గనుల మంత్రిత్వ శాఖ

ఫిబ్రవరి 2020కి సంబంధించిన ఖనిజ ఉత్పత్తి గణాంకాలు విడుదల (తాత్కాలికం ) గతేడాదితో పోలిస్తే 10 శాతం అదనంగా నమోదైన ఉత్పత్తి సూచిక అత్యధిక ముఖ్య ఖనిజాల ఉత్పత్తిలో సానుకూల వృద్ధి

Posted On: 29 APR 2020 2:50PM by PIB Hyderabad

గనుల తవ్వకం మరియు క్వారీల సెక్టార్‌కు చెందిన ఖనిజ ఉత్పత్తి సూచిక, 2019 ఫిబ్రవరి కంటే 2020 ఫిబ్రవరిలో 10 వృద్ధిని సూచించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ‍( ప్రామాణికం‌: 2011-12=100 ) ఖనిజ ఉత్పత్తి సూచిక 123.7గా  నమోదైంది. అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే, 2019-20 ఏప్రిల్‌-ఫిబ్రవరి కాలంలో ఇది +1.9 శాతంగా ఉంది. భారత గనుల బ్యూరోకు చెందిన 'గనులు మరియు ఖనిజ గణాంకాల డివిజన్‌', ఖనిజ రంగానికి సంబంధించి నోడల్‌ ఏజెన్సీగా వ్యవహరిస్తూ, ఈ సమాచారాన్ని విడుదల చేసింది.

    2020 ఫిబ్రవరిలో ముఖ్య ఖనిజాల లెక్కలు ఇలా ఉన్నాయి. బొగ్గు 780 లక్షల టన్నులు, లిగ్నైట్ 47 లక్షల టన్నులు, సహజ వాయువు (వినియోగించబడింది) 2257 మిలియన్ క్యూబిక్‌ మీటర్లు, పెట్రోలియం (ముడి) 24 లక్షల టన్నులు, బాక్సైట్ 2190 వేల టన్నులు, క్రోమైట్ 395 వేల టన్నులు, రాగి కాన్సంట్రేట్ 5 వేల టన్నులు, బంగారం 162 కిలోలు, ఇనుప ఖనిజం 239 లక్షల టన్నులు, లెడ్ కాన్సంట్రేట్‌ 32 వేల టన్నులు, మాంగనీస్ ఖనిజం 276 వేల టన్నులు, జింక్ (కాన్సంట్రేట్‌) 142 వేల టన్నులు, అపటైట్ మరియు ఫాస్ఫరైట్ 136 వేల టన్నులు, సున్నపురాయి 327 లక్షల టన్నులు, మాగ్నసైట్ 11 వేల టన్నులు, వజ్రాలు 2720 క్యారెట్లు.

    ఫిబ్రవరి 2019తో పోలిస్తే, ఫిబ్రవరి 2020లో ముఖ్య ఖనిజాల ఉత్పత్తి రేటు సానుకూలంగా ఉంది. ఇది: జింక్‌ కాన్సంట్రేట్ (33.2%), 'ఇనుప ఖనిజం' (31.3%), 'క్రోమైట్' (18.2%), 'లెడ్ కాన్సంట్రేట్‌' (14.2%), 'బొగ్గు' (11.7%), 'సున్నపురాయి' (4.5%), 'మాంగనీస్ ఖనిజం' (3.3% ), 'లిగ్నైట్' (2.6%) మరియు 'బాక్సైట్' (1.3%). కొన్ని ముఖ్య ఖనిజాల ఉత్పత్తి ప్రతికూల వృద్ధిని చూపిస్తోంది. అవి: 'రాగి కాన్సంట్రేట్‌' (- 60.7%), 'బంగారం' (- 29.6%), 'సహజ వాయువు (వినియోగించబడింది)' (- 9.6%), 'పెట్రోలియం (ముడి)' (- 6.4%) మరియు 'ఫాస్ఫరైట్' (- 1.8%).

***
 



(Release ID: 1619255) Visitor Counter : 137