రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
డ్రైవర్లు, రవాణాదారులు ఎదుర్కొనే సరుకు రవాణా, ఖాళీ ట్రక్కుల ఫిర్యాదులు / సమస్యల పరిష్కారానికి అందుబాటులోకి ఎంహెచ్ఏ కంట్రోల్ రూమ్
- ఎంహెచ్ఏ కంట్రోల్ రూమ్‌లో సేవలకు ఎంఓఆర్‌టీహెచ్ అధికారుల నియామకం
- ఎంహెచ్ఏ హెల్ప్‌లైన్ నంబర్ 1930,ఎన్‌హెచ్ఏఐ హెల్ప్‌లైన్ నంబర్ 1033కు డయల్ చేసి
తగిన సహాయం కోరవచ్చు
प्रविष्टि तिथि:
03 MAY 2020 4:37PM by PIB Hyderabad
లాక్‌డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా అంతర్రాష్ట్ర రవాణా కోసం ఖాళీ ట్రక్కులతో సహా సరుకుల రవాణా కార్యకలాపాల్లో పాలుపంచుకుంటున్న డ్రైవర్లు / రవాణాదారుల యొక్క ఫిర్యాదులు / సమస్యలను వేగంగా పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) కంట్రోల్ రూమ్‌ను వినియోగించాలని సర్కారు నిర్ణయించింది. రహదారి రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖకు (ఎంఓఆర్‌టీహెచ్) చెందిన అధికారులను ఇందుకోసం నియమించింది. వీరు ఎంహెచ్ఏ కంట్రోల్ రూములో ఉంటూ వచ్చే ఫిర్యాదులు, సమస్యలకు తగిన పరిష్కారం సహాయం అందించనున్నారు. లాక్‌డౌన్‌లో రవాణాకు సంబంధించి ఏదైనా ఫిర్యాదు చేయడానికి డ్రైవర్లు / రవాణాదారుల ఎంహెచ్ఏ కంట్రోల్ రూము నంబరు 1930 అందుబాటులో ఉంచారు. దీనికి అదనంగా జాతీయ రహదారి సంబంధిత సమస్యలు, ఫిర్యాదుల నిమిత్తం ఎన్‌హెచ్ఏఐ హెల్ప్‌లైన్ నంబర్ 1033 కూడా అందుబాటులో ఉంటుంది.
రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సమన్వయంతో చర్యలు..
ట్రక్కు డ్రైవర్లు / రవాణాదారులకు కావాల్సిన సమాచారం అందించేందుకు గాను ఎంఓఆర్‌టీహెచ్, ఎన్‌హెచ్ఏఐ, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన రవాణా విభాగాలు / రవాణా సంఘాలు అవసరమైన చర్యలు తీసుకుంటాయి. ఎంహెచ్ఏ కంట్రోల్ రూములో ఎంఓఆర్‌టీహచ్ నుండి నియమించబడిన అధికారులు రవాణా రంగం / డ్రైవర్లకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారానికి తగిన సహాయం చేస్తారు. ఇటువంటి ఫిర్యాదులపై ఎంఓఆర్‌టీహెచ్ అధికారులు రోజువారీ నివేదికను కూడా సంకలనం చేయనున్నారు. లాక్‌డౌన్ సమయంలో కేంద్రం హోం శాఖ ఆదేశాలు, మార్గదర్శకాల మేరకు రవాణా కార్యకలాపాలు నిర్వహించబడుతున్నయని చెప్పవచ్చు. ఖాళీ ట్రక్కులతో పాటుగా డ్రైవర్లు / క్లీనర్లు వారి నివాసం నుండి ట్రక్ పార్కింగ్ స్థలం దగ్గరకు వెళ్లేందుకు, రవాణా కార్యకలాపాల నిమిత్తం ప్రయాణించేటప్పుడు డ్రైవర్లు మరియు రవాణాదారుల ఫిర్యాదుల పరిష్కారానికి ఈ చర్య తోడ్పడనుంది. భారతదేశంలో కోవిడ్-19 మహమ్మారిని అరికట్టడానికి ప్రకటించిన లాక్‌డౌన్ వేళ రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలలో వస్తు రవాణా కదలికలో ఉన్న అడ్డంకులు వివిధ సమస్యలను ఈ సరికొత్త విధానం బాగా పరిష్కరిస్తుందని భావిస్తున్నారు.
(रिलीज़ आईडी: 1620699)
आगंतुक पटल : 372
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Punjabi
,
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Assamese
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam