వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
కొవిడ్-19 తర్వాత ప్రపంచ సరఫరా గొలుసులో స్పష్టమైన మార్పులు: శ్రీ గోయల్ ప్రపంచ వాణిజ్యంలో ముఖ్య వాటా కైవసానికి ప్రయత్నిద్దాం: శ్రీ గోయల్ పారిశ్రామికవేత్తలు, ఎగుమతిదారులకు ప్రభుత్వ మద్దతు ఉంటుందని భరోసా
Posted On:
29 APR 2020 6:12PM by PIB Hyderabad
వాణిజ్యం, పరిశ్రమలు మరియు రైల్వే మంత్రి శ్రీ పీయూష్ గోయల్ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. దేశంలోని ఎక్స్‌పోర్టు ప్రమోషన్ కౌన్సిళ్లతో (EPCs) చర్చించారు. నిర్దిష్ట రంగాల్లో బలాలు, సామర్థ్యాలు మరియు పోటీ ప్రయోజనాలను గుర్తించాలని ఆయన ఎగుమతిదారులకు పిలుపునిచ్చారు. ప్రపంచ మార్కెట్లలో వాటిని వినియోగించడంపై దృష్టి పెట్టాలన్నారు. కొవిడ్-19 తర్వాత ప్రపంచ సరఫరా గొలుసులో స్పష్టమైన మార్పులు కనిపిస్తాయని, ప్రపంచ వర్తకంలో గణనీయమైన వాటా స్వాధీనానికి భారతీయ పారిశ్రమికవేత్తలు, ఎగుమతిదారులు ప్రయత్నించాలని సూచించారు. ప్రభుత్వం వారి ప్రయత్నాలకు మద్దతుగా ఉంటుందని భరోసా ఇచ్చారు. విదేశాల్లో ఉన్న భారతీయ కేంద్రాలు అందులో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయన్నారు. పారిశ్రామికవేత్తలు, ఎగుమతిదారులకు ప్రోత్సాహకాలు ఇస్తామని, అయితే అవి న్యాయబద్ధంగా, సహేతుకంగా, WTO సూచనలకు అనుగుణంగా ఉంటాయని మంత్రి చెప్పారు.
ఎగుమతులకు ఇదే మంచి తరుణం: శ్రీ గోయల్
అతి తక్కువ సమయంలో ఎగుమతులు చేయగలిగే నిర్ధిష్ట రంగాలను గుర్తించేపనిలో ఉన్నామని శ్రీ గోయల్ వెల్లడించారు. ఈ రబీ సీజన్‌లో అత్యధిక పంట ఉత్పత్తులు రాబోతున్నాయని, దేశంలోని నిల్వ సామర్థ్యానికి మించి ఉత్పత్తులు వస్తాయని అన్నారు. ఇదే సమయంలో చాలా దేశాల్లో ఆహార కొరత ఉన్నట్లు వార్తలు వస్తున్నాయన్నారు. కొవిడ్-19 సంక్షోభం కారణంగా ప్రపంచ సరఫరా గొలుసులో అవాంతరాలు ఏర్పడి చాలా ప్రాంతాల్లో సరిపడినంత ఆహారం లేదని, ఉన్నదానిలోనూ సరైన నాణ్యత, రుచి లేదని చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తులు, ప్రాసెస్ చేసిన ఆహారాన్ని ఎగుమతి చేయడానికి ఇది మంచి అవకాశమని శ్రీ గోయల్ వివరించారు. ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిళ్లు తమ సభ్యులతో చర్చించాలని, వెంటనే కార్యాచరణ చేపట్టగల అంశాలు, మంచి ఆలోచనలతో ముందుకు రావాలని మంత్రి సూచించారు.
లాక్‌డౌన్ సమయంలో ప్రభుత్వం ఇచ్చిన మద్దతుకు, నిర్దిష్ట సమయ పరిష్కారాలకు EPC ఆఫీసు బేరర్లు మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. వారి పనితీరును మరింత మెరుగుపరుచుకునే అనేక సూచనలు చేశారు. ఎఫ్‌ఐఈవో, ఏఈపీసీ, ఎస్‌ఆర్‌టీఈపీసీ, సీఎల్‌ఈ, ఎస్‌ఈపీసీ, కెమెక్సిల్, జీజేఈపీసీ, సీఈపీసీ, షెఫెక్సిల్, సీఈపీసీఐ, పీఈపీసీఐ, ఫార్మెక్సిల్, ఈసీఎస్‌ఈపీసీ, ఈఈపీసీ, ఈటీపీసీ, కాపెక్సిల్ సహా ఇతరులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
***
(Release ID: 1619378)
Visitor Counter : 200
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam