శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 పరీక్షకు రెండు రకాల కొత్త పరికరాలు తయారుచేసిన శ్రీచైత్ర
Posted On:
02 MAY 2020 6:39PM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వంలోని శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖకు చెందిన స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ శ్రీ చైత్ర ట్రైయునల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీలోని సాంకేతిక నిపుణులు కోవిడ్-19 పరీక్షలో ముక్కు, నోటి ద్వారా ఉపయోగించే రెండు రకాల స్వాబ్ లు, వైరల్ ట్రాన్స్ పోర్ట్ పరికరాలు తయారుచేశారు.
చైత్ర ఎంబెడ్ ఫ్లాక్డ్ నైలాన్ స్వాబ్ (మల్లెలిల్ ఇండస్ర్టీస్ తో కలిసి అభివృద్ధి), పోలిమెరిక్ ఫోమ్ టిప్ అమర్చిన చైత్ర ఎన్ మెష్ పేరిట తేలిగ్గా లోపలికి వెళ్లే గుణం ఉన్న ప్లాస్టిక్ హ్యాండిల్ తో కూడిన రెండు స్వాబ్ లను ఆ సంస్థలోని టెక్నాలజీస్టులు డాక్టర్ లిండా వి థామస్, డాక్టర్ షైనీ వేలాయుధన్, డాక్టర్ మాయా నందకుమార్ తయారుచేశారు. ఆ రెండు స్వాబ్ లు రోగి నుంచి నమూనా సేకరణలోను, సాల్వెంట్ తో కడిగి శుద్ధి చేసి మరో నమూనాలోని మెటీరియల్ ను వేరు చేసి లిక్విడ్ వైరల్ సాధనంలోకి సత్వరం పంపించడంలోను సమర్థవంతంగా పని చేస్తున్నట్టు తేలింది. ఈ స్వాబ్, మీడియం ఉపయోగించడం ద్వారా వైరల్ ఆర్ఎన్ఏ మంచి పరిమాణంలోనే సేకరించడం సాధ్యమయింది. పూర్తి శుభ్రతతో కూడిన రెడీ టు యూజ్ డివైస్ లుగా ఈ స్వాబ్ లను సిద్ధంగా ఉంచవచ్చునని అంటున్నారు.
ఇవి రోగుల నమూనాల సేకరణలో సమర్థవంతంగాను, సౌకర్యవంతంగాను ఉంటాయి. నమూనా సేకరణ విషయంలో రోగులకు అసౌకర్యం అతి తక్కువగా ఉంటుంది. దానికి అమర్చిన బ్రేక్ పాయింట్ కారణంగా నమూనా సేకరించే ఆరోగ్య కార్యకర్త దాన్ని తాకే ఆస్కారం లేకుండానే ప్యాక్ లోకి పంపడం సాధ్యమవుతుంది.
చైత్ర వైరల్ ట్రాన్స్ పోర్ట్ మీడియం పేరిట తయారుచేసిన రెండో పరికరం వైరస్ ను సేకరణ ప్రదేశం నుంచి ప్రయోగశాలకు పంపించే సమయంలో మౌలిక స్వభావం కోల్పోకుండా సజీవంగా ఉంటుంది. ప్రస్తుతం 50 (3ఎంఎల్/ వైరల్) వైరల్ ట్రాన్స్ పోర్ట్ మీడియంతో కూడిన 50 స్వాబ్ ల కిట్ ధర రూ.12 వేలకి అందుబాటులో ఉంటాయి.
వీటిని తక్షణం తయారుచేసి అమ్మకానికి సిద్ధంగా ఉంచేందుకు వీలుగా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని మల్లెలిల్ ఇండస్ర్టీస్, ఆరిజిన్ డయాగ్నస్టిక్స్, లెవ్రం లైఫ్ సైన్సెస్ కు బదిలీ చేశారు.
కోవిడ్-19 ధ్రువీకరణకు ఎంతో కీలకమైనవిగా గుర్తించిన వైరల్ జన్యు యాంప్లికేషన్ విధానంతో రోగి నోరు, ముక్కు నుంచి నమూనాలు సేకరించేందుకు ప్రత్యేకంగా డిజైన్ చేసిన స్వాబ్ లనే ఉపయోగిస్తున్నారు. రోగి నుంచి సేకరించిన ఎంతో విలువైన ఈ నమూనాను ఒక ప్రత్యేక ద్రవంలోకి పంపించి నాణ్యత, పరిమాణం రెండూ తగ్గకుండానే పరీక్ష కోసం ప్రయోగశాలకు తరలించడం ఎంతో అవసరం. అప్పుడే పరీక్ష విజయవంతంగా జరిగి రోగనిర్ధారణ జరిగే ఆస్కారం ఉంటుంది. అందుబాటులో ఉన్నట్టయితే ప్లాస్టిక్ షాఫ్ట్ లున్న సింథటిక్ ఫైబర్ స్వాబ్ లు రోగ నిర్ధారణలో ఉపయోగించాలని అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సిడిసి) సిఫారసు చేసింది.
వాటి తయారీలో ఉపయోగించే మెటీరియల్ దిగుమతి చేసుకోవలసివస్తోంది. స్థానికంగా అందుబాటులో ఉన్న మెటీరియల్ తోనే తయారుచేసిన ఈ రెండు స్వాబ్ లు తక్కువ ధరలోనే దేశంలో స్వాబ్ ల భారీ డిమాండును తీర్చగల సంఖ్యలో అందుబాటులో ఉంచవచ్చు. దీని వల్ల మెటీరియల్ దిగుమతి భారం సైతం తగ్గుతుంది.
(మరిన్ని వివరాలకు ఎస్ సిటిఐఎంఎస్ టి పిఆర్ వో శ్రీమతి స్వప్న వామదేవన్ ను సంప్రదించవచ్చు. మొబైల్ నంబర్ : 9656815943; ఇ మెయిల్ : ) Email: pro@sctimst.ac.in)
(Release ID: 1620549)
Visitor Counter : 175