బొగ్గు మంత్రిత్వ శాఖ
తొలిసారి బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించిన ఎన్‌ఎల్‌సీఐఎల్ ఒడిశాలోని తలబిరా-II, III గనుల నుంచి ఉత్పత్తి ప్రారంభం అభినందనలు తెలిపిన యావత్ బొగ్గు పరిశ్రమ
Posted On:
30 APR 2020 6:05PM by PIB Hyderabad
కేంద్ర బొగ్గు శాఖకు చెందిన నవరత్న సంస్థ అయిన నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (NLCIL), తొలిసారి బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించింది. ఒడిశాలోని తలబిరా-II, III గనుల నుంచి ఉత్పత్తి ప్రారంభించింది. ఈ గనులను ఏడాదికి 20 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో NLCILకు 2016లో అప్పగించారు. ఆ సంస్థలో ప్రస్తుతమున్న, భవిష్యత్తులో ప్రారంభించనున్న బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ల అవసరాలు తీర్చాలన్నది లక్ష్యం.
NLC ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రాకేష్ కుమార్ మాట్లాడుతూ, "కొవిడ్ విజృంభిస్తున్న క్లిష్ట సమయంలో సాధించిన ఈ విజయం సంస్థ అభివృద్ధికి సాయపడడమేగాక, దేశానికి విద్యుత్ భరోసా అందిచడంలోనూ మా సిబ్బంది భాగస్వాములయ్యారు. బొగ్గు దిగుమతులను నిరుత్సాహపరచడం అత్యంత ప్రధాన ప్రాముఖ్యతగా ఉన్న ఈ తరుణంలో ఇది గొప్ప విజయం." అన్నారు.
NLC బృందం వినూత్నంగా వృద్ధి చేసి, విజయవంతంగా అమలు చేసిన ఎండీఓ నమూనా ద్వారా ఈ బొగ్గు బ్లాక్‌ను అభివృద్ధి చేశారు. ఇది యావత్ పరిశ్రమ ప్రశంసలు పొందింది. ఈ గని తక్కువగా 1.09 స్ట్రిప్పింగ్ నిష్పత్తిని కలిగివుంది. బొగ్గు G 12 గ్రేడ్‌లో ఉంది. భవిష్యత్తులో పోటీ విద్యుత్‌ను ఉత్పత్తి చేయడానికి సంస్థకు ఇది ఉపకరిస్తుంది.
ఈమధ్య కాలంలో, తనకు చెందిన రెండు లిగ్నైట్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లలో ఒకదానిని NLC ఇండియా లిమిటెడ్ విజయవంతంగా ప్రారంభించింది. ఒక్కోదాని సామర్థ్యం 500 మెగావాట్లు. ఈ తరహా వాటిలో దేశంలోనే అది మొదటి ప్లాంటు. 2019-2020 కాలంలో, NLCIL 1353 మెగావాట్ల సౌర మరియు 51 మెగావాట్ల పవన విద్యుత్‌ను ఉత్పత్తి చేసింది. మొత్తంగా 1404 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సామర్థ్యాన్ని ఆ సంస్థ సాధించింది.

(Release ID: 1619745)
Visitor Counter : 267