గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

పౌరుల గృహ నిర్బంధాన్ని ట్రాక్ చేసేందుకు సైయం మొబైల్ యాప్ వినియోగిస్తున్న పూణె

Posted On: 21 APR 2020 3:56PM by PIB Hyderabad

గృహ నిర్బంధంలో ఉన్న పౌరులను సమర్థవంతంగా ట్రాక్ చేసేందుకు మరియు వారు నిజంగా ఇంట్లోనే ఉన్నారని నిర్థారించుకోవడానికి, సైయాం అనే మొబైల్ యాప్ ను స్మార్ట్ సిటీస్ మిషన్ (ఎస్.సి.ఎం) కింద  పూణె మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి చేసింది.

గృహ నిర్బంధంలో ఉన్న పౌరుల పర్యవేక్షణకు సాంకేతిక పరిష్కారాలతో ఉన్నతమైన పరిపాలనా చర్యలను నగర పరిపాలన విభాగం తీసుకుంది. రోజూ ఇంటి నిర్బంధంలో ఉన్న వ్యక్తుల ఫాలో అప్ కోసం ఐదు జోన్లకు ప్రత్యేక బృందాలను నియమించింది. అంతర్జాతీయ పర్యటనల నుంచి ఇటీవల తిరిగి వచ్చిన వ్యక్తులు మరియు కోవిడ్ -19 చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయిన వారిని ఈ బృందాలు తనిఖీ చేస్తాయి. దీని ప్రకారం, బృందాలు వారి ఆరోగ్య స్థితి మరియు వారితో సంబంధం ఉన్న వ్యక్తుల వివరాల పై నిర్బంధ వ్యక్తుల నుంచి నూతన సమాచారాన్ని తీసుకుంటారు. క్వారంటైన్ స్టాంప్ వేయించుకున్న వ్యక్తుల కోసం ప్రత్యేకమైన ఆహారం, మంచం, పాత్రలు, బట్టలు మరియు మరుగుదొడ్లను అందించారా లేదా అనే విషయాన్ని ఈ బృందాలు తనిఖీ చేస్తాయి.

ఇంటి నిర్బంధంలో ఉన్న వారు ఈ యాప్ ను డౌన్ లోడ్ చేశారా లేదా అనే విషయాన్ని కూడా ఈ బృందాలు తనిఖీ చేస్తాయి. మొబైల్ అప్లికేషన్లలో జి.పి.ఎస్. ట్రాకింగ్ ఉంది. తద్వారా నిర్బంధ పౌరులు తమ ఇళ్ళను విడిచిపెట్టినప్పుడల్లా నగర పరిపాలనా విభాగం అప్రమత్తమౌతుంది. అనంతరం స్థానిక్ వార్డ్ లేదా పోలిస్ స్టేషన్ కు సమాచారం వస్తుంది. వెంటనే వారు ఆ కుటుంబాన్ని సందర్శించి పరిస్థితిని పర్యవేక్షిస్తారు.

 

   

 

 

 

   

గృహ నిర్బంధంలో ఉన్న పౌరులందరూ ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసి, ఇన్ స్టాల్ చేసుకోమని ఆదేశించారు. ఈ గుర్తించిన పౌరుల పరికరాల్లో జి.పి.ఎస్. ను ఎప్పుడూ ఆన్ లో ఉంచాలని మరియు నిర్బంధం వ్యవధిలో 24 గంటలు మొబైల్ పరికరాన్ని ఆన్ లోనే ఉంచాలని సూచించారు. పౌరుల కదలికలను పర్యవేక్షణ సెల్ నుంచి కేంద్ర నిజ సమయ పర్యవేక్షణ చేయవచ్చు. అంతే కాకుండా వాటిని ఎరుపు, పసుపు లేదా ఆకుపచ్చ రంగుల్లో గుర్తించవచ్చు. ఎరుపు రంగు వ్యక్తి ఎక్కువ బయట ఉన్నట్లు, పసుపు రంగు వచ్చిన వ్యక్తికి పరిమిత కదలికలు ఉన్నాయని సూచిస్తుంది. ఆకుపచ్చ వ్యక్తి ఇంటి పరిమితుల్లోనే ఉన్నాడని సూచిస్తుంది.

 

గృహ నిర్భంధ పౌరుల పర్యవేక్షణ డాష్ బోర్డ్ ఉదాహరణ క్రింద ఇవ్వబడింది

 

గృహ-నిర్బంధ పౌరుల కదలికల యొక్క నిజ-సమయ ట్రాకింగ్ క్రింద చూపబడింది:

****

 

(Release ID: 1616807) Visitor Counter : 244