రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

కొవిడ్-19పై పోరాటానికి భారతీయ వాయుసేన సహకారం

Posted On: 27 APR 2020 6:19PM by PIB Hyderabad

కొరోనా విశ్వ మహమ్మారిపై  అవిరళ పోరాటం చేస్తున్న భారత ప్రభుత్వానికి ఎల్లవేళలా సహకరిస్తూ  ఔషధాలు మరియు ఆహార వస్తువుల వంటి అత్యవసరాలను కాకుండా వైద్య సిబ్బందిని కూడా దేశంలో వివిధ ప్రాంతాల్లోని గమ్య స్థానాలకు సరియైన సమయంలో చేరుస్తూ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు మరియు వివిధ సంస్థలకు సహకరిస్తున్న భారత వాయుసేన(ఐఏఎఫ్).

కొవిడ్ -19పై పోరాటంలో  భాగంగా 25 ఏప్రిల్ 2020న 22 టన్నుల ఔషధాలు మరియు ఇతర వైద్య సంబంధిత సామాగ్రితో మిజోరంలోని లెంగ్పుయి ఏయిర్పోర్టుకు  చేరింది  భారత వాయుసేనకు చెందిన విమానం. మిజోరం మరియు మేఘాలయ ప్రభుత్వాలకు  ఈ వైద్య సామాగ్రిని చేరవేసింది, కాగా ఇప్పటి వరకు సుమారు 600 టన్నుల వైద్య సంబంధిత సామాగ్రిని మరియు ఇతర సహాయ సామాగ్రిని  వివిధ ప్రాంతాలకు రవాణా చేసింది.

భారత ప్రభుత్వానికి కువైట్ దేశ విజ్ఞప్తి మేరకు భారత ప్రభుత్వం ఇచ్చిన  ఆదేశాల మేరకు 11 ఏప్రిల్ 2020న 15 మందితో కూడిన ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్(ఏఎఫ్ఎంఎస్) బృందం శీఘ్రంగా స్పందించి బయలుదేరి 25 ఏప్రిల్ 2020న సి-130 విమానంలో అక్కడి చేరుకుని క్యాన్సర్తో బాధపడుతున్న 6 సంవత్సరాల బాలికను  అత్యవసర శస్త్ర చిక్సిత్స నిమిత్తం భారతదేశానికి తీసుకు వచ్చింది ఆమెతోపాటు ఆమె తండ్రిని  కూడాబ వెంట తీసుకుని  వచ్చింది ఈ  బృందం.

కొరొనా వ్యాప్తి నిరోధానికి ప్రభుత్వం సూచించిన సామాజిక దూరం పాటించడం వంటి మార్గదర్శకాలను పాటిస్తూనే భారత ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎప్పటికప్పుడు చురుకుగా స్పందిస్తూ  ఈ వ్యాధి నిరోధానికి తనదైన రీతిలో తన వంతు కృషి చేస్తోంది భారత వాయుసేన.

***

 



(Release ID: 1618775) Visitor Counter : 179