గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 నేపథ్యంలో ట్రైఫెడ్ క్రియాశీల చర్యలు
Posted On:
22 APR 2020 2:50PM by PIB Hyderabad
కోవిడ్-19 ప్రపంచ మహమ్మారి సృష్టించిన ప్రస్తుత సంక్షోభంవల్ల దేశంలోని పేద అణగారిన వర్గాల... ప్రత్యేకించి గిరిజనుల జీవనోపాధి తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో అటవీ ఉత్పత్తులను సేకరించే గిరిజనుల కోసం కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ పరిధిలోని ‘ట్రైఫెడ్’ వివిధ రకాల క్రియాశీల చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రచార-అవగాహన కల్పన, వ్యక్తిగత రక్షణాత్మక ఆరోగ్య సంరక్షణ, కలపేతర అటవీ ఉత్పత్తుల కొనుగోళ్లు వంటి చర్యలకు శ్రీకారం చుట్టింది.
స్వల్పకాలిక చర్యలు: సామాజిక దూరంపై అవగాహన
‘వన్‌ధన్ సామాజిక్ దూరీ జాగ్రూకతా అభియాన్’ కింద కలపేతర అటవీ ఉత్పత్తులు సేకరించేవారికి సామాజిక దూరం, స్వీయ గృహ నిర్బంధం, ఆరోగ్య సూత్రాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. ఇందుకోసం యూనిసెఫ్ సమకూర్చిన సమాచార-అవగాహన-సందేశ సరంజామాతోపాటు యూట్యూబ్‌లో వెబినార్‌ల వివరాలను కూడా పొందుపరచింది.
మధ్య-దీర్ఘకాలిక చర్యలు: జీవనోపాధి మార్గాలు
అటవీ ఉత్పత్తుల సేకరణపై ఆధారపడిన కోట్లాది గిరిజనుల కోసం దేశీయాంగ శాఖతో సంప్రదించి, రెండోవిడత దిగ్బంధం మార్గదర్శకాలలో మినహాయింపులు కల్పిస్తూ ఏప్రిల్ 16న కొన్నిటికి సవరణలు చేయించింది. అలాగే ప్రస్తుత పరీక్షా సమయంలో గిరిజనులు ఉత్పత్తిచేసే కలపేతర సూక్ష్మ అటవీ ఉత్పత్తులకు చెల్లించే కనీస మద్దతు ధరను పెంచాల్సిందిగా గిరిజన వ్యవహారాల శాఖ ట్రైఫెడ్‌ను ఆదేశించింది. తదనుగుణంగా అన్ని రాష్ట్రాల్లోని నోడల్ ఏజెన్సీల ద్వారా ప్రాథమిక మార్కెట్లలో కనీస మద్దతు ధరతో అటవీ ఉత్పత్తుల కొనుగోళ్లు చేపట్టాలని 2020 ఏప్రిల్ 17న ఆయా రాష్ట్రాల్లోని గిరిజన వ్యవహారాల శాఖకు ట్రైఫెడ్ సమాచారం పంపింది.
ఆయా కార్యక్రమాలపై యూనిసెఫ్ సరంజామాను ఈ కింది లింకులద్వారా పొందవచ్చు.
ఆయా కార్యక్రమాలపై వెబినార్‌లను యూట్యూబ్‌లో ఈ కింది లింకులద్వారా చూడవచ్చు.
National ToT : Social Distancing | Webminar on Covid19 | Opening Remarks |
Mr. Pravir Krishna | MD | TRIFED https://www.youtube.com/watch?v=A3eDCYih_Rk
Session-1 | Transmission | Webminar on Covid19 | In Collaboration With UNICEF | WHO | TRIFED https://www.youtube.com/watch?v=oR-xLR7ebu4
Session-2 | Personal Safety | Webminar on Covid19 | In Collaboration With UNICEF | WHO | TRIFED https://www.youtube.com/watch?v=zfuM5CNMLv0
Session-3 | Prevention | Webminar on Covid19 | In Collaboration With UNICEF | WHO | TRIFED https://www.youtube.com/watch?v=gfbd2Ir1lZw
Session 4: Session-4 | Stigma | Webminar on Covid19 | In Collaboration With UNICEF | WHO | TRIFED https://www.youtube.com/watch?v=LZg3_3XFgxg
Creatives : VanDhan Social Distancing Awareness Movement | With UNICEF | VanDhan | TRIFED | Govt. of India https://www.youtube.com/watch?v=IXwHg27uBFA
*****
(Release ID: 1617112)
Visitor Counter : 253