పర్యావరణం, అడవులు, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ

పర్యావరణ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఓపెన్ సోర్స్ గా మరియు సరసమైన ఖర్చులో అందుబాటులో ఉంచేందుకు ప్రపంచం ఏకం కావాలి – కేంద్ర పర్యావరణ మంత్రి

భారత్ సహా 30 దేశాలు పాల్గొన్న క్లైమేట్ ఛేంజ్ ఇన్ ఫస్ట్ ఎవర్ వర్చువల్ పీటర్స్ బర్గ్ క్లైమేట్ డైలాగ్ లో ససమస్యల గురించి చర్చ

Posted On: 28 APR 2020 7:57PM by PIB Hyderabad

పీటర్స్ బర్గ్ క్లైమేట్ డైలాగ్ పదకొండవ సెషన్ లో భారత దేశంతో పాటు మరో 30 దేశాలు పాల్గొన్నాయి. కోవిడ్ -19 తర్వాత ఆర్థిక వ్యవస్థలు మరియు సమాజాలను పునరుజ్జీవింపజేసే సవాలును ఎదుర్కోవడానికి మార్గాలు మరియు ఆచరణల గురించి, సామూహిక స్థితిస్థాపకత మరియు వాతావరణ చర్యలను ఉత్ర్పేరక పరిచేటప్పుడు ముఖ్యంగా అత్యంత హానీ కలిగించే వాటికి మద్ధతు విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ఈ సమావేశం చర్చించింది. 

 

మొదటి వర్చువల్ పీటర్స్ బర్గ్ క్లైమేట్ డైలాగ్ లో భారతదేశానికి ప్రాతినిథ్యం వహించిన కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ ప్రకాష్ జవదేకర్ మాట్లాడుతూ, ఈ రోజు ప్రపంచం ఐక్యంగా నావల్ కరోనా వైరస్ కోసం టీకా కనుగొనే పనిలో నిమగ్నమై ఉన్నందున, అదే విధంగా మనకు వాతావరణ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఓపెన్ సోర్స్ గా కలిగి ఉండాలని, ఇది సరసమైన ఖర్చుతో అందుబాటులో ఉండాలని సూచించారు.

క్లైమేట్ ఫైనాన్స్ సమస్యల గురించి నొక్కి చెప్పిన శ్రీ జవదేకర్, ప్రపంచానికి ఇప్పుడు అది అత్యంత అవసరమని, అభివృద్ధి చెందుతున్న ప్రపంచం కోసం వెంటనే 1 ట్రిలియన్ డాలర్ నిధుల కోసం ప్రణాళిక వేసుకోవాలని కేంద్ర మంత్రి అభిప్రాయపడ్డారు.

 కోవిడ్ -19 మహమ్మారిని ఎదుర్కోవడంలో ప్రపంచానికి సంఘీభావం తెలుపుతూ, కోవిడ్ -19 మనం ఆర్భాటాలకు పోకుండా ఎలా జీవించాలో నేర్పించిందనే విషయాన్ని నొక్కి చెప్పారు. పారిస్ కాప్ సందర్భంగా గౌరవ భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ తొలుత సూచించినట్లుగా, స్థిరమైన జీవన శైలికి అనుగుణంగా మరింత స్థిరమైన వినియోగ విధానాలను అవలంబించడం గురించి ప్రపంచం ఆలోచించాలని పర్యావరణ మంత్రి పునరుద్ఘాటించారు.

 

 

పదేళ్ల కాలపరిమితిలో జాతీయంగా భారతదేశం రచిస్తున్న ప్రణాళికలు ప్రతిష్టాత్మకమైనవని, అవి పారిస్ ఒప్పందం యొక్క ఉష్ణోగ్రత లక్ష్యానికి కూడా అనుగుణంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.  పునరుత్పాదక ఇంధన విస్తరణను వేగవంతం చేయడానికి మరియు పునరుత్పాదక ఇంధన మరియు ఇంధన సామర్థ్యం రంగంలో సరికొత్త హరిత ఉద్యోగాలను సృష్టించడానికి ఈ రోజు ప్రపంచం ముందు ఉన్న అవకాశాల గురించి మంత్రి మాట్లాడారు.

ఈ మొట్టమొదటి వర్చువల్ క్లైమేట్ డైలాగ్, పీటర్స్ బర్గ్ క్లైమేట్ డైలాగ్ యొక్క పదకొండవ సెషన్. ఇది 2010 నుంచి జర్మనీ ఆతిథ్యం ఇచ్చిన అనధికారిక ఉన్నత స్థాయి రాజకీయ చర్చలకు ఓ ఫోరమ్ ను అందించడానికి, అంతర్జాతీయ వాతావరణ చర్యలు మరియు వాతావరణ చర్యల పురోగతిపై దృష్టి సారించింది. వర్చువల్ లెవన్ పీటర్స్ బర్గ్ క్లైమేట్ డైలాగ్ లో 26వ కాన్ఫరెన్స్ పార్టీస్ (సి.ఓ.పి 26)కు నుంచి ఐక్యరాజ్య సమితి ఫ్రేమ్ వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ ఛేంజ్ (యు.ఎన్.ఎఫ్.సి.సి.సి)కు జర్మనీ మరియు యునైటెడ్ కింగ్ డమ్ కలిసి అధ్యక్షత వహించాయి. ఈ సమావేశంలో మంత్రులతో పాటు సుమారు 30 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.

2020 తర్వాత కాలంలో యు.ఎన్.ఎఫ్.సి.సి. కింద పారిస్ ఒప్పందం అమలు దశలోకి వెళ్ళడానికి సిద్ధమౌతున్న సమయంలో, కోవిడ్ -19 సవాళ్ళకు అనుగుణంగా ప్రజల ప్రాణాలను కాపాడేందుకు, ఈ మహమ్మారి యొక్క సామాజిక, ఆర్థిక పరిణామాలను అధిగమించడానికి ఈ ఏడాది ఓ కీలకమైన దశగా నిలిచింది. కోవిడ్ -19 తర్వాత మన వ్యవస్థలను మరియు సమాజాలను పునరుజ్జీవింపజేసే సవాలును సంయుక్తంగా ఎలా ఎదుర్కోవాలో చర్చించడం ఈ సమావేశం యొక్క ప్రధాన అజెండా. అదే సమయంలో మన స్థితి స్థాపకతను పెంచడంతో పాటు, వాతావరణ చర్యలకు ఊతమివ్వడంతో పాటు, బాగా హాని కలిగించే వాటి విషయంలో తీసుకోవలసిన నిర్ణయాలకు ఈ సమావేశం కీలక పాత్ర పోషిస్తుంది.

జర్మనీ ఫెడరల్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్ మెంట్, నేచర్ కన్జర్వేషన్ అండ్ న్యూక్లియర్ సేఫ్టీ మంత్రి శ్రీ స్వెంజాషుల్జో కలిసి ఇండో జర్మన్ ద్వైపాక్షిక సమావేశంలో కేంద్ర మంత్రి పాల్గొన్నారు. ఈ ద్వైపాక్షిక సమావేశం పీటర్స్ బర్గ్ క్లైమేట్ డైలాగ్ కు ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగింది. ఈ ప్రాంతాల్లో వాతావరణ మార్పులు, జీవ వైవిధ్య పరిరక్షణ మరియు జర్మనీతో సాంకేతిక సహకారం వంటి అంశాలపై చర్యలు జరిగాయి. కోవిడ్ -19 మమ్మారి నుంచి ఉత్పన్నమయ్యే రెండు దేశాల పరిస్థితి మరియు పునరుద్ధరణ ప్రయత్నాలు కూడా చర్చకు వచ్చాయి. 

 

***


(Release ID: 1619099) Visitor Counter : 267