నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ

సోలార్ పి.వి. మోడ్యూల్స్ మరియు సోలార్ పి.వి. సెల్స్ నమూనాలు మరియు తయారీదారుల ఆమోదం పొందిన జాబితా అమలు తేదీని 30.09.2020 వరకు ఆరు నెలల పాటు పొడిగించిన ఎమ్.ఎన్.ఆర్.ఈ.

Posted On: 21 APR 2020 2:30PM by PIB Hyderabad

సోలార్ పి.వి. మోడ్యూల్స్ మరియు సోలార్ పి.వి. సెల్స్ నమూనాలు మరియు తయారీదారుల ఆమోదం పొందిన జాబితా అమలును కోవిడ్ -19 సంక్షోభం కారణంగా 2020 సెప్టెంబర్, 30వ తేదీ  వరకు ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్లు నూతన & పునరుత్పాదక శక్తి (ఎమ్.ఎన్.ఆర్.ఈ.) మంత్రిత్వశాఖ ఇటీవల ఒక అధికారిక ప్రకటనలో తెలియజేసింది. గతంలో ఈ గడవు తేదీ 2020 మార్చి 31 గా ఉంది. 

దేశానికి విద్యుత్ భద్రత కల్పించి, సోలార్ పి.వి. సెల్స్ మరియు మోడ్యూల్స్ విశ్వసనీయతను నిర్ధారించాలని ఉద్దేశ్యంతో,  నూతన & పునరుత్పాదక శక్తి (ఎమ్.ఎన్.ఆర్.ఈ.) మంత్రిత్వశాఖ, బి.ఐ.ఎస్., పి.వి.సెల్స్ మరియు మోడ్యూల్స్ నమూనాలు మరియు తయారీదారుల (ఏ.ఎల్.ఎం.ఎం.)  ఆమోదం పొందిన జాబితాకు సంబంధించి 2019 జనవరి 2వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. మొదటి జాబితాలో సోలార్ పి.వి. మాడ్యూళ్ళ నమూనాలు మరియు తయారీదారుల వివరాలు, రెండవ జాబితాలో సోలార్ పి.వి. సెల్స్ నమూనాలు మరియు తయారీదారుల వివరాలు పొందుపరచాలని యంత్రాంగం ప్రతిపాదించింది. 

అమలు తేదీ తర్వాత, ప్రభుత్వ యాజమాన్యంలో / ప్రభుత్వ సహకారంతో నిర్వహించబడుతున్న అన్ని సోలార్ పి.వి. పవర్ ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వ ప్రమాణిక బిడ్డింగ్ మార్గదర్శకాల ప్రకారం సోలార్ పి.వి. సెల్స్ మరియు మోడల్స్ కొనుగోలుచేయాలని ఏ.ఎల్.ఎం.ఎం. తన ఆదేశంలో పేర్కొంది.   అమలు తేదీ తర్వాత ఏ.ఎల్.ఎమ్ఎం. జాబితాలో పేర్కొని, ఆమోదంపొందిన తయారీదారుల నుండి మాత్రమే సోలార్ పి .వి. సెల్స్ మరియు మోడ్యుల్స్ తప్పనిసరిగా కొనుగోలు చేయాలి 

ఏ.ఎల్.ఎం.ఎం. జాబితాలు ఆచరణలోకి వచ్చిన అనంతరం పి.వి. సెల్స్ మరియు మోడ్యూల్స్ ను ఏ.ఎల్.ఎం.ఎం. జాబితా నుండి మాత్రమే కొంగోలుచేయాలనే తప్పనిసరి నిబంధన తమ టెండర్ నోటీసుల్లో పొందుపరచాలని సంబంధిత (కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన) సంస్థలను  ఎమ్ఎన్.ఆర్.ఈ. నిరంతరం ఖచ్చితంగా ఆదేశిస్తోంది. 

సోలార్ పి. వి. సెల్స్ మరియు మోడ్యూల్స్ తయారీదారులు, పునరుత్పదక విద్యుత్ (ఆర్.ఈ.) ఉత్పత్తిదారులు, అమలుచేసే సంస్థలు, ఆర్.ఈ. విద్యుత్ ను సేకరించే వారు, ముఖ్యంగా ఆర్.ఈ రంగానికి ఆర్ధిక సహాయాన్ని అందించే  బ్యాంకులు, ఆర్ధిక సంస్థలు తమ కార్యకలాపాలు  సోలార్ పి.వి. సెల్స్ మరియు మాడ్యూల్స్ నమూనాలు మరియు తయారీదారుల ఆమోదించిన జాబితా కు సంబంధించి 2019 జనవరి 2వ తేదీన జారీచేసిన ఆదేశాలకు పూర్తిగా కట్టుబడి ఉండాలని ఎమ్.ఎన్.ఆర్.ఈ.పి. పునరుద్ఘాటించింది. 

 ***


(Release ID: 1616750) Visitor Counter : 181