వ్యవసాయ మంత్రిత్వ శాఖ

వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కోసం 7 రాష్ట్రాల్లో 200 మండీలను ఈ-నామ్ వ్యవస్థతో అనుసంధానం

ఒకే దేశం ఒకే మార్కెట్ దిశగా రూపుదిద్దుకుంటున్న ఈ-నామ్ ప్లాట్ ఫామ్ - శ్రీ నరేంద్ర సింగ్ తోమర్

Posted On: 01 MAY 2020 5:28PM by PIB Hyderabad

వచ్చే నెల కల్లా వెయ్యి మండీలు ఈ-నామ్ ప్లాట్ ఫారం తో అనుసంధానం అవుతాయని కేంద్ర వ్యవసాయరైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ వెల్లడించారు. రాష్ట్రాల నుండి 200 మండీలు ఈ-నామ్ తో జోడించిన సందర్బంగా ఢిల్లీ కృషి భవన్ లో జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడారు. ఈ సందర్బంగా కర్నూల్హుబ్లీ లో మండీలలో వేరుశెనగమొక్కజొన్న వ్యాపారాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి ప్రత్యక్షంగా వీక్షించారు. సాంకేతికత రైతుల ప్రయోజనార్థం ఏ విధంగా వినియోగించవచ్చో ప్రధాన మంత్రి దార్శనికత త్వరలోనే సాకారం కాబోతోందని శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. 

ఈ-నామ్ తో అనుసంధానమైన 200 మార్కెట్లు: ఆంధ్రప్రదేశ్(11 మండీలు)గుజరాత్ (25 మండీలు)ఒడిశా (16 మండీలు)రాజస్థాన్ (94 మండీలు)తమిళనాడు (27 మండీలు)ఉత్తర ప్రదేశ్ (25 మండీలు) & కర్ణాటక (02 మండీలు). ఇప్పటికే 16 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 585 మండీలు ఈ-నామ్ తో అనుసంధానం అయి ఉన్నాయి.

కర్ణాటక రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ బోర్డు ప్రోత్సాహంతో నడుస్తున్న ఇ-ట్రేడింగ్ ప్లాట్‌ఫామ్ కర్ణాటక రాష్ట్రీయ ఇ-మార్కెట్ సర్వీసెస్ (ఆర్ఈఎంఎస్) యూనిఫైడ్ మార్కెట్ ప్లాట్‌ఫాం (యుఎంపి)తో ఈ-నామ్ కూడా ఈ రోజు నుండి విలీనం చేయబడింది. సింగిల్ సైన్ ఆన్ ఫ్రేమ్‌వర్క్‌ను ఉపయోగించడం ద్వారా రెండు ప్లాట్‌ఫామ్‌లలోనూ అంతరాయం లేని వ్యాపారాన్ని  అమలు చేయడానికి ఇది రెండు ప్లాట్‌ఫారమ్‌లలోని వ్యాపారులకు వీలు కల్పిస్తుంది. ఈ స్థాయి వ్యవసాయ వస్తువుల కోసం రెండు వేర్వేరు ఇ-ట్రేడింగ్ ప్లాట్‌ఫాంలు పరస్పరం పనిచేయడం భారతదేశంలో ఇదే మొదటిసారి.

 

 

1.66 కోట్ల మంది రైతులు, 1.28 లక్షల మంది వ్యాపారులు ఇ-నామ్ ప్లాట్‌ఫామ్‌లో నమోదు చేయడంతో ఇ-నామ్ చాల అభివృద్ధి సాధించింది. 30 ఏప్రిల్ 2020 నాటికిమొత్తం వాణిజ్య పరిమాణం 3.41 కోట్ల మెట్రిక్ టన్నులు, 37 లక్షల (వెదురు & కొబ్బరి) మొత్తం సుమారు రూ. ఈ-నామ్ ప్లాట్‌ఫామ్‌లో రూ.1.0 లక్షల కోట్లు నమోదయ్యాయి. వ్యవసాయ రంగంలో ఇదో పెద్ద విప్లవం. 

దీనితో పాటు కోవిడ్-19 పరిస్థితులను ఎదుర్కోడానికి రైతులు తమ ఉత్పత్తులను మండీలకు తీసుకురానవసరం లేకుండానే విక్రయించుకునే ఈ-నామ్ తగు సూచనలు చేసింది. 

వీడియో కాన్ఫరెన్స్ లో వ్యవసాయరైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ పరుషోత్తన్ రూపాలకార్యదర్శి శ్రీ కైలాష్ చౌదరికార్యదర్శి (ఏసిఎఫ్డబ్ల్యూ) శ్రీ సంజయ్ అగర్వాల్సీనియర్ అధికారులు పాల్గొన్నారు. 

 

*****


(Release ID: 1620224) Visitor Counter : 343