రక్షణ మంత్రిత్వ శాఖ
పంజాబ్ రాష్ట్రంలోని కసోవాల్ ఎంక్లేవ్ ను దేశంలోని ఇతరప్రాంతాలనుకలుపుతూ 484 మీటర్ల బ్రిడ్జిని నిర్మించిన బిఆర్ వో.
Posted On:
22 APR 2020 7:53PM by PIB Hyderabad
పంజాబ్ లోని కసోవాల్ ఎంక్లేవ్‌ను ఇతర ప్రాంతాలతో కలుపుతూ రావి నది మీద నిర్మించిన బ్రిడ్జి ప్రారంభమైంది. దీన్ని సరిహద్దు రహదారుల సంస్థ ( బిఆర్ వో ) చాలా తక్కువ సమయంలో, అనుకున్న సమయానికంటే ముందుగానే నిర్మించి, ప్రారంభించింది. 35 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన ఎంక్లేవ్ ప్రాంత ప్రజలకు ఇంతకాలం దూరంగా వున్న, తక్కువ సామర్థ్యం గల పంటూన్ బ్రిడ్జిని ఉపయోగించుకుంటూ వుండేవారు.
ప్రతి ఏడాది రుతుపవనాలకు ముందు పంటూన్ బ్రిడ్జిని తొలగించేవారు. వరదలకు కొట్టుకుపోతుందనే భయంతో ఆ పని చేసేవారు. దాంతో రుతుపవనాల సమయంలో వేలాది ఎకరాల్లో వ్యవసాయ పనులు ఆగిపోయేవి. దాంతో ఎంక్లేవ్ ప్రాంతంలోని ప్రజలకు, సైనికులకు ఒక బలమైన క్లాస్ 70 బ్రిడ్జి, అదికూడా చిరకాలం వుండే బ్రిడ్జి అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన బిఆర్ వో ఒక ప్రణాళిక ప్రకారం ఈ స్థిరమైన బ్రిడ్జిని నిర్మించింది.
484 మీటర్ల పొడవైన ఈ బ్రిడ్జిని నిర్మించడానికిగాను రూ.17.89 కోట్లు ఖర్చయ్యాయి.
కసోవాల్ బ్రిడ్జిని వైశాఖి సమయానికి నిర్మించాలని బిఆర్ వో లక్ష్యంగా పెట్టుకుంది. ఎందుకంటే ఆ సమయానికి అక్కడి రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ పంటల్ని తరలించగలరని అనుకున్నారు. ఈ ఏడాది మార్చి 15 నాటికి దాదాపుగా పని పూర్తయ్యింది. అయితే కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో కొంతకాలం పనులు నిలిచిపోయాయి.
అయితే బ్రిడ్జి పూర్తి కాకపోతే రైతులకు నష్టం జరుగుతుందని, వరదల కారణంగా అసంపూర్ణ బ్రిడ్జికి నష్టం జరగవచ్చని భావించిన బిఆర్ వో వెంటనే పంజాబ్ ప్రభుత్వాన్ని, గురుదాస్ పూర్ జిల్లా అధికారులను సంప్రదించి కావలసిన అనుమతులు సంపాదించింది. దాంతో పనులు తిరిగి మొదలై బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేయడం జరిగింది.
లాక్ డౌన్ కు సంబంధించిన్న అన్ని జాగ్రత్తలను పాటిస్తూనే బిఆర్ వో ఈ పనిని పూర్తి చేసిందని బోర్డర్ రోడ్స్ డైరెక్టర్ జనరల్ లెప్టినెంట్ హర్పాల్ సింగ్ అన్నారు. అందుబాటులోని అన్ని వనరులను ఉపయోగించుకొని పనులు పూర్తి చేశారు. వైశాభి ప్రారంభమైన తర్వాత వచ్చిన మొదటి సోమవారంనాడు బ్రిడ్జిని ప్రారంభించారు. దీని మీద అన్నదాతలు తమ పంటల్ని రవాణా చేసుకోవడం మొదలైంది.
(Release ID: 1617320)
Visitor Counter : 191