వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
“వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్” జాతీయ పోర్టబిలిటీ ప్లాట్‌ఫామ్ మీదకు మరో ఐదు రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు, 17 కి చేరిన మొత్తం సంఖ్య
60 కోట్ల ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ లబ్ధిదారులు తమ ప్రస్తుత రేషన్ కార్డును ఉపయోగించి ఈ 17 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలలో ఎక్కడైనా రేషన్ తీసుకొనే సౌలభ్యం
Posted On:
01 MAY 2020 4:41PM by PIB Hyderabad
“వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్” జాతీయ పోర్టబిలిటీ ప్లాట్‌ఫామ్ మీదకు మరో ఐదు రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలు, 17 కి చేరిన మొత్తం సంఖ్య
- 60 కోట్ల ఎన్‌ఎఫ్‌ఎస్‌ఏ లబ్ధిదారులు తమ ప్రస్తుత రేషన్ కార్డును ఉపయోగించి ఈ 17 రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాలలో ఎక్కడైనా రేషన్ తీసుకొనే సౌలభ్యం
Posted On: 01 MAY 2020 4:41PM by PIB Delhi
“వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్” ప్రణాళికలో భాగంగా ఏర్పాటు చేస్తున్న జాతీయ క్లస్టర్‌లోకి మరో ఐదు రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా అనుసంధానమయ్యాయి. జాతీయస్థాయి రేషన్ పోర్టబిలిటీ ప్లాట్‌ఫామ్ మీదకు తాజాగా ఉత్తరప్రదేశ్, బీహార్, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, దాద్రా & నగర్ హవేలి మరియు డామన్ & డయ్యులను కూడా సమ్మిళితం చేసేందుకు గాను కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ మంత్రి శ్రీ రామ్‌విలాస్ పాశ్వాన్ తన సమ్మతి తెలిపారు. ఆంధ్రప్రదేశ్, గోవా, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, రాజస్థాన్, తెలంగాణ మరియు త్రిపురతో సహా మొత్తం పన్నెండు రాష్ట్రాలు ఇప్పటికే ఈ జాతీయ క్లస్టర్‌లో భాగంగా ఉన్నాయి. “వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్” కేంద్ర ప్రభుత్వ ప్రణాళికలో భాగంగా రేషన్ కార్డ్ ఉన్న వారితో నేషనల్ పోర్టబిలిటీ అమలు పురోగతిని కేంద్ర మంత్రి శ్రీ రామ్‌విలాస్ పాశ్వాన్ సమీక్షించారు. కొత్తగా ఐదు రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాల్ని నేషనల్ క్లస్టర్‌తో అనుసంధానించేందుకు అవసరమైన సాంకేతిక సంసిద్ధతను సమీక్షించారు. తాజా ఆమోదంతో 17 రాష్ట్రాలు /కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన దాదాపు 60 కోట్ల ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎ లబ్ధిదారులకు ఇతర రాష్ర్టాలలో రేషన్ పొందేందుకు గాను జాతీయ / అంతర్-రాష్ట్ర పోర్టబిలిటీ సౌకర్యం లభించనుంది. ఎన్‌ఎఫ్‌ఎస్ఏ లబ్ధిదారులు 17 రాష్ట్రాలు / కేంద్ర పాలిత ప్రాంతాలలోని తమకు నచ్చిన ఏదైనా చౌక ధరల దుకాణం (ఎఫ్‌పీఎస్) నుండి తమకు రావాల్సిన ఆహార ధాన్యాల రేషన్ కోటాను పొందవచ్చు.
సంబంధిత మార్గదర్శకాలు జారీ..
జాతీయ పోర్టబిలిటీ అమలుకు అవసరమైన మార్గదర్శకాలు / సూచనల్ని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ శాఖ ఇప్పటికే ఈ ఐదు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన అధికారులతో పంచుకుంది. దీనికి తోడు సాంకేతిక బృందాలకు, అధికారులు అవసరమైన ఓరియంటేషన్ శిక్షణ కూడా అందజేశారు. జాతీయ రేషన్ వేదికపైకి కొత్తగా వచ్చిన ఐదు కొత్త రాష్ట్రాలలో అంతర్రాష్ర్ట లావాదేవీలకు అవసరమై వెబ్-సేవలు మరియు కేంద్రీకృతమైన డాష్ బోర్డుల ద్వారా వాటి పర్యవేక్షణ జరిగేందుకు వీలుగా అధికారికంగా “వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్” సేవలను ప్రారంభించాలని కేంద్రం సూచించింది. దేశ వ్యాప్తంగా మొత్తం 17 రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలన్నీ ఒకే క్లస్టర్‌గా చేస్తూ ఎలాంటి అంతరయం లేకుండా అంతర్-రాష్ట్ర రేషన్ / జాతీయ పోర్టబిలిటీ కార్యకలాపాలను ఈ రోజు నుంచి అధికారికంగా ప్రారంభించాలని కోరడమైంది. అలా చేయడం ఇప్పటికిప్పుడు వీలు కాని పక్షంలో క్షేత్రస్థాయి సంసిద్ధత బట్టి ఈ సేవలను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని కోరింది. సంబంధిత రాష్ట్ర / కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాల సంసిద్ధత ప్రకారం “వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్” ప్లాన్ కింద జాతీయ పోర్టబిలిటీని విస్తరించేలా నిరంతరం ప్రయత్నాలు జరుగుతున్నాయని కేంద్రం తెలిపింది.
(Release ID: 1620151)
Visitor Counter : 300