పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ

కోవిడ్-19 వల్ల ఉత్పన్నమైన పరిస్థితిల్లో ప్రజలకు సహాయం అందించేందుకు దేశవ్యాప్తంగా స్థానిక పాలనా యంత్రాంగాలు అన్ని చర్యలు కొనసాగిస్తున్నాయి

వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వారికి సహాయపడటానికి కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయడం, ప్రయాణ మార్గాలను గుర్తించడం, నిర్బంధంలో ఉన్నవారిని, లారీ డ్రైవర్లతో సహా సరిహద్దులు దాటినవారికి సంబందించిన వ్యక్తులను సంప్రదించడం, సందేహాలను నివృతి చేయడం వంటి వివిధ చర్యలు చేపట్టారు; బయో-మెడికల్ వ్యర్థాల నిర్వహణ విధానాలను సూచించడం; వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకం కోసం ఏర్పాట్లు వంటి చర్యలు వీటిలో భాగం

Posted On: 03 MAY 2020 8:14PM by PIB Hyderabad

 

కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తి నిరోధానికి  దేశవ్యాప్తంగా రాష్ట్రజిల్లాపంచాయతీ స్థాయిలలోని స్థానిక పాలనా యంత్రాంగాలు  వివిధ కార్యక్రమాలను కొనసాగిస్తున్నాయి. లాక్ డౌన్ పరిస్థితులు ఉల్లంఘన జరగకుండా,  సామాజిక దూరం నిబంధనలను కఠినంగా అమలయ్యేలా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలుజిల్లా అధికారులుగ్రామ పంచాయతీలతో సన్నిహిత సమన్వయంతో పనిచేస్తోంది. వివిధ కార్యక్రమాల విషయంలో ఇతరులు అనుసరించే ఉత్తమ చర్యలు -

 

ఆంధ్ర ప్రదేశ్: 

వివిధ ప్రాంతాల్లో ఉండిపోయిన వలస కార్మికుల సహాయార్థం ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం కంట్రోల్ రూం ఏర్పాటు చేసింది. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన ఆంధ్ర ప్రజలు 0866-2424680 కు కాల్ చేయవచ్చు అలాగే ఆంధ్రాలో చిక్కుకున్న ఇతర రాష్ట్రాల ప్రజలు 1902 కు కాల్ చేసి వారి వివరాలను ఇవ్వవచ్చువారి ప్రదేశాలకు వెళ్ళడానికి సహాయం పొందవచ్చు. అదేవిధంగాగ్రీన్ జోన్లో ఉన్న 1655 పరిశ్రమలకు అనుమతులు ఇవ్వబడ్డాయి. అవి కార్యకలాపాలు ప్రారంభించాయి. వలస కార్మికులు ఒక గ్రీన్ జోన్ నుండి మరొక గ్రీన్ జోన్ కి  వెళ్లి తగిన జాగ్రత్తలతో పనిచేయడానికి అనుమతి ఉంది.

https://images.newindianexpress.com/uploads/user/imagelibrary/2020/4/30/w900X450/igrant-eps_.jpg

 

  అస్సాం: కాచర్ జిల్లాలోని సిల్చార్ బ్లాక్తారాపూర్ గ్రామ పంచాయతీలో 17 మంది సభ్యులతో కూడిన స్వయం సహాయక సంఘాలు మాస్కులు ఉత్పత్తి చేస్తున్నాయి. 

 

 

 

 

కేరళ : 

 

కోవిడ్-19 వ్యాప్తి నుండి ఇతర దేశాలు రాష్ట్రాల నుండి జిల్లాకు వచ్చిన ప్రజలతో కలిసిన వారిని గుర్తించదానికి  40 మంది NSS వాలంటీర్లు కలెక్టరేట్ ప్రాంగణంలోని జిల్లా వైద్య కార్యాలయంలో పని చేస్తున్నారు. కంట్రోల్ సెల్ దిగ్బంధంలో ఉన్నవారినిఇతర రాష్ట్రాల నుండి వస్తువులను రవాణా చేస్తున్న లారీ డ్రైవర్లనుప్రత్యేక పాస్ తో సరిహద్దులు దాటిన వారిని పర్యవేక్షిస్తుంది. వారి ప్రయాణ మార్గాలు మరియు సంప్రదింపు వ్యక్తులను గుర్తిస్తున్నారు. సెల్ వద్ద భద్రతా చర్యలను చేపట్టినప్పుడు వాలంటీర్లు మాస్కులు ధరిస్తారుశానిటైజర్లను ఉపయోగిస్తారు. వీరంతా తమ ఇళ్లలోకి ప్రవేశించే ముందు తమను తాము శానిటైజ్ చేసుకునిఫోన్‌లను శుభ్రపరుచుకుంటారు. రోజు పని తర్వాతయథాతదంగా తమ చదువులు  కొనసాగించడానికి ఆన్‌లైన్ తరగతులకు హాజరవుతారు.

https://img.manoramaonline.com/content/dam/mm/en/districts/malappuram/images/2020/4/24/little-star-malappuram-1.jpg

 

తెలంగాణ:

 

·         కోవిడ్-19 రోగులుఅనుమానితుల చికిత్స ప్రదేశాల నుండి బయో-మెడికల్ వ్యర్థ పదార్థాల నిర్వహణ విషయంలో ప్రత్యేక నిబంధనలుమార్గదర్శకాలను అనుసరించాలని తెలగంగా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (టిఎస్పిసిబి) ప్రజలనుపాలనా యంత్రాంగాలను విజ్ఞప్తి చేసింది. 

 

https://cdn.telanganatoday.com/wp-content/uploads/2020/05/Capture.jpg

 ·         రామగుండం జాతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం లేడీస్ క్లబ్దీప్తి మహిళా సమితి అక్కడ ఉద్యోగులుకాంట్రాక్టు పని వారికి 5,000 కాటన్ మాస్కులను పంపిణీ చేశాయి. ఈ మాస్కులను లేడీస్ క్లబ్ సభ్యులతో పాటుచుట్టుపక్కల ఉన్న గ్రామాలలోని మహిళలు వీటిని తయారు చేయడం విశేషం.  

 

 

https://cdn.telanganatoday.com/wp-content/uploads/2020/05/NTPC.jpg

 మిజోరాం:

 

మిజోరాం గ్రామీణ ప్రాంత ప్రజలు ఎక్కువగా వ్యవసాయ పనులులేబర్ పనులపైనే ఆధార పడి ఉంటారు. ప్రస్తుత పరిస్థితిలో వారి రోజు వారి జీవనం ఇబ్బందికరంగా మారడంఆర్జన లేకపోవడంతో స్థానిక సంస్థలు వారికి తగు ఆహార పదార్థాలు అందించేలా చర్యలు తీసుకున్నాయి. ప్రభుత్వం వారికి ఉచిత రేషన్ అందజేస్తోంది. వారి వ్యవసాయ భూముల్లోసామజిక దూరం పాటిస్తూపని చేసుకోడానికి స్థానిక సంస్థలు కొన్ని నిబంధనలతో అనుమతినిచ్చాయి. పండించిన వ్యవసాయ ఉత్పత్తులు సేకరించి రాష్ట్ర రాజధానిలో అమ్ముకోడానికి తగిన ఏర్పాట్లు చేశారు. 

 

 

*****



(Release ID: 1620793) Visitor Counter : 203