ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ -19 పోరాటంలో అధిక భాగస్వామ్యం కోసం రోటారియన్లను (రోటరీ క్లబ్ సభ్యులను) ముందుకు రానివ్వండి – డాక్టర్ హర్షవర్థన్
· రోటరీ ఇంటర్నేషనల్ తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన డాక్టర్ హర్షవర్థన్
· స్వార్థపూరిత మరియు బాధ్యతా రాహిత్య ప్రయోజనాల ద్వారా పుకారు వ్యాప్తి మరియు తప్పుడు సమాచార వ్యాప్తిని నమ్మవద్దని డాక్టర్ హర్షవర్థన్ విజ్ఞప్తి.
Posted On:
21 APR 2020 4:04PM by PIB Hyderabad
కోవిడ్ -19 వ్యతిరేక పోరాటంలో రోటారియన్లు గొప్ప సహకారం అందించడం ఎంతో విలువైనదని, వాస్తవానికి పి.ఎం.కేర్స్ కు సహకారం, ఆసుపత్రుల కోసం పరికరాలు, శానిటైజర్స్, ఆహారం, పి.పి.ఈ. కిట్లు మరియు ఎన్ 95 మాస్కులు మొదలైన వాటి పరంగా ఈ సహకారం ప్రశంసనీయమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి శ్రీ హర్షవర్ధన్ తెలిపారు. కోవిడ్ -19 వ్యతిరేకంగా సాగుతున్న పోరాటంలో మరింత మంది వ్యక్తులను చేర్చుకునే ఉద్దేశంతో వీడియో కాన్ఫరెన్స్ (వి.సి) ద్వారా దేశ వ్యాప్తంగా రొటారియన్లతో సంభాషించేటప్పుడు ఆయన ఈ విషయాన్ని తెలిపారు. నేటికి తాను ప్రజా జీవితంలోకి వచ్చి 27 సంవత్సరాలు గడిచిందని, దేశ వ్యాప్తంగా రొటారియన్లు ఢిల్లీ సహా భారతదేశం నుంచి పోలియో నిర్మూలన కోసం తమ సేవలను అందిచారని తెలిపారు. కోవిడ్ -19 ప్రభావాన్ని తగ్గించే ఈ సవాలును అధిగమించడంలో భారత ప్రభుత్వంతో కలిసి పని చేయడానికి రొటారియన్లు మరో సారి సిద్దం అయ్యారని, ప్రపంచంలో 215 దేశాల్లో వ్యాపించిన కోవిడ్ -19 ను ఓడించేందుకు మనందరం కలిసి పని చేయడానికి ఈ సందర్భంగా ఎదగాలని సూచించారు.
పి.ఎం. కేర్స్ ఫండ్ కోసం 26 కోట్ల రూపాయను అందించిన రొటారియన్లకు డాక్టర్ హర్షవర్థన్ కృతజ్ఞతలు తెలిపారు. మిగతా రొటారియన్లు దాదాపు 75 కోట్లు విలువైన పనులు చేశారని, ఈ విధమైన మానవతా సాయం ప్రశంసనీయమని తెలిపారు.
కరోనా వైరస్ గురించి చైనా మొట్టమొదటి సారి ప్రపంచానికి వెల్లడించిన సందర్భంలో ముందుగా స్పందించిన తొలి దేశం భారతదేశమేనని చెప్పిన ఆయన, మరుసటి రోజు నుంచే భారతదేశం పరిస్థితిని పర్యవేక్షించేందుకు చర్యలు ప్రారంభించిందని, అప్పుడు మొదటి ఉమ్మడి పర్యవేక్షణ సమూహ సమావేశం జరిగిందనే విషయాన్ని గుర్తు చేశారు. ఆయన ఛైర్మన్ గా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేశారని, దేశ వ్యాప్తంగా ప్రాణాంతక వైరస్ కు వ్యతిరేకంగా యుద్ధం సాగడానికి ఇంతకంటే ఏం కావాలన్నారు.
ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రభుత్వ తీసుకున్న చర్యలపై రొటారియన్ల సానుకూల మరియు విలువైన వ్యాఖ్యల విషయంలో తాను సంతృప్తిగా ఉన్నానని, వీటిని ప్రపంచ నాయకులు మరియు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సహా అంతర్జాతీయ సంస్థలు ప్రశంసించాయని తెలిపారు.
కరోనా వైరస్ విషయంలో వ్యాక్సిన్ మరియు ఔషధాలను అభివృద్ధి చేయడంలో చాలా దేశాలు ముందుకు వచ్చాయని, కరోనా వైరస్ కు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటంలో ఇతర దేశాల కంటే భారతదేశం చాలా మెరుగ్గా ఉందనే వాస్తవాన్ని ప్రపంచం అంగీకరిస్తోందని ఆయన తెలిపారు. వ్యాక్సిన్ అభివృద్ధికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి, అప్పటి వరకూ మనం లాక్ డౌన్ మరియు సోషల్ డిస్టెన్సింగ్ సూత్రాలను అనుసరించడం ద్వారా ఉపయోగించగల సమర్థవంతమైన సోషల్ వ్యాక్సిన్ పై ఆధారపడవచ్చని ఆయన తెలిపారు.
చాలా దేశాలు అవసరమైన వ్యాక్సిన మరియు ఔషదాలను అభివృద్ధి చేయడంలో పాలు పంచుకున్నాయని, అది అభివృద్ధి దిశలో సుదీర్ఘ ప్రయాణని, తర్వాత ప్రపంచ వ్యాప్తంగా బాధిత ప్రజలకు దీన్ని పరిచయం చేయడం జరుగుతుందని తెలిపిన ఆయన, తన ఆధీనంలో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ కూడా ఆవిష్కరణల పై కృషి చేస్తోందని, పరీక్షా వేగాన్ని వేగవంతం చేస్తున్న ప్రాజెక్టులకు నిధులు కూడా సమకూరుస్తోందని ఆయన తెలిపారు. కోవిడ్ -19 ను కేవలం రెండు గంటల్లో నిర్థారించగల తక్కువ ఖర్చుతో కూడిన డయాగ్నొస్టిక్ టెస్ట్ కిట్ ను శ్రీ చిత్ర తిరునల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ ( ఎస్.సి.టి.ఐ.ఎం.ఎస్.టి) అభివృద్ధి చేసిందని, చిత్ర జీన్ లాంప్ – ఎన్ అని పిలువబడే సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం నిధులు సమకూర్చిందని, ఈ టెస్ట్ కిట్ ఎస్.ఎ.ఆర్.ఎస్ – కోవి-2 ఎన్ - జన్యువు కోసం చాలా ప్రత్యేకమైందని జన్యువు యొక్క రెండు విభాగాలను ఇది గుర్తిస్తుందని, ఆదే విధంగా ఇది పరీక్ష కూడా పూర్తి స్థాయిలో సమర్థవంతంగా చేస్తుందని, వైరల్ జన్యువు వ్యాప్తి సమయంలో ఇది మ్యూటేషన్ కు లోనవుతుందని ఆయన తెలిపారు.
చుట్టు పక్కల ఉన్న ప్రమాదం గురించి తెలుసుకుని, జాగ్రత్త పడే ప్రజల ఆసక్తిన ప్రస్తావించి డాక్టర్. హర్ష వర్షన్ 5 కోట్లకు పైగా ప్రజలు ఆరోగ్య సేతు మొబైల్ యాప్ డౌన్ లోడ్ చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. కోవిడ్ -19 కు వ్యతిరేకంగా సాగుతున్న సంయుక్త పోరాటంలో భారత ప్రజలతో అవసరమైన ఆరోగ్య సేవలను అనుసంధానించడానికి భారత ప్రభుత్వ ఈ మొబైల్ యాప్ ను అభివృద్ధి చేసిందని తెలిపారు. కోవిడ్ -19 కలిగి ఉండడానికి సంబంధించిన ఇబ్బందులు, ఉత్తమ పద్ధతులు మరియు సంబంధింత సలహాల గురించి ఈ యాప్ వినియోగదారులను ముందుగానే చేరుకోవడంలో మరియు తెలియజేయడంలో భారత ప్రభుత్వ చొరవను పెంచుతుందని తెలిపారు.
ఈ వ్యాప్తి సమయంలో ప్రస్తుత ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ మీద ఉన్న డిమాండ్ ను తీర్చేందుకు అవసరమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడానికి ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఒక వివరణాత్మక మార్గదర్శకాన్ని విడుదల చేసిందని, అలాంటి రోగులకు టెలి కన్సల్టేషన్, డిజిటల్ ప్రిస్క్రిప్షన్ మరియు ఇంటికే ఔషధాలను అందిచే సేవల దిశగా డాక్టర్ హార్షవర్థన్ రోటరియన్లను ప్రోత్సహించారు. కొనసాగుతున్న పుకార్లు మరియు తప్పుడు సమాచారం కొన్ని స్వార్థపూరిత మరియు బాధ్యతా రాహిత్య ఆసక్తుల ద్వారా వ్యాప్తి చెందుతోందని, ఈ పరిస్థితిని అధిగమించడానికి ప్రభుత్వం 543 కోట్ల ఎస్.ఎం.ఎస్.లను పంపించి, వాస్తవ సంభాషణ ప్రారంభించే ముందు రికార్డు చేసిన కాలర్ ట్యూన్ సందేశాన్ని ప్రవేశపెట్టిందని తెలిపారు.
రొటారియన్ల నుంచి మరోసారి క్రియాశీల సహకారం కోసం ఎదురు చూస్తున్నానని, ఇది దేశం యొక్క ఉత్తమ ప్రయోజనాలకు ఉద్దేశించిన ఫలితం అని మరో సారి కచ్చితంగా రుజువు అవుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
--
(Release ID: 1616815)
Visitor Counter : 244