ప్రధాన మంత్రి కార్యాలయం
ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీకి, ఐర్లండ్ ప్రధానమంత్రికి మధ్య టెలిఫోన్ సంభాషణ
प्रविष्टि तिथि:
22 APR 2020 7:05PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీనరేంద్ర మోదీ , ఐర్లండ్ ప్రధానమంత్రి డాక్టర్ లియో వరద్కర్ ల మధ్య ఈ రోజు టెలిఫోన్ సంభాషణ జరిగింది. వీరిరువురూ కోవిడ్ -19 మహమ్మారి కి సంబంధించి పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ మహమ్మారి ప్రభావాన్ని ఇరు దేశాల ఆరోగ్యం, ఆర్థిక స్థితిగతులపై పడకుండా తీసుకుంటున్నచర్యలపై వారు చర్చించారు.
ఐర్లాండ్‌లో కొవిడ్ వైరస్ వ్యాప్తికి వ్యతిరేకంగా భారత సంతతి వైద్యులు, నర్సులు పోషిస్తున్న పాత్రను ప్రధాని వరద్కర్ ప్రశంసించారు. ఐర్లాండ్‌లో ఉన్న భారతీయ పౌరులకు సంరక్షణ , సహకారం అందించినందుకు ఐర్లండ్ ప్రధానమంత్రి వరద్కర్‌కు ,ప్రధానమంత్రిశ్రీ నరేంద్రమోదీ కృతజ్ఞతలు తెలిపారు . భారతదేశంలోని ఐరిష్ పౌరులకు కూడా ఇదే విధంగా సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఇరువురు నాయకులూ, మహమ్మారికి వ్యతిరేకంగా ప్రపంచ పోరాటానికి దోహదపడటానికి ఔ షధ వైద్య రంగాలలో భారతదేశం , ఐర్లాండ్ తమ బలాన్ని పెంచుకోగలవని ఇరువురు నాయకులు అంగీకరించారు. కోవిడ్ అనంతర పరిస్థితులలో ఐర్లాండ్‌తో పాటు యూరోపియన్ యూనియన్‌తో భారతదేశ సహకారాన్ని బలోపేతం చేసే అవకాశాలపై కూడా వారు చర్చించారు.
కోవిడ్ సంక్షోభానికి సంబంధించి మారుతున్న పరిస్థితులపై ఎప్పటికప్పుడు సంప్రదించుకుంటూ ఉండాలని ఇరువురు నాయకులూ అంగీకరించారు.
(रिलीज़ आईडी: 1617278)
आगंतुक पटल : 276
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam