గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ
ఇప్పుడు ప్రజలకు అందుబాటులోకి కళ్యాణ్-డోంబివ్లి స్మార్ట్ సిటీ కోవిడ్-19 డాష్‌బోర్డ్
Posted On:
29 APR 2020 12:34PM by PIB Hyderabad
కళ్యాణ్-డోంబివ్లి మున్సిపల్ కార్పొరేషన్ (కేడీఎంసి) పరిధిలో కోవిడ్-19 వైరస్ వ్యాప్తి పరిస్థితి గురించి తెలియజేసేందుకు వీలుగా ఏర్పాటు చేసిన డాష్ బోర్డు తాజాగా ఒక పబ్లిక్ డొమైన్‌లోకి అందుబాటులోకి వచ్చింది. ఈ విషయాన్ని కళ్యాణ్-డోంబివ్లి మున్సిపల్ కార్పొరేషన్ (కేడీఎంసీ)
ఈ విషయాన్ని ప్రకటించింది. ఈ డాష్ బోర్డు పేజీని మున్సిపల్ కార్పొరేషన్ యొక్క వెబ్‌సైట్‌తో అనుసంధానించారు. దీనికి తోడు నగర స్థానిక ప్రభుత్వ ఇతర సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో (ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటివి) దీనిని ప్రజలు వీక్షించేందుకు వీలుగా అందుబాటులో ఉంచారు. ఈ డాష్‌బోర్డును https://kdmc-coronavirus-response-skdcl.hub. arcgis.com/ అనే వెబ్‌సైట్ ద‌్వారా యాక్సెస్ చేయవచ్చు. ఈ ‘డాష్‌బోర్డ్’ యొక్క ప్రధాన ప్రత్యేకత ఏంటంటే ఇందులో డ్రాప్ మెనూని ఉపయోగించి, పౌరులు ఏ ఎలక్టోరల్ వార్డుకు సంబంధించిన కోవిడ్ పరిస్థితికి సంబంధిత రేఖా చిత్రాల (గ్రాఫ్‌లను) రూపంలో వాస్తవ పరిస్థితి తెలుసుకోవచ్చు. నగరం యొక్క ప్రాదేశిక పటంలో సంబంధిత వార్డులపై క్లిక్ చేయడం ద్వారా పౌరులు ఆయా ప్రాంతాలలో కోవిడ్-19 పరిస్థితిని తెలుసుకోవచ్చు. ఉపగ్రహ వీక్షణ, రోడ్ మ్యాప్ అనే రెండు ఎంపికల నుండి ఇష్టమైన బేస్ మ్యాప్‌ను మార్చడం ద్వారా పరిస్థితిని క్షుణ్ణంగా తెలుసుకొనేలా డాష్‌బోర్డ్ బహుళ ఎంపికల సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చారు.
కేడీఎంసీ నగర-స్థాయిలో కోవిడ్ వైరస్ కేసుల వివరాలు
కేడీఎంసీ పరిధిలో నగర స్థాయితో పాటుగా వార్డుల వారీగా కోవిడ్ కేసుల వివరాలతో కూడిన వివరాలు
కేడీఎంసీ పరిధిలో ఎంపిక చేసిన వార్డులో కోవిడ్ కేసుల వివరాలు
కేడీఎంసీ పరిధిలో తేదీల వారీగా కోవిడ్ కేసుల వివరాలు
కేడీఎంసీ పరిధిలో వార్డుల వారీగా కోవిడ్ కేసుల స్థితి
****
(Release ID: 1619191)
Visitor Counter : 263