సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

కోవిడ్ -19 కు వ్యతిరేకంగా భారతదేశ పోరాటంలో సివిల్ సర్వెంట్స్ అందిస్తున్న‌ అద్భుతమైన సేవలను సివిల్ సర్వీసెస్ దినోత్సవం సందర్భంగా ప్ర‌శంసించిన డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 21 APR 2020 4:09PM by PIB Hyderabad

కేంద్ర సిబ్బంది వ్య‌వ‌హారాలు, ప్ర‌జాఫిర్యాదులు, పెన్ష‌న్‌ల శాఖ స‌హాయ‌మంత్రి డాక్ట‌ర్ జితేంద్ర సింగ్ ఈరోజు సివిల్ స‌ర్వీసుల దినోత్స‌వం 2020 సంద‌ర్బంగా దేశ‌వ్యాప్తంగా 25 రాష్ట్రాలు, 5 కేంద్ర‌పాలిత ప్రాంతాల సివిల్ స‌ర్వెంట్ల‌తో వీడియో కాలింగ్ ద్వారా సంభాషించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కోవిడ్ -19 పై పోరాటంలో సివిల్ స‌ర్వెంట్ల అద్భుత కృషిని ఆయ‌న కొనియాడారు.

 



ప్రకృతి వైపరీత్యాల స‌మ‌యంలో తోడ్పడేందుకు 29 స‌ర్వీసు అసోసియేష‌న్ల‌ను ఒకచోట చేర్చే కరుణ‌ ప్లాట్‌ఫామ్  విజ‌య‌వంతం కావ‌డాన్ని  ఉదహరిస్తూ, వివిధ స‌ర్వీసుల మ‌ధ్య మ‌రింత స‌హ‌కారానికి డాక్ట‌ర్ జితేంద్ర‌సింగ్  పిలుపునిచ్చారు.ప్రధానమంత్రి కేర్స్ ఫండ్‌కు ఒక రోజు జీతం అందించడం ద్వారా  ప్ర‌భుత్వం చేప‌ట్టిన కోవిడ్ -19 సహాయ కార్యకలాపాలకు సివిల్  స‌ర్వెంట్లు  మద్దతు ఇచ్చినందుకు ఆయ‌న  వారిని అభినందించారు. కోవిడ్ -19 మ‌హ‌మ్మారిని ఎదుర్కొవ‌డంలో జిల్లా క‌లెక్ట‌ర్లు ముందుండి  నాయ‌క‌త్వం వ‌హిస్తున్నారు. భార‌త‌దేశంలో కోవిడ్ మ‌హమ్మారి వ్యాప్తిని అరిక‌ట్టే బాధ్య‌త సివిల్ స‌ర్వెంట్ల భుజ‌స్కంధాల‌పై ఉంచ‌డం జ‌రిగింది.
 
క‌నీస ప్ర‌భుత్వం, గ‌రిష్ఠ పాల‌న అనేది ప్ర‌ధాన‌మంత్రి  శ్రీ న‌రేంద్ర మోదీ నాయ‌క‌త్వంలోని ప్ర‌భుత్వ నినాద‌మ‌ని అన్నారు. గ‌త ఆరు సంవ‌త్స‌రాల‌లో దేశం చెప్పుకోద‌గిన స్థాయిలో సివిల్ స‌ర్వీసు సంస్క‌ర‌ణ‌ల‌ను తీసుకువ‌చ్చింది. ప్ర‌భుత్వ సంస్థ‌ల పున‌ర్‌నిర్మాణం, స‌రైన స్థితిలో వాటిని ఉంచ‌డం, జాయింట్ సెక్ర‌ట‌రీ స్థాయిలో లేట‌ర‌ల్ ఎంట్రీ వంటి రిక్రూట్‌మెంట్ సంస్క‌ర‌ణ‌లు, ఈ సేవ‌ల‌పై ప్ర‌త్యేక‌దృష్టితో ప్ర‌జాసేవ‌ల ప‌నితీరును మెరుగుప‌ర‌చ‌డం, పౌరులే ప్ర‌ధాన కేంద్రంగా ప‌లు చ‌ర్య‌లు  వంటి వాటిని ఎన్నింటినో  ప్ర‌భుత్వం చేప‌ట్టింది.
 భారతదేశ పౌర సేవలను ప్రపంచ ఉత్తమ పద్ధతులతో సమానంగా తీసుకురావడానికి చేసిన ప్రయత్నాన్ని, 2019లో  విడుద‌లైన సుప‌రిపాలన సూచిక , నేషనల్ ఇ-సర్వీసెస్ డెలివరీ అసెస్‌మెంట్  సూచిస్తుంది. భారత పాలన నమూనా మెరిటోక్రసీ ని, రాజ్యాంగ విలువలను ప్రోత్సహిస్తున్నట్లు  గుర్తించబడింది.
 2019 సెప్టెంబర్ నుండి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ  సమగ్ర పునరుద్ధరణ జరిగిందని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు..ఇది ఫిర్యాదుల పరిష్కార నాణ్యతను మెరుగుపర‌చ‌డ‌మే కాక  ఫిర్యాదుల ప‌రిష్కార వ్య‌వ‌ధిని త‌గ్గించింద‌న్నారు.  నేష‌న‌ల్ మానిట‌ర్ ఫ‌ర్ కోవిడ్ -19 ప‌బ్లిక్ గ్రీవెన్సెస్ (https://www.darpg.gov.in ) కు  20 రోజుల‌లో అంటే ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 20 ,2020 వ‌ర‌కు వ‌చ్చిన ఫిర్యాదుల‌లో 25,000 కోవిడ్ -19 ఫిర్యాదులు ప‌రిష్కారానికి నోచుకోవ‌డం ప‌ట్ల ఆయ‌న సంతొషం వ్య‌క్తం చేశారు..  అంటే స‌గ‌టున 1.57 రోజుల‌లో ఫిర్యాదులు ప‌రిష్కారమయ్యాయి.
ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ -19  మహమ్మారి వ్యాప్తి చెందడంతో, 21 ఏప్రిల్ 2020 న జ‌ర‌గాల్సిన‌ సివిల్ సర్వీసెస్ డే కార్య‌క్ర‌మాన్ని లాక్‌డౌన్   కారణంగా వాయిదా వేశారు.
ప్ర‌భుత్వ‌పాల‌న‌లో ఎక్స్‌లెన్స్ కు సంబంధించి ప్ర‌ధాన‌మంత్రి పుర‌స్కారం 2019,2020 సంవ‌త్స‌రాల‌కు 2020 అక్టోబ‌ర్ 31న స‌ర్దార్ వ‌ల్ల‌భాయ్ ప‌టేల్ జ‌యంతి రోజున ప్ర‌దానం చేస్తారు.
కోవిడ్ 19 పై పోరాటానికి సంబంధించి  డిఒపిటి కిచెందిన ఈ లెర్నింగ్ ప్లాట్ ఫాం (https://igot.gov.in) పై 1,44,736 మందికిపైగా  త‌మ పేర్ల‌ను న‌మోదు చేసుకోవ‌డం ప‌ట్ల డాక్ట‌ర్ జితేంద్ర సింగ్ సంతృప్తి వ్య‌క్తం చేశారు.ఈ ప్లాట్ఫాంను ఈనెల 8 వ‌తేదీన ప్రారంభించ‌గా  96,268 మంది అభ్య‌ర్థులు కోర్సును పూర్తి  చేశారు.

 



ప్ర‌భుత్వం చేప‌ట్టిన కోవిడ్ -19 స‌హాయ చ‌ర్య‌ల‌కు మ‌ద్ద‌తుగా కేంద్ర‌ప్ర‌భుత్వంలోని వివిధ మంత్రిత్వ‌శాఖ‌ల‌కు చెందిన సివిల్ స‌ర్వెంట్లు  పిఎం కేర్స్ నిధికి త‌మ ఒక రోజు వేత‌నం కింద, సిఎస్ఆర్ కంట్రిబ్యూష‌న్ల ద్వారా ఇప్ప‌టివ‌ర‌కూ రూ 4227 కోట్ల రూపాయ‌ల‌కు పైగా  మొత్తాన్ని అంద‌జేయ‌డం గురించి ఇక్క‌డ ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించుకోవాలి.

***



(Release ID: 1616801) Visitor Counter : 173