సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 సంబంధిత విషయాలు, సమస్యలపై కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ & కాశ్మీర్ కౌన్సిలర్లు/ కార్పొరేటర్లతో బుధవారం చర్చించిన కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్

నాడు పోస్టు చేయడమైనది: 22 APR 2020 6:55PM by PIB Hyderabad

కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూ & కాశ్మీర్ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన కౌన్సిలర్లు / కార్పొరేటర్లతో
కోవిడ్ సంబంధిత విషయాలపై బుధవారం కేంద్రమంత్రి  డాక్టర్ జితేంద్ర సింగ్ చర్చలు జరిపారు.    
దాదాపు గంటన్నర పాటు వీడియో కాన్ఫరెన్సు ద్వారా వివిధ మునిసిపల్ పాలక మండళ్లకు చెందిన ప్రతినిధులతో
జరిగిన సమావేశంలో డాక్టర్ సింగ్ పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నారు.  మంత్రితో తమ అభిప్రాయాలను పంచుకున్న ప్రముఖులలో జమ్మూ మేయర్ చంద్ర మోహన్ గుప్తా ,  అనంతనాగ్ కు చెందిన హిలాల్ షా ,  లేహ్ కు చెందిన డాక్టర్ ఈశే,  కతువాకు చెందిన నరేష్ కుమార్ ,  హీరానగర్ కు చెందిన విజయ్ కుమార్ శర్మ,  కుప్వారా కు చెందిన రియాజ్ అహ్మద్ మీర్ ,  ఉద్దంపూర్ కు చెందిన డాక్టర్ యోగేశ్వర్ గుప్తా,  బిలావర్ కు చెందిన  ఉమాకాంత్ బసోత్రా,  భదర్వాకు చెందిన డాక్టర్ షాహిద్ ముఘల్, దోడాకు చెందిన వేద ప్రకాశ్,  రీ సీకి  చెందిన సుధేష్ పూరి,  రాజౌరి కి చెందిన మహ్మద్ ఆరిఫ్ ,  కట్రాకు చెందిన శశి కుమార్  మరియు అజయ్ బారు,  కిష్టావర్ కు చెందిన రయాజ్,  బటోత్ కు చెందిన ఎస్. రవీందర్ సింగ్ ,  రాంబన్ కు చెందిన అమిత్ ఠాకూర్  ఉన్నారు.   

 

 కోవిడ్ -19 సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం పొందుపరచిన మార్గదర్శకాల అమలులో పౌర సమాజం మరియు పాలనా బృందం సమన్వయంతో వ్యవహరించినందుకు  తొలుత డాక్టర్ జితేంద్ర సింగ్ అన్ని మునిసిపల్ పాలనా మండళ్ల ప్రజా ప్రతినిధులను అభినందించారు.    సరైన రీతిలో లాక్ డౌన్ పాటించేలా వారు పూర్తి సహకారం అందించారని ఆయన అన్నారు.  
స్థానిక సంస్థల ప్రతినిధుల నుంచి తమకు లభించిన సహకారం పట్ల వివిధ జిల్లాలకు చెందిన జిల్లా కలెక్టర్లు, డిప్యూటీ కమిషనర్లు స్వచ్చంధంగా వారిని ప్రశంసించడం చూసి తనకు ఎంతో సంతోషం కలుగుతోందని ఆయన అన్నారు.  
లాక్ డౌన్ ఉన్నప్పటికినీ కొంత సడలింపు విధించినందువల్ల ఇప్పుడు మన ముందున్న ప్రధాన సమస్య దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న కాశ్మీరీలు తమ సొంత రాష్ట్రానికి తిరిగి రావడం,  కూలీలు/కార్మికులు , విద్యార్థుల  రాకపోకలు జరిగేలా చూడటం.  ఇందుకు సంబంధించి విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి  తమకు అనేక అభ్యర్ధనలు అందుతున్నాయని ఆయన తెలిపారు.
ఈ విషయంలో ప్రజా ప్రతినిధులు ముఖ్యంగా స్థానిక సంస్థల ప్రతినిధుల సహకారాన్ని మంత్రి అర్ధించారు.   ఈ  రాకపోకలు  చిన్నచిన్న బృందాలుగా, వ్యూహాత్మకంగా,  జాగ్రత్తగా జరగాలని మంత్రి అన్నారు.  అట్టడుగు స్థాయిలో పరిచయాలు ఉన్న స్థానిక సంస్థల ప్రతినిధులు మాత్రమే ప్రజలకు ఈ విషయాన్ని వివరించగలరని ఆయన అన్నారు.  
ఈ తరుణంలో మనం తొందరపడి విపత్తును కొనితెచ్చుకోరాదని,  మనం కతువా  అనుభవం నుంచి నేర్చుకోవాలని అన్నారు.  లాక్ డౌన్ ప్రకటించిన తరువాత ఇన్నాళ్లు కరోనా కేసులు లేకుండా ఉన్న కతువాకు మహారాష్ట్రలో పనిచేస్తున్న ఒక వ్యక్తి తగిన మార్గదర్శకాలు పాటించకుండా హీరానగర్ లో ఉన్న తన  గ్రామానికి తిరిగి రావడంతో  ఒక పాజిటివ్ కేసు బయటికి వచ్చింది.  
దేశంలోని వివిధ ప్రాంతాలలో చిక్కుబడి పోయిన వారంతా తమ కుటుంబ సభ్యులతో కలవాలని మేమూ తీవ్రంగా ఆశిస్తున్నాము.  అయితే ఈ విషయంలో  మీ అందరి సహకారానికై విజ్ఞప్తి చేస్తున్నానని  ఆయన అన్నారు.    ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు  చేస్తున్నామని , దేశంలోని  ఏ ప్రాంతంలో ఉన్నా వారి సమస్యలను గురించి సమాచారం అందిన వెంటనే స్థానిక జిల్లా అధికారులు వారితో సంబంధం ఏర్పరచుకొంటారని అన్నారు.  
గత నాలుగు వారాలుగా కాశ్మీర్ లో చిక్కుబడి పోయిన కార్మికులకు / కూలీలకు సమాచారం అందిన వెంటనే  అన్న సామగ్రి,  ఆహారం సమకూర్చిన పౌర సమాజం  వారి స్ఫూర్తిని, తక్షణం  అనుబంధ సహాయం అందజేసిన నగరపాలక సంస్థలు / మునిసిపల్ మండళ్ల సభ్యులను డాక్టర్  జితేంద్ర సింగ్ ప్రశంసించారు.   

***


(రిలీజ్ ఐడి: 1617314) సందర్శకుల సూచీ సంఖ్య : : 158
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Punjabi , Gujarati , Tamil , Kannada