సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

‘ఏ రే ఆఫ్ జీనియస్‘ లఘు చిత్రం ఆవిష్కరించి, సత్యజిత్ రే శతాబ్ధి ఉత్సవాలను ప్రారంభించిన డెవలప్ మెంట్ ఆఫ్ మ్యూజియంస్ అండ్ కల్చరల్ స్పేసెస్ (డి.ఎం.సి.ఎస్)

Posted On: 02 MAY 2020 8:19PM by PIB Hyderabad

ప్రముఖ దర్శకులు, భారతీయ సినిమాకు దశను, దిశను చూపించిన సత్యజిత్ రే శతాబ్ధి ఉత్సవాలను సాంస్కృతి మంత్రిత్వ శాఖ పరిధిలోని డెవలప్ మెంట్ ఆఫ్ మ్యూజియంస్ అండ్ కల్చరల్ స్పేసెస్ (డి.ఎం.సి.ఎస్) ప్రారంభించింది. ఈ ఉత్సవాల ప్రారంభానికి గుర్తుగా ‘ఎ రే ఆఫ్ జీనియస్’ అనే లఘ చిత్రాన్ని డిజిటలర్ మాథ్యమం ద్వారా ప్రారంభించింది.

ఈ చిత్రాన్ని ఆన్ లైన్ లో విడుదల చేసిన సందర్భంలో డి.ఎం.సి.ఎశ్. సి.ఈ.ఓ. శ్రీ రాఘవేంద్ర సింగ్ మాట్లాడుతూ, శ్రీ సత్యజిత్ రే చిత్ర నిర్మాణ కౌశలంతో పాటు సాహిత్య, కళ, సంగీతం, మరియు రూపకల్పనలో కోల్ కత్తా మరియు ముంబైకి చెందిన నిపుణులు సాధించిన అద్భుత విజయాలను ఈ లఘచిత్రం కళ్ళకు కడుతుందని తెలిపారు. పలు అవార్డులను గెలుచుకున్న దర్శకుడు శ్రీ అనిరుథ్ రాయ్ చౌదరి, ఎడిటర్ ఆర్ఘ్య కమల్ మిత్ర కలిసి సందీప్ రే మరియు సొసైలీ ఫర్ ది ప్రిజర్వేషన్ ఆఫ్ సత్యజిత్ రే అర్కైవ్స్ సహాయంతో ఈ లఘు చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రంలో మూడు దశాబ్ధాలుగా ప్రముఖ చరిత్రకారుడు నేమై ఘోష్ సేకరించిన అద్భుతమైన చిత్రాలు ఓ గొప్ప చిత్ర నిర్మాణ దీప్తి వైభవాన్ని కళ్ళకు కడతాయి. దీనికి ఢిల్లీ ఆర్ట్ గ్యాలరీ సహాయం అందించింది.

పథేర్ పాంచాలి, చారులత, తీన్ కన్యా, సోనార్ కెల్లా, అపు ట్రైయాలజీ చిత్రాల ద్వారా సత్యజిత్ రే ప్రజల జ్ఞాపకాల్లో జీవించే ఉంటారన్న శ్రీ రాఘవేంద్ర సింగ్, పథేర్ పాంచాలి (సాంగ్ ఆఫ్ ది రోడ్ )తో, భారతీయ సినిమా ప్రపంచ వేదిక మీద ప్రారంభమైందని తెలిపారు. ఉన్నతమై చిత్రాలను అందించిన దర్శకుడు, రచయిత మరియు ఇల్లస్ట్రేటర్ అయిన బహుముఘ ప్రజ్ఞాశాలి సత్యజిత్ రే కు నివాళిగా సాంస్కృతి మంత్రిత్వ శాఖ పరిధిలోని డెవలప్ మెంట్ ఆఫ్ మ్యూజియంస్ అండ్ కల్చరల్ స్పేసెస్ (డి.ఎం.సి.ఎస్) ఏ రే ఆఫ్ జీనియస్ లఘు చిత్రాన్ని రూపొందించడం, ఈ లఘచిత్రం ద్వారా మే 2న సత్యజిత్ రే శతాబ్ధి ఉత్సవాలను ప్రారంభించడం ఆనందంగా ఉందని తెలిపారు.

ఈ సందర్భంగా, అధికారిక ఫేస్ బుక్ పేజ్ మరియు డి.ఎం.సి.ఎస్. వారి యూ ట్యూబ్ ఛానల్ కూడా ప్రారంభించబడ్డాయి. ఇది  సత్యజిత్ రే శతాబ్ధి ఉత్సవాల సందర్భంగా ఇతర కార్యక్రామాలను కూడా తెలియజేస్తుంది. వీటిని చూడడానికి, లైక్ చేయడానికి, అనుసరించడానికి ఈ క్రింద్ లింక్ ద్వారా లాగిన్ అవ్వ వచ్చు.

 

ఫేస్ బుక్ పేజీ:

https://www.facebook.com/A-Ray-of-Genius-Satyajit-Ray-Centenary-Celebrations-110004454032751/

 

యూట్యూబ్ ఛానల్: https://www.youtube.com/channel/UC3fwhFWVAjAXV5-T7q76Aaw/?guided_help_flow=5

 

ట్విట్టర్ హ్యాండిల్:

https://twitter.com/a_dmcs

 

భారత ప్రభుత్వ సాంస్కృతి మంత్రిత్వ శాఖ పరిధిలోని డెవలప్ మెంట్ ఆఫ్ మ్యూజియంస్ అండ్ కల్చరల్ స్పేసెస్ (డి.ఎం.సి.ఎస్) భారతదేశంలోని వస్తు ప్రదర్శన శాలలు మరియు సాంస్కృతిక ప్రదేశాలపై దృష్టి సారించింది. వీటిని సంరక్షించడంతో పాటు ఆధునీకరించడం, క్యూరేట్ చేయడం లాంటి కార్యక్రమాలను పర్యవేక్షిస్తోంది. 

 

--



(Release ID: 1620547) Visitor Counter : 190