పర్యటక మంత్రిత్వ శాఖ
“దేఖో అప్నా దేశ్” సీరీస్ కింద పర్యాటక మంత్రిత్వ శాఖ 13వ వెబినార్ “డెస్టినేషన్- సరిస్కా టైగర్ రిజర్వ్” ఆవిష్కారం
Posted On:
02 MAY 2020 3:12PM by PIB Hyderabad
వన్యమృగ పార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు సందర్శకులకు సరికొత్త అనుభూతి పొందే అరుదైన అవకాశం కలిగిస్తాయి. కేంద్ర పర్యాటక శాఖ పర్యాటకులకు వన్యప్రాణుల వర్చువల్ సాహస యాత్ర, సఫారి అనుభూతి కలిగించేందుకు దేఖో అప్నా దేశ్ వెబినార్ కింద 2020 మే 1వ తేదీన రాజస్తాన్, అల్వార్ జిల్లాలోని వన్యప్రాణి కేంద్రంపై “డెస్టినేషన్ - సరిస్కా టైగర్ రిజర్వ్” శీర్షికతో ఒక వెబినార్ విడుదల చేసింది.
తెహ్లాలోఇ సరిస్కా మనార్ వ్యవస్థాపకుడు శ్రీ గజేంద్రసింగ్, ఇమ్మెన్స్ మార్కెటింగ్ సిఇఒ శ్రీ ధీరజ్ త్రివేది ఈ వెబినార్ ను సమర్పించారు.
ఢిల్లీకి వాయవ్యంగా 250 కిలోమీటర్లు, జైపూర్ కు ఈశాన్యంగా 110 కిలోమీటర్ల దూరంలో ఈ సరిస్కా టైగర్ రిజర్వ్ ఉంది. అల్వార్ మహారాజా గతంలో వేటకు వెళ్లిన సరిస్కా లోయలోని ఈ ప్రదేశం పలు రకాలైన జంతుజాలం, వృక్షజాలానికి నెలవు. ఈ పార్క్ లో పులులు, చిరుతలు, నీల్గాయ్, సంబార్, చితాల్ అనే వన్యప్రాణులు ఎన్నో ఉన్నాయి. భారతీయ కుక్కుట సంతతికి చెందిన ఒక వన్యకుక్కుటం పీఫౌల్, ఒక ప్రత్యేక రాబందు సంతతికి చెందిన సర్పెంట్ ఈగిల్స్, శాండ్ గ్రూజ్, బంగారు రంగు వడ్రంగి పిట్ట, కొమ్ములు గల భారతీయ గుడ్లగూబలు, రాబందులకు నెలవైన ఆ ప్రాంతం పక్షి ప్రేమికులకు స్వర్గధామం వంటిది.
10, 11 శతాబ్దాలకు చెందిన ప్రాచీన శిథిల దేవాలయాలు ఈ సంరక్షణాలయంలో ఉన్నాయి. అలాంటి అరుదైన కట్టడాల్లో కంక్వారి ఫోర్ట్, 10వ శతాబ్దికి చెందిన నీలకంఠ దేవాలయం ఉన్నాయి. ఇవి శిథిల దేవాలయాలే అయినా ఎంతో చక్కని చిత్రకళ, ఖజురహో తరహా శిల్పాలు సందర్శకులకు చక్కని అనుభూతిని అందిస్తాయి. నీలకంఠ మహాదేవ దేవాలయం పరిసరాల్లో 8, 12వ శతాబ్దిలో నిర్మించిన 300 పైగా హిందూ, జైన దేవాలయాలు కూడా ఉన్నాయి. అభానేరిలోని 3500 నిట్టనిలువు మెట్లున్న నికుంభ రాజవంశానికి చెందిన అరుదైన ప్రాంతం ప్రపంచంలోనే పెద్ద మెట్ల ప్రాంతంగా పేరొందింది. అల్వార్ నగరం సైతం ఎన్నో చారిత్రక భవనాలు, కోటలు, సమాధులు, భవనాలు ఎంతో ప్రముఖమైనవి. వీటిలో బాలా కిల్లా, విజయ్ మందిర్ లేక్ ప్యాలెస్, ఫతే జంగ్ కి గుంబద్, మోతీ డూంగ్రి సందర్శకులు మిస్ కాకూడని ప్రదేశాలు.
పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖకు చెందిన కేంద్ర స్పాన్సర్ షిప్ లోని పథకం ప్రాజెక్ట్ టైగర్. పులుల రిజర్వ్ గా పేరొందిన పులుల సంరక్షణాలయాలకు ఇది ఎంతో పేరొందినది. భారత్ లో ప్రస్తుతం 2967 పులుల సంతతి ఉంది. 2018లో విడుదలైన నివేదిక ప్రకారం పులుల వాటాలో సగానికి పైగా మధ్యప్రదేశ్, కర్ణాటకల్లో ఉన్నాయి. ఈ పులుల జనాభా 2014 సంవత్సరంలో తీసిన గణాంకాల ప్రకారం 30 శాతం పెరిగి 2226కి పెరిగింది. సరిస్కా తొలి టైగర్ రిజర్వ్ భారతదేశంలో రాయల్ బెంగాలీ టైగర్ పేరిట అరుదైన పులుల జాతిని విజయవంతంగా సంరక్షించింది. ఈ జాతికి చెందిన 20 వరకు పులులు ఇందులో ఉన్నాయి.
ఇంతవరకు ప్రజలకు పెద్దగా తెలియని గమ్యాలు, ప్రముఖ పర్యాటక ప్రాంతాలపై పర్యాటకుల్లో చైతన్యం కల్పించడం పర్యాటక మంత్రిత్వ శాఖకు చెందిన ఈ వెబినార్ లక్ష్యం. ఈ వెబినార్ మిస్ అయిన వారి కోసం యూట్యూబ్ చానల్
https://www.youtube.com/channel/UCbzIbBmMvtvH7d6Zo_ZEHDA/ లోను, పర్యాటక మంత్రిత్వ శాఖకు చెందిన సోషల్ మీడియా హ్యాండిల్స్ లోను ఇది అందుబాటులో ఉంది.
(Release ID: 1620430)
Visitor Counter : 297