రైల్వే మంత్రిత్వ శాఖ

భారతీయ రైల్వే కోచ్ తయారీ ఫ్యాక్టరీలో తిరిగి మొదలైన పనులు

Posted On: 25 APR 2020 4:23PM by PIB Hyderabad

రాష్ట్రాల్లో లాక్డౌన్ నిబంధనల ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వాల నుండి అనుమతి లభించగానే ఉత్పత్తి ప్రారంభం

సరుకు రవాణాను పెంచడాని కోసం గత రెండు రోజుల్లో 2 పార్శిల్ కోచులను తయారు చేసిన రైల్వే కోచ్ ఫ్యాక్టరీ

28 రోజుల దేశవ్యాప్త లాక్డౌన్ అనంతరం 23.04.2020న కపుర్తలాలోని రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఉత్పత్తిని పున:ప్రారంభించింది.  కొవిడ్-19 వ్యాప్తిని నిరోధానికి కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మరియు స్థానిక అధికార యంత్రాంగం మార్గదర్శకాలను అనుసరించి తగిన జాగ్రత్తలను తీసుకుని కోచ్ ఫ్యాక్టరీ తన కార్యకలాపాలను తిరిగి ప్రారంభించింది. ఆర్సిఎఫ్ టౌన్షిప్లో నివాసముంటున్న 3744 మంది ఉద్యోగులు పనిలోకి రావడానికి అనుమతి లభించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మరియు ఇతర రాష్ట్ర ప్రభుత్వాల సూచనల ప్రకారం ఇతర రాష్ట్రాల్లోని కోచ్ ఫ్యాక్టరీలు కూడా తమ ఉత్పత్తిని పున:ప్రారంభించనున్నాయి.

వనరుల కొరత ఉన్నాకూడా ఉన్న వనరులను వినియోగించుకుని గత రెండు రోజుల్లోనే రెండు కోచులను తయారు చేసింది కపుర్తలా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ. 23.04.2020న ఒక ఎల్హెచ్బి అధిక సామర్థ్యం కలిగిన పార్శిల్ వ్యానును మరియు 24.04.2020ను లగేజ్ మరియు జనరేటర్ కారును తయారు చేసింది.

లాక్డౌన్ తరువాత విధులకు హాజరైన సిబ్బందికి వ్యక్తిగత పరిశుభ్రతను పాటించేందుకు మాస్కులు, సానిటైజర్లు, సబ్బులను అందజేసారు. విధులకు హాజరైన 33% సిబ్బందికి మరియు అధికారులందరికీ రొటేషన్ రోస్టర్ ఆధారంగా విధులను వేస్తున్నారు. వర్కుషాపు, కార్యాలయాలు మరియు నివాస ప్రాంతాల్లో కొవిడ్-19పై అవగాహన కల్పించే విధంగా పోస్టర్లను అంటించడంతోపాటు తమ సిబ్బంది పనిచేయు ప్రాంతంలో మార్గదర్శకాలను అనుసరించి తగిన జాగ్రత్తలను పాటించే విధంగా అధికారులు  మరియు సూపర్వైజర్లు తగిన చర్యలను తీసుకుంటున్నారు. కార్యాలయాలు, వర్కుషాపు ఫ్లోర్లలో తగిన సంఖ్యలో  ద్రవరూప సోపు మరియు వాషుబేసిన్లను ఏర్పాటు చేసారు.

ఉద్యోగులు వారి షిఫ్టుల్లో మాత్రమే వేరు వేరు సమయాల్లో పనిలోని అనుమతిస్తున్నారు.  మూడు షిప్టుల్లో పనిలోనికి వచ్చే వేళలు, భోజన వేళలు మరియు పనిపూర్తయ్యే వేళల మధ్య సమయం ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. ప్రతీ ఉద్యోగి శరీర ఉష్ణోగ్రతను అనుసరించి థర్మల్ స్కానర్ల ద్వారా ప్రవేశ ద్వారం వద్దే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రవేశ ద్వారాల వద్దే కోచ్ ఫ్యాక్టరీలోని ప్రవేశించే ప్రతీ వాహనాన్ని మిస్ట్ సానిటైర్ల ద్వారా శుభ్రపరచడం జరుగుతోంది. పనిచేయునపుడు ఉద్యోగులు సామాజిక దూరం పాటించడం, వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం చేస్తున్నారు.  ఏ ఉద్యోగికైనా కొవిడ్-19 ఇన్ఫెక్షన్ లక్షణాలు కనిపిస్తే  కోచ్ ఫ్యాక్టరీ పరిసరాల్లోని లాలా లజ్పత్ రైల్ ఆసుపత్రిలో ప్రత్యేక కౌంటర్లను మరియు ఓపిడి సెల్లను ఏర్పాటు చేయడం జరిగింది. కొవిడ్-19 సంబంధింత కేసుల నిర్వహణ కోసం 24 బెడ్ల క్వారెంటైన్ సౌకర్యాన్ని మరియు 8 బెడ్ల ఐసోలేషన్ వార్డును ఈ ఆసుపత్రిలో ఏర్పాటు చేసారు. లాక్డౌన్ నిబంధనల ఆధారంగా రాష్ట్రాల అనుమతులను అనుసరించి ఇతర విభాగాల్లోనూ ఉత్పత్తి కార్యక్రమాలు మొదలు కానున్నాయి.
 


(Release ID: 1618220) Visitor Counter : 212