సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

గ్రీన్, ఆరంజ్ మరియు రెడ్ జోన్లలో కేసుల విచారణకు సి.ఏ.టి. కొత్త మార్గదర్శకాలు

Posted On: 02 MAY 2020 1:25PM by PIB Hyderabad

న్యూఢిల్లీ లోని సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యూనల్ యొక్క గౌరవనీయులైన చైర్మన్ ఆదేశాలకు అనుగుణంగా దిగువ పేర్కొన్న నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది

భారత ప్రభుత్వం, హోంమంత్రిత్వశాఖ 2020 మార్చి, 24వ తేదీన ప్రకటించిన లాక్ డౌన్, ఆతర్వాత 2020 ఏప్రిల్ 14వ తేదీ నుండి 2020 మే నెల 3వ తేదీ దాకా కొనసాగుతున్న నేపథ్యంలో సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ప్రధాన ధర్మాసనం మరియు దేశవ్యాప్తంగా ఉన్న దాని ఇతర శాఖలు తమ కార్యకలాపాలను నిలిపివేశాయి.  కోవిడ్-19 కేసుల తీవ్రతను బట్టి. రెడ్ (హాట్ స్పాట్), గ్రీన్ మరియు ఆరంజ్ జోన్లను గుర్తించడానికి, ఎమ్.హెచ్.ఏ. 2020 మే నెల 1వ తేదీన జారీ చేసిన ఆదేశాల్లో మార్గదర్శకాలను పొందుపరిచింది. అలా ప్రకటించిన జోన్లలో నిషేధించిన, అనుమతించిన కార్యకలాపాల వివరాలను ప్రకటించింది. ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ పనితీరుకు సంబంధించి దిగువ పేర్కొన్న సూచనలను జారీ చేసింది: 

గ్రీన్ జోన్లలో నెలకొన్న ధర్మాసనాలు / న్యాయస్థానాలు సామాజిక దూరం పాటించడం, పారిశుధ్య ఏర్పాట్లు చేయడం, నేరుగా ఒకరితో ఒకరిని కలవడాన్ని నివారించడం వంటి ఎమ్.హెచ్.ఏ. జారీచేసిన మార్గదర్శకాలను అనుసరించాలి.  సాధ్యమైనంత వరకు సంబంధిత ప్రాంతంలో ఉన్న హై కోర్టుల పనితీరు విధానాన్ని అనుసరించాలిబార్ అసోసియేషన్ అధ్యక్షునితో సంప్రదించి సంబంధిత ధర్మాసనం శాఖాధిపతి (హెచ్.ఓ.డి.) ఈ విషయాల్లో తగిన నిర్ణయాలు తీసుకోవాలి.  ఉద్యోగుల సౌలభ్యం, వారి పనితీరు వంటి విషయాలపై ధర్మాసనం రిజిస్ట్రార్ నుండి అభిప్రాయాలు తీసుకోవాలిఈ విషయాల్లో తీసుకున్న నిర్ణయాలను ఎప్పటికపుడు ప్రధాన ధర్మాసనం రిజిస్ట్రీ కి తెలియజేయాలి. 

రెడ్ జోన్ (లాక్ డౌన్ ప్రాంతం) మరియు ఆరంజ్ జోన్లలో ఉన్న ధర్మాసనాల విషయంలో, అత్యవసరం అనుకున్న కేసులను సంబంధిత ధర్మాసనం రిజిస్ట్రార్ ను సంపాదించి ఎలక్ట్రానిక్ మెయిల్ సర్వీస్ (ఈ-మెయిల్) ద్వారా దాఖలు చేయవచ్చు. అప్పుడు ఆయన ఈ-మెయిల్ ఐ.డి. ని ఉద్దేశించిన  న్యాయవాది లేదా పార్టీకి తెలియజేస్తారు. ఆ ఓ.ఏ. అన్ని విధాలా సక్రమంగా ఉన్నదనీ, వెంటనే విచారణ చేపట్టవలసిన అవసరం ఉన్నదనీ రిజిస్ట్రీ  తృప్తిపడితే, ఆ విషయాన్ని ధర్మాసనం శాఖాధిపతికి తెలియజేయడం జరుగుతుంది. అప్పుడు ఆ కేసును చేపట్టాలా వద్దా అనే విషయాన్ని హెచ్.ఓ.డి. నిర్ణయం తీసుకుంటారుఆ కేసును విచారించాలని ప్రతిపాదించినట్లైతే, ఆ విచారణను సిస్కో వెబెక్స్ ఆన్ లైన్ వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం ద్వారా చేపడతారు 

ప్రధాన ధర్మాసనానికి చెందిన రిజిస్ట్రీ తో సంప్రదించిన అనంతరం ఆ యా ధర్మాసనాల హెచ్.ఓ.డి.లు వివరాలను రూపొందిస్తారు.  వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనేవారు అప్పరెల్ ధరించాలి లేదా కనీసం మంచి దుస్తులు ధరించి ఉండేలా చూడాలి

పెండింగులో ఉన్న కేసుల విచారణకు ఆ ధర్మాసనాలకు చెందిన బార్ అసోసియేషన్ల న్యాయవాదులు అటువంటి యంత్రాంగం ద్వారా అంగీకరిస్తే, ఆ కేసులను రిజిస్ట్రీ గుర్తించాలిఅప్పుడు ఏ రోజు కా రోజు హెచ్.ఓ.డి. నిర్ణయించిన సమయంలో ఆ విధానం ద్వారా విచారణ చేపట్టడం జరుగుతుంది.  

ఈ ఏర్పాట్లు 2020 మే నెల 17వ తేదీ వరకు లేదా తదుపరి ఆదేశాలు వెలువడే వరకు అమలులో ఉంటాయి

<><><><><> 



(Release ID: 1620379) Visitor Counter : 205