రైల్వే మంత్రిత్వ శాఖ
రాష్ట్రప్రభుత్వాలు తీసుకువచ్చిన ప్రయాణికులనే రైల్వేలు అనుమతిస్తున్నాయి.
.ఏ ఇతర తరహా ప్రయాణికలుల లేదా వ్యక్తులు రైల్వే స్టేషన్‌కు రానవసరం లేదు.
రాష్ట్రప్రభుత్వాల విజ్క్షప్తిమేరకు కొన్ని ప్రత్యేక రైళ్ళు నడపడం జరుగుతోంది.
అన్ని ఇతర ప్రయాణీకుల, సబర్బన్ రైళ్లు రద్దు.
ఏ స్టేషన్లోనూ టిక్కెట్లు విక్యయించడం లేదు
రాష్ట్రప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు నడిచేవి మినహా మరే ఇతర ప్రయాణికుల రైళ్ళను రైల్వే శాఖ నడపడం లేదు.
Posted On:
02 MAY 2020 10:29PM by PIB Hyderabad
లాక్ డౌన్ కారణంగా దేశంలో వివిధ ప్రాంతాలలో చిక్కుకుపోయిన వలస కార్మికులు, యాత్రికులు, పర్యాటకులు, విద్యార్థుల కోం కొన్ని ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్టు రైల్వే మంత్రిత్వశాఖ తెలిపింది. వీటిని ఆయా రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు నడుపుతున్నట్టు స్పష్టం చేసింది.
మిగిలిన అన్నిరకాల ప్రయాణికుల రైళ్లను రద్దు చేశామని తెలిపింది. ఆయా రాష్ట్రప్రభుత్వాలు తీసుకువస్తున్న, ఇతర ప్రాంతాలలో చిక్కుకుపోయిన ప్రయాణికులను మాత్రమే వారి గమ్యస్థానాలకు చేరుస్తున్నట్టు తెలిపింది. ఇక ఏ ఇతర కేటగిరీలకు చెందిన వారు , వ్యక్తులు ప్రయాణానికి రైల్వే స్టేషన్లకు రావద్దని రైల్వే శాఖ సూచించింది. అలాంటి వారికి ఏస్టేషన్ లోనూ టిక్కెట్లు అమ్మబోరని తెలిపింది.రాష్ట్రప్రభుత్వాల విజ్ఞప్తి మేరకు నడిచేవి మినహా మరే ఇతర ప్రయాణికుల రైళ్ళను నడపడం లేదని రైల్వే శాఖ తెలిపింది. ప్రయాణికుల రైళ్లు, సబర్బన్ రైళ్లను రద్దు చేసినట్టు తెలిపింది. అందువల్ల ఎవరూ రైల్వే స్టేషన్లకు రావద్దని సూచించింది. ఈ విషయంలో ఎవరూ పుకార్లు వ్యాపింప చేయరాదని సూచించింది.
(Release ID: 1620588)
Visitor Counter : 227