పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ

కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ కొత్తగా ఉపక్రమించిన స్వమిత్వ గురించి మార్గదర్సకాలు జారీచేసిన కేంద్ర గ్రామీణాభివృద్ధి & పంచాయతీ రాజ్ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్

ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో క్రమబద్ధమైన ప్రణాళికకు మరియు రెవెన్యూ వసూళ్లకు దోహదం మరియు ఆస్తి హక్కులపై స్పష్టత; ఈ పథకం ద్వారా డ్రోన్ల ద్వారా సర్వే టెక్నాలజీని ఉపయోగించి గ్రామ పంచాయతీల అభివృద్ధికి మెరుగైన ప్రణాళికల రూపకల్పన

ఈ-గ్రామ స్వరాజ్ కు సంబంధించి ప్రామాణిక నిర్వహణ విధానం విడుదల చేసిన శ్రీ నరేంద్ర సింగ్ తోమర్

Posted On: 27 APR 2020 7:10PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా పంచాయత్ లకు డిజిటల్ సాధికారత కల్పించేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీ రాజ్ శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో  కొత్తగా ఉపక్రమించిన స్వమిత్వ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను జారీ చేసిన సందర్బంగా న్యూ ఢిల్లీలో మంత్రి ప్రసంగించారు.  గ్రామీణ ప్రాంతాల ప్రజలకు  తమ నివాస ఆస్తులను దస్తావేజులుగా మార్చే హక్కు కల్పించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని ఆయన అన్నారు.  గ్రామీణ ప్రాంతాలలో క్రమబద్ధమైన ప్రణాళికకు మరియు రెవెన్యూ వసూళ్లకు దోహదం మరియు ఆస్తి హక్కులపై స్పష్టతకు  ఈ పథకం సహాయకారిగా మారగలదని  మంత్రి అన్నారు.   దీనివల్ల ఆస్తి సంబంధ వివాదాలను కూడా పరిష్కరించవచ్చని అన్నారు. ఈ పథకం ద్వారా  గ్రామ పంచాయతీల అభివృద్ధికి మెరుగైన ప్రణాళికల రూపకల్పన చేయడంతో పాటు నక్షాలను సృష్టించవచ్చని అన్నారు. 

 

స్వమిత్వ పథకం,  కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖరాష్ట్రాల పంచాయతీ రాజ్ శాఖలు ,  రాష్ట్రాల రెవెన్యూ శాఖలుసర్వే ఆఫ్ ఇండియా కలసికట్టుగా నిర్వహించే స్కీమ్.  డ్రోన్ల ద్వారా సర్వే టెక్నాలజీని ఉపయోగించి గ్రామీణ భారతంలో ఆస్తులు క్రమబద్ధం  చేస్తారు.  ప్రస్తుతం ఈ కార్యక్రమం ఆరు రాష్ట్రాలలో అమలవుతోంది.    ఆ ఆరు రాష్ట్రాలు -- హర్యానాకర్నాటకమధ్యప్రదేశ్ మహారాష్ట్ర,  ఉత్తర ప్రదేశ్ మరియు ఉత్తరాఖండ్.  ఈ పధకం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో అధునాతన సర్వే విధానండ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి గ్రామీణ ప్రాంతాలలో ఇళ్ళు,  ఇళ్లకు ఉపయోగించదగ్గ భూముల నక్షాలను తయారు చేస్తారు.  ఇందుకోసం పంజాబ్రాజస్థాన్  రాష్ట్రాలలో  ఈ ఏడాది ఏర్పాటు చేయనున్న నిర్వహణ కేంద్రాల ద్వారా వచ్చే ఏడాది గ్రామాలలో జనం నివాసముంటున్న ప్రాంతాల సర్వే జరిపి నక్షాలను తయారు చేస్తారు. 

ఈ సందర్బంగా శ్రీ తోమర్ ఈ- గ్రామ స్వరాజ్ కోసం ప్రామాణిక నిర్వహణ విధానాన్ని విడుదల చేశారు.  పంచాయతీలకు కేటాయించిన నిధులు దుర్వినియోగం కాకుండా సక్రమ వినియోగం జరగడంతో పాటు పారదర్శకత ఉండేలా చూడటమే ఈ విధానం ఉద్దేశమని మంత్రి తెలిపారు.  ఈ విధానం వల్ల ఒక బలమైన ఆర్ధిక వ్యవస్థకు ఏర్పాటుకు దోహదం చేయగలదని అన్నారు. దీనివల్ల నిధుల లెక్కలు చూసే విధానంలో  మార్పు ద్వారా పంచాయత్ రాజ్ మంత్రిత్వ శాఖ ఖాతాల నిర్వహణ తీరులో మార్పులు జరిగి  ప్రియా సాఫ్ట్పి ఎఫ్ ఎం ఎస్ పోర్టల్స్ సమీకృతం కాగలవని అన్నారు.  పంచాయత్ రాజ్ సంస్థల నిర్వహణలో పారదర్శకత తేవడం దీని లక్ష్యమని అన్నారు.  ఈ-గ్రామ స్వరాజ్ వల్ల ఉన్నతాధికారులచే సమర్ధవంతమైన పర్యవేక్షణ సాధ్యమవుతుందని అన్నారు.  పంచాయత్ ల అన్ని రకాల అవసరాలు తీర్చడానికి ఇది ఏకైక వేదిక అవుతుంది.

 

 

కేంద్ర ఫైనాన్స్ కమిషన్ నిధుల ప్రవాహంపై పట్టు సాధించడమే కాక సమయానికి చెల్లింపులు జరపడంలో ఇది మంత్రిత్వ శాఖకు సహాయకారి కాగలదు.  ఆన్ లైన చెల్లింపు మాడ్యూల్ ఏర్పాటు ఉద్దేశం  పంచాయత్ లలో ఒక పటిష్టమైన ఆర్ధిక నిర్వహణ వ్యవస్థను ఏర్పాటు చేయడం. తద్వారా పంచాయత్ ల విశ్వసనీయతను,  ప్రతిష్టను పెంచడం.    

ఈ ప్రయత్నాలన్నీ డిజిటల్ ఇండియా కార్యక్రమం లక్ష్యాలకు అనుగుణంగానే ఉన్నాయి.   దాని ఉద్దేశం ఇండియాను డిజిటల్ సాధికారత గల సమాజంగాతెలివైన ఆర్ధికవ్యవస్ధగా పరివర్తన చేయడం.  

***



(Release ID: 1618810) Visitor Counter : 364