ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
పొగాకు ఉత్పత్తుల ప్యాకేజీలపై కొత్త ఆరోగ్య హెచ్చరిక
రెండు ఫొటోలు జారీ చేసిన ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
2020 సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్న కొత్త ఫొటోలు
Posted On:
04 MAY 2020 3:23PM by PIB Hyderabad
అన్ని రకాల పొగాకు ఉత్పత్తి ప్యాకేజీలపై ముద్రించాల్సిన కొత్త ఆరోగ్య హెచ్చరికలను భారత ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ జారీ చేసింది. 13 ఏప్రిల్ 2020 నాటి జీఎస్‌ఆర్ 248(ఇ) ద్వారా, సిగరెట్లు మరియు ఇతర పొగాకు ఉత్పత్తుల (ప్యాకేజింగ్ మరియు లేబులింగ్) నిబంధనలు, 2008లో సవరణ చేసింది. "సిగరెట్లు మరియు ఇతర పొగాకు ఉత్పత్తులు (ప్యాకేజింగ్ మరియు లేబులింగ్) సవరణ నిబంధనలు, 2020" ద్వారా కొత్త ఫొటోలు జారీ చేసింది. ఈ సవరణలు సెప్టెంబర్ 1, 2020 నుంచి అమల్లోకి వస్తాయి.
కొత్త ఆరోగ్య హెచ్చరికలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
(a) సెప్టెంబర్ 1, 2020 నుంచి ప్రారంభమైన తర్వాత పన్నెండు నెలల వరకు ప్యాకేజీలపై ఫొటో-1 ముద్రించాలి.
Image- 1
|
|
|
(b) ఇమేజ్ -1 ఆరోగ్య హెచ్చరిక ప్రారంభమైన తేదీ నుంచి పన్నెండు నెలలు ముగిసిన తర్వాత ఇమేజ్-2 ముద్రించాలి.
Image- 2
|
|
|
19 భాషల్లో పేర్కొన్న ఆరోగ్య హెచ్చరికల ప్రకటన www.mohfw.gov.in మరియు www.ntcp.nhp.gov.in వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంది.
కొత్త ఆరోగ్య హెచ్చరికల ప్రకారం, సమాచారం ఇలా ఉంది;
సెప్టెంబర్ 1, 2020 నుంచి ఉత్పత్తి చేసే లేదా దిగుమతి చేసుకునే లేదా ప్యాక్ చేసే పొగాకు ఉత్పత్తులపై ఇమేజ్-1 ఉండాలి. 2021 సెప్టెంబర్ 1 నుంచి ఇమేజ్-2 ఉండాలి.
సిగరెట్లు లేదా ఇతర పొగాకు ఉత్పత్తుల తయారీ, సరఫరా, దిగుమతి లేదా పంపిణీలో ప్రత్యక్షంగాగానీ, పరోక్షంగాగానీ పాలుపంచుకునే వ్యక్తి, ఆ ఉత్పత్తుల ప్యాకేజీలపై నిర్దేశించిన ఆరోగ్య హెచ్చరికలు కచ్చితంగా ఉండేలా చూసుకోవాలి.
ఈ నిబంధన ఉల్లంఘిస్తే శిక్షార్హులు అవుతారు. సిగరెట్లు మరియు ఇతర పొగాకు ఉత్పత్తుల (వ్యాపార మరియు వాణిజ్య ప్రకటనలు మరియు నియంత్రణ, ఉత్పత్తి, సరఫరా మరియు పంపిణీ నిషేధం) చట్టం 2003, సెక్షన్ 20 కింద జైలు లేదా జరిమానా విధిస్తారు.
"ప్యాకేజీ" నిర్వచనాన్ని చట్ట నియమాలకు అనుగుణంగా ఉండేలా సవరించారు.
(Release ID: 1620923)
Visitor Counter : 366