రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ‌ గిరిధర్ అరమ‌నే

Posted On: 01 MAY 2020 8:04PM by PIB Hyderabad

రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ కార్య‌ద‌ర్శిగా శ్రీ గిరిధర్ అరమనే ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. అనంత‌రం మంత్రిత్వ శాఖ పని తీరును సమీక్షించడానికి ఆయన సీనియర్ అధికారులతో సమావేశాలు నిర్వహించారు. ముఖ్యంగా కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి ప్ర‌భావం నేప‌థ్యంలో ఎదుర‌వుతున్న స‌మ‌స్య‌ల‌ను గురించి ఈ స‌మావేశాల్లో చర్చించారు.  భారత ఆర్థిక వ్యవస్థకు రవాణా, రహదారుల రంగం వెన్నెముక వంటిద‌ని అని ఈ సంద‌ర్భంగా శ్రీ అరమనే ఉద్ఘాటించారు. అంత‌కు ముందు శ్రీ అరమనే క్యాబినెట్ సెక్రటేరియట్‌ అదనపు కార్యదర్శిగా కూడా పని చేశారు. 2012-14 మ‌ధ్య కాలంలో ఆయ‌న  పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శిగా కూడా పనిచేశారు. శ్రీ గిరిధర్ అరమనే 1988 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఐఐటీ మద్రాస్ నుండి సివిల్ ఇంజినీరింగ్‌లో ఎంటెక్ చేశారు. ఈయ‌న ఎకనామిక్స్ లో మాస్టర్స్ డిగ్రీ కూడా పొందారు. ఫైనాన్స్ మరియు బ్యాంకింగ్ విషయాలపై ఐఐఎం బెంగళూరు, ఐఐఎఫ్‌టీ న్యూఢిల్లీతో పాటు పూణేలోని టాటా ఎమ్‌జీటి ట్రగ్ సెంటర్‌తో పాటు సింగపూర్ మరియు ఫ్రాన్స్‌లలో శిక్షణ పొందారు. శ్రీ అరమనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో క్షేత్ర, విధాన స్థాయిలతో సహా వివిధ స్థానాల్లో పని చేశారు. సంస్థాగత మరియు ఆర్థిక విషయాలలో విస్తారమైన అనుభవం ఆయ‌న సొంతం.


(Release ID: 1620231) Visitor Counter : 181