సాంకేతిక ప్రసారాల జాతీయ మండలి ఎన్.సి.ఎస్.టి.సి.) వంటి సంస్థల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించడం వంటివి ఉన్నాయి. 

అనేక పరిశోధనలను డి.ఎస్.టి. ఉత్పత్తుల రూపంలోకి మార్చింది.  ఉదాహరణకు, డి.ఎస్.టి. కింద స్వయం ప్రతిపత్తి సంస్ధగ్గ ఉన్న శ్రీ చిత్ర తిరుణాల్ ఇన్ స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ & టెక్నాలజీ (ఎస్.సి.టి.ఎం.ఎస్.టి.) 15 వినూత్న ఉత్పత్తులతో ముందుకు వచ్చింది. అందులో పది ఉత్పత్తుల తయారీ ప్రారంభమయ్యింది. డి.ఎస్.టి. కింద పనిచేస్తున్న సర్వే అఫ్ ఇండియా వివిధ ప్రాంతాల 3డి మాపింగ్ తయారుచేస్తోంది. స్పష్టమైన మార్గదర్శనం, తగిన నిధులు, అపారమైన శాస్త్ర విజ్ఞానం తో మొత్తం దేశానికి అవసరమైన ఎస్.&టి. ఆధారిత రూపాంతర మార్పులను తీసుకురాగలదని డి.ఎస్.టి. నిరూపించింది. 

 

****



(Release ID: 1621203) Visitor Counter : 197