గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

పింప్రి చించ్వాడ కోవిడ్-19 వార్ రూమ్ ద్వారా ప్రభావవంతమైన సాంకేతిక పరిజ్ఞానం- సమర్థవంతమైన నిర్ణయం తీసుకోవటానికి డేటా ట్రాకింగ్‌ను ఉపయోగిస్తుంది

Posted On: 24 APR 2020 6:21PM by PIB Hyderabad

నగరంలో కోవిడ్ -19 పరిస్థితిని తెలుసుకోవడానికిపర్యవేక్షించడానికి పిసిఎంసి వద్ద కోవిడ్ -19 వార్ రూమ్ ఏర్పాటయింది. స్మార్ట్ సిటీస్ మిషన్ కిందసత్వర నిర్ణయం తీసుకోవడంలో సహాయపడటానికి డేటాను సేకరించడంవిశ్లేషించడం కోసం వార్ రూమ్ లో సాంకేతిక పరిష్కారాలు రూపు దిద్దుకున్నాయి. 

హెల్త్‌కేర్-పేషెంట్ ట్రాకింగ్ డాష్‌బోర్డ్: 

పిసిఎంసి డాష్‌బోర్డ్‌ను అభివృద్ధి చేసిందిఇది కోవిడ్ సంబంధిత కేసులుపరీక్షలు ఆరోగ్య సంరక్షణ ఏర్పాట్లపై రియల్ టైం సమాచారాన్ని అందిస్తుంది. ప్రతి ఆసుపత్రికి ప్రత్యేకమైన ఆన్‌లైన్ ఫారం ద్వారా డాష్‌బోర్డ్‌ అనుసంధానమై ఉంటుంది. దీనిలో ప్రతి హాస్పిటల్ యూనిట్ ద్వారా సమాచారం క్రోడీకరిస్తారుఇది ఐసిసిసిలోని డాష్‌బోర్డ్‌లో రియల్ టైమ్ ప్రాతిపదికన నవీకరణ అవుతుంది. ఈ డాష్‌బోర్డ్ 10 ఆస్పత్రుల నుండి డేటాను ట్రాక్ చేస్తుందిపడకల సామర్థ్యంనమూనా పరీక్షపాజిటివ్క్వారంటైన్  కేసులు వంటి పారామితుల ప్రకారం కోవిడ్ చికిత్సను అందిస్తుంది. 

 

కోవిడ్-19 జిఐఎస్ డాష్‌బోర్డ్:  ఇది జియోట్యాగ్ చేయడానికి ఉపయోగించే స్థాన-ఆధారిత సమాచార వ్యవస్థ. ఇంట్లో క్వారంటైన్ అయిన వ్యక్తులు (మ్యాప్‌లో ఊదా రంగు చుక్కలు)కోవిడ్-19 పాజిటివ్ వ్యక్తుల చివరి స్థానం (రెడ్ డ్రాప్ మార్క్స్)దిగ్బంధంలో ఉన్న ప్రాంతం (బ్లాక్ లైన్స్ )మార్గం మూసివేతమొదలైన వ్యక్తులను జియోట్యాగ్ చేస్తారు. రోగి కోవిడ్-19 పాజిటివ్‌గా గుర్తించిన తర్వాతఅతను / ఆమె బస చేసిన చివరి స్థానం డాష్‌బోర్డ్‌లో గుర్తించబడుతుంది. అలాగే ఇంటి క్వారంటైన్ లో ఉన్న వారిని కూడా మ్యాప్ లో సూచిస్తారు. ఈ వివరాల ద్వారా తక్కువ ప్రమాదం నుండి ఎక్కువ ప్రమాదం ఉన్న ప్రాంతాలను, వ్యక్తులను వర్గీకరించే వీలు అవుతుంది. ఈ డాష్‌బోర్డ్ కోవిడ్-19 కేసుల కేంద్రాలను గుర్తించడానికి కూడా ఉపయోగించబడుతుందిఇది క్రిమిసంహారక మందులను వెంటనే చల్లడం కోసం ప్రదేశాలను గుర్తించడానికి ఆరోగ్య శాఖకు సహాయపడుతుంది. ఇంటింటికీ ప్రచారం చేయడానికి ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌లను పంపించడానికిమరిన్ని కేసులు ఉన్నాయో లేదో గుర్తించడానికి వైద్య శాఖ అదే సమాచారాన్ని ఉపయోగిస్తుంది. ఈ భౌగోళిక సమాచారం వ్యాధి విస్తరణను నిలువరించడానికి ఉపయోగపడుతుంది.  ఈ జిఐఎస్ డాష్‌బోర్డ్సిటీ సర్వైలెన్స్ డాష్‌బోర్డ్‌లో నగర వ్యాప్తంగా విస్తృతి కలిగి ఉంటుంది. 

 

సిటీ సర్వైలెన్స్ డాష్‌బోర్డ్:  వివిధ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి మొత్తం 298 ‘పాయింట్-టిల్ట్-జూమ్’ నిఘా కెమెరాలను పిసిఎంసి అధికార పరిధిలోని 85 ప్రదేశాలలో ఏర్పాటు చేశారు. ఈ నిఘా వ్యవస్థ డాష్‌బోర్డ్ ఐసిసిసిలో ఏర్పాటు అయింది  దీనిని పిసిఎంసి మరియు పింప్రి- చించ్వాడ పోలీసులు సంయుక్తంగా పర్యవేక్షిస్తారు. పిసిఎంసి వీడియో అనలిటిక్స్ ని రూపొందించింది. ఇది ముగ్గురు కంటే ఎక్కువ మంది గుమిగూడితే ఏ ప్రదేశాలలోనైనా నిఘా కెమెరాల ద్వారా హెచ్చరికలను అందిస్తుంది. 

 

సారథి హెల్ప్‌లైన్ డాష్‌బోర్డ్: పిసిఎంసికి ఉన్న ప్రత్యేకమైన హెల్ప్‌లైన్ ప్లాట్‌ఫాం సారథి (హెల్ప్‌లైన్ ఇన్ఫర్మేషన్ ద్వారా నివాసితులు మరియు పర్యాటకులకు సహాయపడే వ్యవస్థ)ఇందులో పౌరులు వివిధ సేవలకు సంబంధించి ఏదైనా సహాయం కోసం అభ్యర్థించవచ్చు. హెల్ప్‌లైన్ ద్వారా స్వీకరించిన అన్ని కాల్‌లు ఆడియో ఫైల్‌గా నిక్షిప్తం అవుతాయి. అభ్యర్థన తేదీ స్వభావంసంబంధిత విభాగంజోన్అభ్యర్థన పరిష్కార స్థితికి సంబంధించి వివరాలు కూడా నమోదు అవుతాయి. ఐసిసిసిలో సారథి డాష్‌బోర్డ్ ఏర్పాటు చేసారు. పౌరుల నుండి ప్రధాన అభ్యర్థన / ఫిర్యాదులువాటి పరిష్కార స్థితిజోన్ వారీగా అభ్యర్థన / ఫిర్యాదులు మొదలైన వాటిని విశ్లేషించే వ్యవస్థ ఉంటుంది.

 

కేవలం వారాల వ్యవధిలో - పిసిఎంసి స్మార్ట్ సారథి యాప్ 30,000 కి పైగా డౌన్‌లోడ్‌లయిందిట్విట్టర్ ఫాలోయర్స్ మూడు రెట్లుఫేస్ బుక్  ఫాలోయర్స్ దాదాపు రెట్టింపు అయ్యారు. అన్ని కోవిడ్-19 రోగులు క్వారంటైన్ వ్యక్తులు  వార్ రూమ్ నుండి ట్రాక్ అవుతారు
 

***** 



(Release ID: 1618001) Visitor Counter : 134