బొగ్గు మంత్రిత్వ శాఖ

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కోల్ ఇండియా లిమిటెడ్ 710 మెట్రిక్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేస్తుంది: శ్రీ ప్రహ్లాద్ జోషి

Posted On: 23 APR 2020 2:30PM by PIB Hyderabad

కోల్ ఇండియా లిమిటెడ్ (సి.ఐ.ఎల్) 710 మిలియన్ టన్నుల(ఎం.టి) బొగ్గును ఉత్పత్తి చేయనుంది. ఈ ఆర్థిక సంవత్సరానికి సంస్థ బొగ్గు ఆఫ్ టేక్ లక్ష్యం కూడా 710 మెట్రిక్ టన్నులు నిర్దేశించుకుంది. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ ప్రహ్లాద్ జోషి 2020 ఏప్రిల్ 22న వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దీని పని తీరును సమీక్షిస్తూ, ప్రభుత్వ సంస్థ కోసం ఈ లక్ష్యాలను నిర్దేశించారు.

కరోనా వైరస్ లాక్ డౌన్ తర్వాత బొగ్గు డిమాడ్ మళ్ళీ పెరుగుతుంది కనుక 2023 నాటికి ఒక బిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించాలనే లక్ష్యానికి అనుగుణంగా 2020-21 ఆర్థిక సంవత్సరానికి 710 మెట్రిక్ టన్నుల ఉత్పత్తిని మరియు లక్ష్యాలను అధిగమించాలని సి.ఐ.ఎల్. ను అదేశించినట్లు శ్రీ ప్రహ్లాద్ జోషి తెలిపారు.

ఏడాది పొడవునా బొగ్గు ఉత్పత్తిలో స్థిరత్వం గురించి నొక్కి చెప్పిన ఆయన వర్షాకాలంలో కూడా ఉత్పత్తి ప్రభావితం కానందున అవసరమైన అన్ని సన్నాహాలు చేయాలని సి.ఐ.ఎల్. మేనేజ్ మెంట్ కు సూచించారు. వినియోగదారులందరికీ నాణ్యమైన బొగ్గును అందించాలని, ఏడాది మొత్తం విద్యుత్ ప్లాంట్ లకు తగినంత బొగ్గు అందుబాటులో ఉండాలని సి.ఐ.ఎల్. అధికారులకు సూచించారు.

 2020-21 ఆర్థిక సంవత్సరానికి కంపెనీ ఓవర్ బర్డెన్ (ఓ.బి) తొలగింపు లక్ష్యం దాని 1 బి.టి. ప్రణాళికలతో 1580 మిలియన్ క్యూబిక్ మీటర్లుగా సమావేశంలో నిర్ణయించబడింది.మైనింగ్ కోసం సిద్ధంగా ఉన్న వాటిని బహిర్గతం చేసేందుకు పై మట్టిని తొలగించాలని ఓ.బి. తొలగింపు సూచిస్తోంది.

కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న సమయంలోనూ కాంతుల కోసం పగలు, రాత్రి శ్రమించే బొగ్గు యోధులను చూసి తాను గర్వపడుతున్నానని, అనుకున్న సమయాని కంటే ముందుగానే సి.ఐ.ఎల్. కేటాయించిన లక్ష్యాలను చేరుకుంటుందని ఆశిస్తున్నట్లు, అదే విధంగా లక్ష్యాలను చేరుకునేందుకు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుందని శ్రీ ప్రహ్లాద్ జోషి తెలిపారు.

తమ డిమాండ్ ను తీర్చడానికి ప్రస్తుతం బొగ్గును దిగుమతి చేసుకుంటున్న సంస్థలను సంప్రదించాలని కేంద్ర మంత్రి సి.ఐ.ఎల్. మేనేజ్ మెంట్ ను కోరారు. బొగ్గు దిగుమతిని ప్రత్యామ్నాయంగా మార్చడానికి ఓ వివరణాత్మక ప్రణాళికను రూపొందించాలని సూచించారు. 

 

--



(Release ID: 1617448) Visitor Counter : 133